breaking news
Phuket
-
ఆటగాళ్ల వేలం పూర్తి.. సీజన్-2 కూడా హైదరాబాద్‌లోనే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపిన ‘సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్’ (సీసీపీఎల్) రెండో సీజన్‌కు కూడా మళ్లీ హైదరాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆటగాళ్ల వేలం పూర్తయింది. థాయిలాండ్‌లోని ఫుకెట్ వేదికగా సెప్టెంబరు 3 నుంచి 6 వరకు నిర్వహించిన సీజన్-2 ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. గత ఏడాది 'హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్' (హెచ్పీఎల్) పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు 'సీసీపీఎల్'గా మరింత ఆకర్షణీయంగా రెండో సీజన్‌కు సిద్ధమైంది. ఈ లీగ్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.ముగిసిన ఆటగాళ్ల వేలం..రిటెన్షన్ల హంగామాపుకెట్లోని 'కోకోనట్ పికిల్‌బాల్ సెంటర్'లో రెండో సీజన్ కోసం క్రీడాకారుల వేలం నిర్వహించారు. దీనికి ముందే పలు ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపెట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడు. మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తరఫునే బరిలోకి దిగనున్నారు. కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి కూడా రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారు.పూర్తి కొత్త జట్టుతోమరోవైపు.. చార్జర్స్ జట్టు మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఒక్కరిని కూడా రిటెయిన్ చేసుకోకుండా నేరుగా ఫుల్ బడ్జెట్‌తో వేలంలోకి దిగి కొత్త జట్టును నిర్మించుకుంది. రిటెన్షన్ తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వేలంలో పోటాపోటీగా తలపడ్డాయి.ఆరు వారాల్లో రెండో సీజన్"లీగ్ ప్రస్థానం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. ఇక్కడి నుంచే ఫ్రాంచైజీ ఆధారిత పికిల్‌బాల్ లీగ్ సామర్థ్యాన్ని గుర్తించాం. తొలి సీజన్ అనుభవాలతో రెండో సీజన్ ను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం" అని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల తెలిపారు. మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. ఆటగాళ్ల రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ పిక్స్ ద్వారా ఈ సీసన్లో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టమైందని పేర్కొన్నారు. పుకెట్‌లో వేలం ప్రక్రియ పూర్తి కావడంతో లీగ్ ప్రారంభానికి ఆరు వారాల సమయం ఉంది. జట్లన్నీ సమాయత్తమవ్వడానికి ఇది సరైన సమయమని నిర్వాహకులు వెల్లడించారు. -
గాల్లో ఉండగానే ‘హైడ్రాలిక్’ విఫలం
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తూ గాల్లో భారీ కుదుపులకు లోనైన ఎయిరిండియా విమానంలో ఉన్న మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమైనట్లు ఎయిర్‌క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) ప్రకటించింది. సుమారు 145 మందితో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూండగా ఈ ఎయిర్‌బస్ విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమయ్యాయని, దీంతో ఆటోపైలట్‌తో అనుసంధానం లేకుండా పోవడమే కాకుండా.. అకస్మాత్తుగా విమానం కిందకు జారిపోవడం మొదలైన విషయం తెలిసిందే. ఆగస్టు నాలుగవ తేదీన జరిగిన ఈ ఘటనలో దాదాపు 24 మంది గాయపడ్డారు. ఆ తరువాత విమానం ఢిల్లీలో సురక్షితంగానే ల్యాండైనా మాదకద్రవ్య పరీక్షల్లో పైలట్ విఫలమయ్యాడు. దీంతో ఏఏఐబీ పైలట్‌పై చర్యకు సిఫారసు చేస్తూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. అయితే పైలట్ మత్తుమందులు తీసుకోవడానికి, హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమయ్యేందుకు సంబంధం ఉన్నదీ లేనిది మాత్రం ఈ నివేదిక స్పష్టం చేయలేదు. విచారణ కొనసాగుతోందని మాత్రం తెలిపింది. ఘటన జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అంత ప్రతికూలంగా ఏమీ లేకపోవడంతో ఏఏఐబీ అధికారులు హైడ్రాలిక్ వ్యవస్థలు, ఇతర కారణాలపై దృష్టి పెట్టారు. సుమారు పది పేజీలున్న ప్రాథమిక నివేదిక ప్రకారం ఘటన జరిగిన సమయంలో విమానానికి సంబంధించిన పచ్చ, నీలి, పసుపు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి విఫలమయ్యాయి. ఆ తరువాత కొన్ని సెకన్లలోనే పనిచేయడం మొదలైనప్పటికీ తాత్కాలిక వైఫల్యం కారణంగా విమానం కేబిన్ లోపల భారీ నష్టం జరిగింది. సీలింగ్ ప్యానెళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, సీట్లపైనున్న బిన్స్ చెల్లాచెదురయ్యాయి. అలాగే కురీ్చ ల హ్యాండ్ రెయిల్స్ ధ్వంసమయ్యాయి. కోపైలట్‌పై జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. పైలట్ విషయంలో పరీక్షలు పాజిటివ్‌గా తేలినందున డీజీసీఏ తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. పైలట్‌కు ఉద్వాసన ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం భారీ కుదుపులకు గురై 24 మంది గాయపడిన ఘటనలో ప్రధాన పైలట్‌కు ఎయిర్ ఇండియా శుక్రవారం ఉద్వాసన పలికింది. ప్రమాద ఘటన తరువాత న్యూఢిల్లీలో పైలట్‌పై జరిపిన మాదకద్రవ్యాల పరీక్షలు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. భద్రత, ఫిట్నెస్, రెగ్యులేటరీ అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉల్లంఘనలను సహించేది లేదని, అందువల్లనే పైలట్‌ను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
రన్ వేపై దిగుతుండగా.. ఊడిన చక్రం.. ఎయిరిండియాకు తప్పిన ఘోర ప్రమాదం..
