breaking news
PG medicine
-
మెడిసిన్‌లో మెరిసెన్
వజ్రపుకొత్తూరు: తల్లి కష్టం ఆ యువకుడు వృథాగా పోనియ్య లేదు.. చిన్నప్పుడే తండ్రిని కిడ్నీ వ్యాధి కబలించగా.. ఆటు పోట్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఆ యువకుడు ముందుకు సాగాడు. తల్లి కష్టార్జితంతో పాటు మేనమామ ప్రోత్సాహంతో చదువులో రాణించి వైద్యుడిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేశాడు. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించి విద్యార్థి లోకానికి స్ఫూర్తిగా నిలిచాడు వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన దల్లి సురేష్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన ఆలిండియా పీజీ మెడిసిన్(నీట్)లో జాతీయ స్థాయిలో 152వ ర్యాంక్ , ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో స్టేట్ 9వ ర్యాంక్ ఆలిండియా ఓబీసీ కేటగిరిలో 23వ ర్యాంక్ సాదించి భళా అనిపించకున్నాడు. చదువులో చిచ్చరపిడుగు.. దల్లి సింహాచలం, దయమంతి కుమారుడైన సురేష్ ఎండీ జనరల్ మెడిసిన్‌లో ర్యాంక్ సాధించేందుకు భావనపాడుకు చెందిన మేన మామ బుడ్డా కనకరాజు కృషి చేశారు.1 నుంచి 7వ తరగతి వరకు పీజేపురం ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు పాఠశాల చదివిన సురేష్ కాకినాడలో ఇంర్మీడియట్ బైపీసీలో 970 మార్కులు సాధించి పూర్తి చేశారు. అనంతరం ఎంసెట్‌లో చక్కటి ర్యాంక్ సాధించి అక్కడే ఎంబీబీఎస్‌ను రంగారాయ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని పీజీలో ఎండీ జనరల్ మెడిసిన్ ఢిల్లీలోని మౌలానాఅజాద్ మెడికల్ కళాశాలలో పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఘనంగా సన్మానం.. సురేష్‌ను టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ కణితివూరులో ఆదివారం ఘనంగా సన్మానం చేసారు. పేదరికాన్ని జయించి పట్టుదలతో యువ వైద్యుడిగా ఎదగడం విద్యార్థి లోకానికి ఆదర్శమని కొనియాడారు. పీజీని దిగ్విజయంగా పూర్తి చేసి గ్రామీణులకు చక్కటి వైద్య సేవలను అందించాలని కోరారు. కార్యక్రమంలో నందిగాం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొమ్మాళి లక్ష్మీనారాయణ, కణితి గిరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు వైద్యసేవలందిస్తా పట్టుదలతో శ్రమిస్తే ఎవరికైనా విజయం సొంతమవుతుంది. మేనమామ ప్రోత్సాహం, తల్లి పడిన కష్టాన్ని దిగమింగుకుని చదవాను. పీజీ పూర్తి చేసి గ్రామీణ ప్రాంత పేదలకు చక్కటి వైద్యసేవలు అందిస్తాను. – దల్లి సురేష్, వైద్య విద్యార్థి, పీజేపురం ఆనందంగా ఉంది.. తండ్రి మరణించినా కష్టపడి పిల్లలను చదివించాను. ఇందులో నా సోదరుడి పాత్ర కీలకం. పేదరికం, కష్టాలను గమనించి చదివిన పెద్ద కుమారుడు వెంకటేష్ ఇడుపులపాయ ట్రిపుల్ ఇటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అయ్యారు. చిన్నకుమారుడు సురేష్ వైద్యుడిగా మారడం ఆనందంగా ఉంది.– దల్లి దమయంతి, తల్లి, పీజేపురం -
నీట్ (ఎంబీబీఎస్) అభ్యర్థులకు శుభవార్త
అమరావతి: నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులు 17-24 ఏళ్ల వారై ఉండాలి. అలాగే, మూడుసార్లు మాత్రమే ఈ అర్హత ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ రెండు నిబంధనలను సడలించాలని ఎంసీఐ నిర్ణయించింది. 17 ఏళ్ల వయసు లేకపోయినా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశమిస్తే బాగుంటుందని ఎంసీఐ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే గరిష్ట వయోపరిమితితో పాటు ఎన్ని సార్లు ఈ అర్హత పరీక్ష రాసుకోవచ్చు అనేది ఇంకా నిర్ణయించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై రెండ్రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పీజీ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థులకు మాత్రం ఎలాంటి వయసు సడలింపులివ్వడం లేదని ఎంసీఐ వర్గాలు తెలిపాయి. వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత: పీజీ వైద్య సీట్ల పెంపుపై కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత వస్తుందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు స్పష్టం చేశారు. భారతీయ వైద్య మండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెరగాల్సిన సీట్లపై కసరత్తు జరుగుతోందని, ఈనెల 17న జరిగే ఎంసీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. దీనిపై ఈనెల 20లోగా స్పష్టత వస్తుందని చెప్పారు. మొత్తం 6 కళాశాలల (గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురం) నుంచి వివిధ స్పెషాలిటీలకు సంబంధించి మొత్తం 380 సీట్లకు పైగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కనీసం 250 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ సీట్లన్నీ తొలివిడత కౌన్సెలింగ్‌లోపే జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న ఒక ప్రొఫెసర్‌కు ఇద్దరు విద్యార్థుల నిబంధనను సడలించి ఒక ప్రొఫెసర్‌కు ముగ్గురు విద్యార్థులను ప్రకటించడంతో సీట్లు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు.