breaking news
Poor cancer patients
-
ఉచిత వైద్యం అందించాల్సిందే
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ భూమిని రాయి తీ ధరకు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేవని హైకోర్టు తేల్చిచెప్పింది. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పేద వితంతువుకు బసవతారకం ఇండో–అమెరికన్ కేన్సర్ హాస్పిటల్లో వెంటనే ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన 25% ఉచిత ఇన్పేòషేంట్ చికిత్స కోటా కింద బాధితురాలిని చేర్చుకుని రుసుములు వసూలు చేయకుండా చికిత్స ప్రారంభించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.అలాగే ఆ నిబంధనలు నిజంగా అమలవుతున్నాయా.. లేదా.. అనే అంశంపై డీఎంహెచ్‌వో పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. కరీంనగర్‌లోని వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత తన వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో లేదని, చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును తానే భరించాలని ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడే షరతులు పిటిషనర్ తరఫున న్యాయవాది మల్లారెడ్డి గాడిపల్లి, సీనియర్ న్యాయవాది గండ మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 1989లో ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని బసవతారకం కేన్సర్ ఫౌండేషన్‌కు రాయితీపై లీజుకు ఇచి్చందన్నారు. ఆ సమయంలో ఆస్పత్రి 25 % ఇన్‌పేషెంట్ పడకలను పేద రోగులకు ఉచితంగా కేటాయించాలని, 40% ఔట్‌పేషెంట్ సేవలనూ ఉచితంగా అందించాలనే షరతులు విధించిందని తెలిపారు.ఈ షరతుల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 2022లో జీవో 80 జారీ చేసి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. తాము ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స కోరడం లేదని, ప్రభుత్వ భూమిని రాయితీపై పొందినందుకు ప్రతిఫలంగా ఆస్పత్రిపై ఉన్న 25 శాతం ఉచిత చికిత్స బాధ్యతను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. పిటిషనర్ జూలై 15న సంబంధిత అధికారులకు ఈ మేరకు వినతిపత్రాలిచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కోర్టు అత్యవసర జోక్యం: వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ కేన్సర్‌తో బాధపడుతూ తక్షణ వైద్య సహా యం అవసరమైన పరిస్థితిలో ఉన్నారని గుర్తించి, ఈ దశలో చికిత్స ఆలస్యం అయితే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉన్నందున, తుది విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. భాగ్యమ్మను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించాలని, కన్సల్టేషన్, పరీక్షలు, కీమో థెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మందులు, ఆస్పత్రిలో చేరిక తదితర అన్ని వైద్య సేవలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందించాలని బసవతారకం ఆస్పత్రిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే చాన్స్ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఒక్క బాధితురాలికే పరిమితం కాకుండా ఇతరులకు, అలాగే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తీసుకున్న లేదా ఇతర రాయితీలు పొందిన ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వర్తిస్తాయా? ఇవన్నీ పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాయా.. లేదా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి. -
పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని నెల్లూరు ( వైద్యం ) : జిల్లాలోని పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో శనివారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ పేషంట్లకు రెడ్‌క్రాస్ లేదా మెడికల్ కళాశాల పరిధిలో సేవలు అందించాల్సిన విషయాన్ని చర్చిస్తున్నామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి వారంలోగా నివేదికలు పంపాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. సివిల్ సర్జన్ల విషయం డీఎంఈతో చర్చిస్తా జీఓ నంబరు 138తో తమకు అన్యాయం జరిగిందని సివిల్ సర్జన్లు మంత్రి కామినేనిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కొన్నేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్న తమను ఇతర జిల్లాలకు బదిలీచేయడంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అర్ధాంతరంగా బదిలీలు చేస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతాయని వివరించారు. స్పందించిన మంత్రి బదిలీలపై డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌తో చర్చిస్తానన్నారు. వీలైనంత వరకు దగ్గరలో ఉండే ఆసుపత్రులలోనే సివిల్ సర్జన్లు పనిచేసేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీకాంత్, కమిషనర్ చక్రధర్‌బాబు, ఇన్చార్జి డీఎంహెచ్ఓ కోటేశ్వరి, ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు, డీసీహెచ్ఎస్ సుబ్బారావు, మెడికల్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌రెడ్డి, ఆర్ఎంఓ ఉషా సుందరి, వైద్యులు శాస్త్రి, నిరంజన్, కెఎస్ రాజు, రమణయ్య, నాయకులు రామకృష్ణారావు, శేషారత్నం పాల్గొన్నారు.


