breaking news
Peddavutapalli
-
మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ!
విజయవాడ: విజయవాడ-ఏలూరు హైవేపై పెద్దవుటపల్లి వద్ద నిన్న జరిగిన మూడు హత్యలకు సంబంధించి మరో క్లూ దొరికింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనాస్థలానికి 5 కిలో మీటర్ల దూరంలో తొట్టిపాడు టోల్గేట్ వద్ద పార్క్ చేసిన పల్సర్ బైకును పోలీసులు కనుగొన్నారు. ఈ పల్సర్ బైకు నెంబరు ఏపి 27 ఏఎస్ 3400. నిన్నటి నుంచి ఆ బైకు అక్కడే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటర్స్‌కు సమాచారం ఇచ్చేందుకు ఈ బైకును నిందితులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు వాడిన కారును కూడా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాళ్లు బస చేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే వారు వాడిన కారును వదిలి వెళ్లారు. కారులోని రెండు కత్తులు, తుపాకీతో పాటు రాడ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా హోటల్‌కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, హత్యకు గురైనవారు ముందుగానే పోలీస్ రక్షణ అడిగినట్లు తెలుస్తోంది. అయితే గన్నవరం నుంచి రక్షణ కల్పించడం సాధ్యంకాదని, ఏలూరు వచ్చిన తరువాత రక్షణ కల్పిస్తామని పోలీసులు వారికి చెప్పినట్లుగా చెబుతున్నారు. పోలీసుల రక్షణ లేకుండా రావడం వల్లే వారు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ** -
నీట్‌గా వచ్చి కాల్చి వెళ్ళారు!
-
'టక్ చేసుకొని నీట్‌గా వచ్చి కాల్పులు జరిపారు'
ఏలూరు: కాల్పులు జరిపిన ముగ్గురూ టక్ చేసుకొని, నీట్‌గా ఉన్నారని క్యాబ్ డ్రైవర్ నరేష్ చెప్పారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దవుటపల్లి సమీపంలోని ఈ ఉదయం కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన డ్రైవర్ ఏలూరు వన్ టౌన్ పోలీసుల ముందు హాజరయ్యారు. విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై ఏలూరు వైపు వెళ్తున్న కారును మరో వాహనంలో వచ్చిన ముగ్గురు ఆపి, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పులలో కారులోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దుండగులు ఎటువంటి మాస్క్ ధరించలేదని డ్రైవర్ నరేష్ చెప్పారు. దుండగులు టక్ చేసుకుని నీట్ గా వచ్చారని తెలిపారు. వారు కాల్పులు జరిపే సమయంలో భయంతో కారు దిగిన తనపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపాడు. అయితే తాను తప్పించుకొని అటువైపు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లినట్లు చెప్పారు. ఆ తరువాత మళ్లీ తిరిగి వచ్చానని తెలిపారు. దుండగులను తాను ఎప్పుడూ చూడలేదని, వారిని ఇప్పుడు చూసినా గుర్తుపట్టలేనని చెప్పారు. **