breaking news
Poonam bajva
-
రాజస్థాన్‌లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..వారణాసిలో ఛాయ్ తాగుతూ రేణు దేశాయ్..అందాలు ఒలకబోస్తోన్న అరియానా గ్లోరీ..అలాంటి డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు.. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
అతన్ని ప్రేమలో పడేసిన పూనంబాజ్వా
ఎంతవారుగానీ, వేదాంతులైనగానీ కాంతదాసులే అన్నారో కవి. అలా 40 ఏళ్ల బ్రహ్మచారి, రాజకీయమే జీవితంగా సాగిపోతున్న సుందర్.సీని ఒక్క చూపుతోనే ప్రేమలో పడేసింది నటి పూనంబాజ్వా. ఆమె ప్రేమ మైకంలో పడి సుందర్.సీ గిలగిలా కొట్టుకున్న వైనం చూడాలంటే ఇంకొంచెం రోజులు ఆగాల్సిందే. విషయం ఏమిటంటే దర్శకత్వం, నటన అంటూ మారి మారి రెండు విధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న దర్శకుడు సుందర్.సీ తాజాగా కథానాయకుడు,నిర్మాతగా మారి నటి పూనంబాజ్వాతో రొమాన్స్ చేస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన వెళ్లిమూంగా చిత్ర తమిళ్ రీమేక్‌లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. దీనికి సుందర్.సీ శిష్యుడు వెంకటరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అరణ్మణై-2 చిత్రంలో పరిధి తక్కువ పాత్రలో అయినా అందాలారబోసి ఆకట్టుకున్న పూనంబాజ్వాకు సుందర్.సీ ఈ చిత్రంలో సోలో హీరోయిన్గా అవకాశం ఇవ్వడం విశేషం. ఈ చిత్రంలో తన పాత్ర గురించి పూనంబాజ్వా తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తాను పూర్తిగా డీగ్లామర్ పాత్రను పోషిస్తున్నానని చెప్పింది. అయితే తన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలిపింది. ఇది ఒక చిన్న పట్టణంలో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. ఈ చిత్రంతో తన టైమ్ బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పెళ్లికి దూరంగా రాజకీయమే జీవితంగా సాగే 40 ఏళ్ల సుందర్.సీ యుక్త వయసు విద్యార్థి పూనంబాజ్వా కంట పడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడట. ఇక ఆ తరువాత ఇటు ప్రేమ, అటు రాజకీయాలతో ఎదురయ్యే సమస్యలను వినోదాల విందుగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదని యూనిట్ వర్గాలు వెల్లడించారు. తిరునల్వేలి, చెన్నై, ఢిల్లీ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. దీనికి సిద్ధార్థ్విపిన్ సంగీత బాణీలు కడుతున్నారు. -
ముగ్గురు స్నేహితులు.. ఒక ప్రయాణం!
‘‘ఈ మధ్యే భోగి సంబరాలు జరుపుకున్నాం. మళ్లీ నేను భోగి పండగ మూడ్‌లో ఉండబోతున్నా’’ అంటున్నారు త్రిష. అలా అనడానికి కారణం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష, పూనమ్ బజ్వా, ఓవియా కథానాయికలుగా ‘భోగి’ అనే చిత్రం రూపొందుతోంది. ముగ్గురు స్నేహితులు, ఒక ప్రయాణం నేపథ్యంలో సాగే మంచి థ్రిల్లర్ మూవీ ఇదని త్రిష పేర్కొన్నారు.