breaking news
phailin toofan
-
తెల్లబోయిన రైతు
సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు మద్దతు ధర క ల్పిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో మాత్రం ఎక్కడా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో పత్తి రైతులు ఆరంభంలోనే కనీస ధర లేక దగా పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ దిగుబడి అందే సమ యానికి నిరాశే మిగిలింది. మండలంలో సుమారు 8,600 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా. గత ఏడాదితో కంటే ఏడాది అదనంగా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో కొంత మేర వాడకం త గ్గింది. ఈ ఏడాది దిగుబడి బాగుంటుందని రైతులు ఆశించారు. అయితే పై-లీన్, లెహర్ తుపానుల ప్రభావంతో అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి తోడు మద్దతు ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు, గత ఏడాదితో పోలిస్తే కూలి వ్యయం మరింతగా పెరిగింది. గతంలో రూ. 100 వున్న కూలి ప్రస్తుతం రూ. 150 కి చేరింది. పైగా పత్తి సాగు అధికం కావటం, ఎక్కువగా బీటీ రకం సాగు చేయటంతో పత్తి తీత అంతా ఒకే సారి వచ్చింది. దీంతో కూలీల కొరత ఏర్పడింది. గతంలో క్వింటా పత్తి తీసేందుకు రూ. 800 వరకు ఖర్చు కాగా, నేడు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రంగంలోకి దిగిన ప్రైవేటు వ్యాపారులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకే సొమ్ము చేసుకుంటున్నారు. సాగుకు అప్పులు ఇచ్చిన రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగటంతో మంచి ధర కోసం వేచి చూసే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు తుపానుల ప్రభావంతో పత్తిరంగు కొంత మేర మారటంతో నిల్వ చేసేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాకపోయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. తేమ శాతం అంటూ వ్యాపారులు క్వింటా పత్తిని రూ. 3000 నుంచి రూ. 3200 వరకు కొనుగోలు చేస్తున్నారు. జాడ లేని సీసీఐ కేంద్రాలు.. మద్దతు ధర ప్రకటించి సీసీఐ కేంద్రాలతో రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చే యిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరకు పంటను తెగనమ్ముకుంటున్నా సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ నాట్లు వేసుకోవచ్చుకదా..!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్/ఒంగోలు, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తుననష్టం వాటిల్లిందని, నష్టాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యులు వెల్లడించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెండు రోజులపాటు పంటనష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం పర్యటనను ముగించింది. అనంతరం బృందం ప్రతినిధి డాక్టర్ పీజీఎస్ రావు మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం నష్టాలపై నివేదిక అందజేసిందని, తాము భౌతికంగా పరిశీలించేందుకు వచ్చామన్నారు. జిల్లాలో అపారనష్టం జరిగినట్లు అర్థమైందని, వరి, జీడి, బొప్పాయి, కొబ్బరి చెట్లు, రోడ్లు, కాలువలు ధ్వంసమయ్యాయని, మత్స్యకారులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని, అయితే కేంద్రం అందించే పరిహారం తాత్కాలికమేనని, శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రమే చర్యలు తీసుకోవాలన్నారు. కొబ్బరి చెట్లకు సంబంధించి 50 శాతం కంటే అధికంగా నష్టపోయినవారికే పరిహారం వస్తుం దని, ఈ నిబంధనలు ఉద్యానవన పంటలన్నింటికీ వర్తిస్తాయన్నారు. మరోవైపు.. ప్రకాశంజిల్లాలో భారీ వర్షం వచ్చినా.. రైతాంగానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆ జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అభిప్రాయపడింది. ‘వరి నారు దశలోనే ఉంది. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా. పత్తి పచ్చగా బాగుంది కదా..’ అంటూ ప్రకాశంలో పర్యటించిన కేంద్ర బృందం వ్యాఖ్యలు చేయడంతో రైతులు, అధికారులు విస్తుపోయారు. వాస్తవానికి జిల్లాలో పంటలన్నీ ధ్వంసం కాగా, మొత్తం రూ.860 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అయితే శంభుసింగ్ నేతృత్వంలో జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం.. ఉదయం చీరాల రూరల్ మండలంలో మొదలుపెట్టి సాయంత్రం ఒంగోలులో సమీక్షతో మొక్కుబడిగానే పర్యటనను ముగించింది. జిల్లాలో నష్టంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ కమిషనర్‌కు నివేదిక ఇస్తామని చెప్పడంతోపాటు కొన్ని సలహాలు ఇచ్చి సమావేశాన్ని ముగించారు. కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రరాష్ట్రంలో పంటనష్టం చాలా ఎక్కువగా ఉందని, 15రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం సభ్యులు ఎ.చంద్రశేఖర్, కె.రామవర్మ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వెల్లడించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సెల్‌ఫోన్‌తో పంటనష్టం పరిశీలనా? తుపాన్ బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌కు వినతి సాక్షి, హైదరాబాద్: తుపాను, వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని బీజేపీ ధ్వజమెత్తింది. పంట నష్టాలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఎలా పరిశీలిస్తారని కేంద్ర బృందాన్ని నిలదీసింది. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పిం చింది. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. 19 జిల్లాల్లో 34లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వాల్లో కనీస కదలిక లేదన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.15వేలు, పత్తికి రూ.20 వేలు, మొక్కజొన్నకు రూ.12వేలు ఇవ్వాలన్నారు. -
ఫైలిన్ తుఫాన్‌తో సిక్కోలు కుదేలు