persons died
-
బావమరుదులపై బల్లెంతో బావ దాడి
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్‌లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు. -
ఘోర బస్సు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ బస్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ముల్తాన్ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్కి బయులు దేరుతున్న ప్యాసింజర్ బస్సుని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు. (చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం) -
చెల్లిని చూసేందుకు వెళ్లి... అంతలోనే...
చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. విద్యుత్ షాక్‌తో టిప్పర్ డ్రైవర్.. చీపురుపల్లి రూరల్: కుటుంబపోషణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ జిల్లా బుదవా మండలం జరియా గ్రామం నుంచి వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఓంప్రకాశ్ చీపురుపల్లి పట్టణంలో విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి హెచ్‌సీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలో రెడ్డిపేట వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులకు డ్రైవర్ ఓంప్రకాశ్ టిప్పర్‌తో రాతిబుగ్గిని తీసుకువెళ్లాడు. రాతిబుగ్గిని అన్లోడ్ చేసిన అనంతరం పూర్తిగా అన్లోడ్ అయ్యిందో లేదో చూసేందుకు వెనుక వైపు ఉన్న డోర్‌ను పట్టుకున్నాడు. అప్పటికే టిప్పర్ వెనుక భాగాన విద్యుత్‌వైరు తగిలి ఉండడంతో పట్టుకున్న వెంటనే విద్యుత్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ద్విచక్రవాహనంపై చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆటోనుంచి జారిపడి ఒకరు.. పాలకొండ రూరల్: మండలంలోని తలవరం–అట్టలి రహదారి మధ్య మంగళవా ఆటోలో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అవలంగి గ్రామానికి చెందిన నగరపు కృష్ణంనాయుడు (55) పాలకొండలో ఉన్న చెల్లిని చూసేందుకు పయనమై నవగాం కూడలిలో ఆటో ఎక్కి పాలకొండ వస్తున్నాడు. అట్టలి సమీపంలోని ఆర్సీఎం డొమినిక్ పాఠశాల వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆటో అదుపు తప్పడంతో కృష్ణంనాయుడు ఆటోలో నుంచి జారి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం మివ్వగా వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతిచెందాడు. ఆయనకు భార్య గోవిందమ్మ ఉంది. రైతు కూలీగా జీవనం గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లలు లేకపోవడం, భర్త మరణించడంతో గోవిందమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై ఎస్సై సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. (చదవండి: 186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్)