-
టేకాఫ్ అయిన ఎనిమిది నిమిషాలకు..
శంషాబాద్ (హైదరాబాద్): టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఫుకెట్ విమానం వెనక్కి తిరిగి వచి్చంది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్–110 విమానం (బోయింగ్ 737) శనివారం ఉదయం 6.41 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరేందుకు టేకాఫ్ తీసుకుంది. విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు.ఉదయం 6.49 గంటల సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. ఏటీసీ అనుమతి మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 6.57 గంటలకు సురక్షితంగా దించారు. సాంకేతిక సమస్యల సర్దుబాటు అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి ఫుకెట్ విమానం బయల్దేరినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
ఏరా పులి..!
రేయ్.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే రిస్క్‌లో పడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్టు.ఈ భూమ్మీద పులులకు స్వర్గధామంగా థాయ్‌లాండ్ ఫుకెట్(Phuket)కు పేరుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు.. ఫొటోలు దిగొచ్చు.. అతిదగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది.తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి.. దాని శిక్షకుడి సూచన మేరకు దానిని పట్టుకుని ఫొటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది(Tiger Attack Viral Video). కట్ చేస్తే..సిద్ధార్థ శుక్లా(Sidharth Shukla) అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటన తాలుకా వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్ సెక్షన్లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్ చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపాడు.Apparently an Indian man attacked by a tiger in Thailand.This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినవస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్ నిర్వాహకులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వివేక్ రామస్వామి భార్యకు చేదు అనుభవం -
థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ థాయ్‌లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. ఫుకెట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన ప్రఙ్ఞా పలివాల్(29) బెంగళూరులో టెకీగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా ఫుకెట్‌లో జరుగుతున్న కంపెనీ వార్షిక సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ప్రఙ్ఞా సహోద్యోగి ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తమకు ఎవరికీ పాస్‌పోర్టు లేదని... ప్రఙ్ఞా శవాన్ని భారత్‌కు తీసుకురావాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది ప్రఙ్ఞా మృతదేహం ప్రస్తుతం ఫుకెట్‌లోని పటాంగ్ ఆసుపత్రిలో ఉందని.. ఆమె కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ విషయంపై స్పందించారు. ‘ థాయ్‌లాండ్‌లో ఉన్న భారత ఎంబసీ బాధిత కుటుంబానికి తప్పక సహాయపడుతుంది. కఠిన సమయాల్లో వారికి తోడుగా ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా ప్రఙ్ఞా కుటుంబానికి అన్ని విధాలుగా తోడు ఉంటామని ప్రకటించారు. -
ఆ బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటే మరణ శిక్ష!
పుకెట్: పర్యాటకులకు హెచ్చరిక! బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష విధిస్తారట. అదేంటీ? సెల్ఫీలు తీసుకుంటే తప్పేంటీ అనుకుంటున్నారా? అయితే, మీరు థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఐలాండ్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మాయ్ ఖావో బీచ్‌కు ఆనుకోని ఫూకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచ్‌కు అత్యంత సమీపం నుంచి టేకాఫ్ అవుతాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఇది పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతానికి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీచ్‌ను సేఫ్టీ జోన్లోకి చేరుస్తామని ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
కోరి కొండచిలువను ముద్దాడబోయి..!
కోరి కొరివితో తల గోక్కోవడమంటే ఇదే కావొచ్చు. కొండచిలువను దగ్గరి నుంచి చూడాలంటేనే చాలా ధైర్యం కావాలి. అలాంటిది కొండచిలువ తలపై ముద్దు పెట్టాలని కోరిక పుడితే.. అది చూస్తూ ఉరుకుంటుందా? ఓ చైనీస్ పర్యాటకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. థాయ్‌లాండ్‌లోని మానవ రహిత జంతువుల పార్క్‌గా పేరొందిన 'ఫుకెట్'కు ఆ చైనీస్ పర్యాటకురాలు ఈ నెల 9న వెళ్లింది. అక్కడ కొండచిలువను దగ్గరగా చూడటమే కాకుండా.. దానిని తలపై ముద్దాడేందుకు సాహసించింది. అంతే ఆమె ఇలా ముద్దాడిందో లేదో కొండచిలువ చివాల్న దాడి చేసింది. వెంటనే ఆమె ముక్కు పట్టుకొని గట్టిగా కొరికేసింది. దీనిని చూసి చుట్టు ఉన్నవారు షాక్‌తో గావు కేక పెట్టారు. కొండచిలువ దాడిబారిన పడిన చైనీస్ పర్యాటకురాలిని 29 ఏళ్ల జిన్ జింగ్గా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఫుకెట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టమేమిటంటే ఆ కొండ చిలువ విషపూరితమైనది కాదు. కానీ కొండచిలువ దాడి వల్ల జింగ్ ముక్కుకు మాత్రం పలు కుట్లు పడ్డాయి. ఆ పార్క్‌లో స్నేక్ షో నిర్వహించే థాయ్ కంపెనీ జింగ్‌కు 3300 డాలర్లు పరిహారంగా చెల్లించింది.


