breaking news
phone ringtone
-
మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.అసలేం ఏం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.సందేశం వస్తే ఏం చేయాలి?మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.భవిష్యత్తు ప్రణాళికప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
మంత్ర జపానికి విధివిధానాలు ఉన్నాయ్
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ :ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన స్వరం ఉంటుంది. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌గా గాయత్రీ మంత్రాన్నో, మరో మంత్రాన్నో అమర్చుకోవడం మనలను ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో వెనక్కు తీసుకువెళుతుందని మహా సహస్రావధాని, సాగరఘోష కవి గరికిపాటి నరసింహారావు అన్నారు. మంత్రం రహస్యం కాబట్టే, ఉపనయన సమయంలో తండ్రి వటువునకు ఉత్తరీయం అడ్డుపెట్టి గాయత్రీమంత్రం ఉపదేశిస్తారన్నారు. గౌతమఘాట్‌లోని అక్షరకోటి గాయత్రీ శ్రీచక్రపీఠంలో బుధవారం ఉదయం . జరిగిన ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ప్రసంగించారు. గాయత్రీ ఉపాసన, సూర్యారాధన ఒకటేనని ఆయన పేర్కొన్నారు. అన్ని శాస్త్రాలకు మానవత్వం మూలమని, అనాధ ప్రేత సంస్కారం అశ్వమేధ యాగంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో వాల్మీకి మహర్షి చెప్పిన త్రిజట స్వప్నం గాయత్రీ మంత్రార్థాన్ని వివరిస్తున్నదని గరికిపాటి పేర్కొన్నారు. ‘రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయి, గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలలోని మొదటి అక్షరాన్ని చేరిస్తే గాయత్రీ మంత్రమవుతుంది’ అని గరికిపాటి అన్నారు. ఆద్యంతం గరికిపాటి ప్రసంగం హాస్యోక్తులతో సాగింది. సభకు అధ్యక్షత వహించిన ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ ఆరు సార్లు భూప్రదక్షిణం, పది వేల సార్లు కాశీయాత్ర, వందలాది పర్యాయాలు రామేశ్వరంలో సేతు దర్శనం చేయడం వలన వచ్చే పుణ్యం ఒక్కసారి తల్లికి నమస్కరించడం వలన వస్తుందన్నారు. విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ శరీరంలో సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రాణ స్థానాలను రక్షించేది గాయత్రీ మంత్రమేనన్నారు. అనంతరం గాయత్రీ పీఠ ప్రతిభా పురస్కారాన్ని అక్షరకోటి గాయత్రీ శ్రీచక్రపీఠం వ్యవస్థాపకుడు సవితాల చక్రభాస్కరరావు, కార్యదర్శి డాక్టర్ గంటి కల్యాణశర్మ తదితరులు గరికిపాటికి అందజేశారు. గరికిపాటిని ‘సరస్వతీ సామ్రాజ్య సార్వభౌమ’ బిరుదంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ డి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం స్వాగత వచనాలు పలికారు. ఘనంగా ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన వేదమంత్ర పారాయణల నడుమ, బుధవారం ఉదయం అక్షరకోటి గాయత్రీపీఠంలో పంచముఖ గాయత్రీ ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. అనంతరం గాయత్రీమాతకు పుష్పాభిషేకం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


