'టక్ చేసుకొని నీట్గా వచ్చి కాల్పులు జరిపారు' | They fired on me:Cab Driver Naresh | Sakshi
Sakshi News home page

'టక్ చేసుకొని నీట్గా వచ్చి కాల్పులు జరిపారు'

Sep 24 2014 3:40 PM | Updated on Oct 2 2018 2:30 PM

క్యాబ్ డ్రైవర్ నరేష్ - Sakshi

క్యాబ్ డ్రైవర్ నరేష్

కాల్పులు జరిపిన ముగ్గురూ టక్ చేసుకొని, నీట్గా ఉన్నారని క్యాబ్ డ్రైవర్ నరేష్ చెప్పారు.

ఏలూరు: కాల్పులు జరిపిన ముగ్గురూ టక్ చేసుకొని, నీట్గా ఉన్నారని క్యాబ్ డ్రైవర్ నరేష్ చెప్పారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దవుటపల్లి సమీపంలోని ఈ ఉదయం కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన డ్రైవర్ ఏలూరు వన్ టౌన్ పోలీసుల ముందు హాజరయ్యారు. విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై ఏలూరు వైపు వెళ్తున్న కారును మరో వాహనంలో వచ్చిన ముగ్గురు ఆపి,  అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై  విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం  తెలిసిందే.  ఆ కాల్పులలో  కారులోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

దుండగులు ఎటువంటి మాస్క్ ధరించలేదని డ్రైవర్ నరేష్ చెప్పారు. దుండగులు  టక్ చేసుకుని నీట్ గా వచ్చారని తెలిపారు. వారు కాల్పులు జరిపే సమయంలో భయంతో కారు దిగిన తనపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపాడు. అయితే తాను తప్పించుకొని అటువైపు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లినట్లు చెప్పారు. ఆ తరువాత మళ్లీ తిరిగి వచ్చానని తెలిపారు. దుండగులను తాను ఎప్పుడూ చూడలేదని, వారిని ఇప్పుడు చూసినా గుర్తుపట్టలేనని చెప్పారు.
**

Advertisement
 
Advertisement
Advertisement