వాటర్ ట్యాంకెక్కిన టీఆర్ఎస్ నాయకులు
మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకోవద్దంటూ డిమాండ్
బోధన్ టౌన్ : మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీకి చెందిన నలుగురు నాయకులు శనివారం బోధన్ పట్టణం బస్వతారక్ నగర్ కాల నీలోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పద వితోపాటు మంత్రి పదవి ఇస్తున్నారని పుకార్లు వస్తున్నాయని, దీనిని తాము నిరసిస్తున్నామన్నారు.
ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టి బొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టీఆర్ఎస్ నేతలను సముదాయించేందుకు యత్నించారు. అయితే, తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు దిగేదిలేదని, పోలీసులు అతిగా చేస్తే దూకుతామని వారు హెచ్చరించడంతో ఎస్ఐ గంగాధర్ ఉన్నతాధికారులకు సమాచారమందించారు.
వారు ఎంపీ కవి త, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌తో చర్చలు జరిపారు.
మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకోమని ఎంపీ హామీ ఇచ్చారని ట్యాంకుపై ఉన్నవారికి ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో వారు కిందికి దిగి వచ్చారు.ఈ సందర్భంగా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజాక్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని సుదర్శ న్ రెడ్డి టీఆర్ఎస్లోకి వస్తాననడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఉద్యమకారులపై పోలీసులతో కేసులు పెట్టించారని గుర్తు చేశారు. టవర్ ఎక్కిన వారిలో రజా క్తో పాటు కౌన్సిలర్లు షర్ఫొద్దీన్, భరత్‌యాదవ్, హనీఫ్ ఉన్నారు.