breaking news
PDA
-
పీడీఏ స్కూల్స్.. ఎ ఫర్ అఖిలేష్.. డి ఫర్ డింపుల్!
లక్నో: ఎ ఫర్ అఖిలేష్ యాదవ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ముంలాయం సింగ్ యాదవ్.. ఇది ఇప్పుడు యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పీడీఏ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పీల్లలకు నేర్పుతున్న ప్రాథమిక పాఠం. సాధారణంగా చిన్న పిల్లలకు ఇంగ్లిష్‌ను పరిచయం చేసే క్రమంలో ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, డీ ఫర్ డాగ్ అని పరిచయం చేస్తారు. మరి యూపీలోని పీడీఏ పాఠశాలల్లో ఎ ఫర్ అఖిలేష్ అనే మాట వినిపిస్తోంది. యూపీలోని సమాజ్‌వాది పీడీఏ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచన మేరకు పీడీఏ పాఠశాలలను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా యూపీలో సహరాన్ పూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో తాజాగా పీడీఏ స్కూల్‌ను ఓపెన్ చేశారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూళ్లు మూసివేయబడుతున్నాయో అక్కడ పీడీపీ స్కూళ్లు ఓపెన్ చేయాలనే అఖిలేష్ ఆదేశాల నేపథ్యంలో పార్టీ కార్యకర్త ఫరాజ్ అలామ్ గడా ఈ స్కూల్‌ను ఆరంభించారు. ఈ స్కూల్లో 60 మందికి పైగా విద్యార్థులు చేరారు. ఇప్పుడు అక్కడ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతల పేర్లను ఇంగ్లిష్ వర్ణమాలకు ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు.దీనిపై ఫరాజ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల కోసం ఈ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ స్కూల్లో 25 మంది చేరగా, ఆపై ఆ సంఖ్య 60పైకి చేరిందన్నారు. ‘ఇది స్కూల్ కాదు.. ఒక ఉద్యమం. బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లను మూసివేస్తోంది. పేద పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖేలేష్ యాదవ్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైతే స్కూల్ మూతబడుతుందో అక్కడ పీడీఏ స్కూల్ ఏర్పాటు కావాలని ఆదేశించారు. ఈ స్కూల్లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్‌ను అందివ్వడంతో పాటు మా పార్టీ రాజకీయ సందేశాన్ని కూడా ఇక్కడ జోడిస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. మా నాయకులు గురించి కూడా పాఠాల ద్వారా చెప్పే యత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఎ అంటే అఖిలేష్, డి అంటే డింపుల్ యాదవ్(అఖిలేష్ యాదవ్ భార్య), ఎం అంటే ములాయింగ్ సింగ్ యాదవ్( మా పార్టీ వ్యవస్థాపకుడు)ల గురించి కూడా చెబుతున్నాం’ అని పార్టీ కార్యకర్త తెలిపారు.ప్రతీ గ్రామంలో పీడీఏ పాఠశాల..గతవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్ స్కూళ్లు పెయిరింగ్ పాలసీలో భాగంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్లను యోగి సర్కార్ మూసివేస్తుందంటూ మండిపడ్డారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే మూతబడుతుందో ఆ గ్రామంలో కచ్చితంగా పీడీఏ స్కూల్ ఓపెన్ చేస్తాం. ప్రతీ గ్రామంలోనూ పీడీఏ స్కూల్ వస్తుంది. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. రాజకీయ వనరులను విస్తరిస్తున్న యోగి సర్కార్.. విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు’ అని అఖిలేష్ ధ్వజమెత్తారు. -
ఓట్ల చీలికకు ఎన్సీ పన్నాగం: పీడీపీ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ప్రత్యేకించి కశ్మీర్ లోయలో ఓట్ల చీలికకు అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కుట్ర పన్నుతోందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ప్రాంతీయవాద వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఎన్సీ...స్వార్థ శక్తుల చేతిలో రాష్ట్రంలో ఓట్లను చీల్చే స్థాయికి దిగజారిందని ఆమె దుయ్యబట్టారు. మంగళవారం బందిపొరా, సోనావరీలలో నిర్వహించిన ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. ఎన్సీ గత కొన్నేళ్లుగా అధికార సాధన కోసం విలువలపై రాజీ పడిందన్నారు. ప్రజలు ఎన్నోసార్లు అధికారం అప్పగించినా వారి ఆకాంక్షలను అనుగుణంగా పనిచేసే బదులు ప్రజలను అధికారంలోకి తెచ్చిపెట్టే బానిసలుగా మాత్రమే చూసిందని ముఫ్తీ దుయ్యబట్టారు. -
జీఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నేపాల్ ఓకే..
రూ.9,000 కోట్ల వ్యయం - నేపాల్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే - విదేశాల్లో జీఎంఆర్‌కు ఇది భారీ పెట్టుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్‌నకు పెద్ద ఊరట. ఆరేళ్లుగా అనుమతికి నోచని భారీ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నేపాల్‌లో 900 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్టును బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన జీఎంఆర్ 2008లో అంతర్జాతీయ పోటీ వేలంలో దక్కించుకుంది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు సైతం తమ దేశానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలగాలని పట్టుబడుతూ వచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు నేపాల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌తోపాటు నేపాల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19న జీఎంఆర్‌తో ప్రాజెక్టు అభివృద్ధి ఒప్పందం(పీడీఏ) కుదిరింది. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. భారీ ఎఫ్‌డీఐ..: కర్నాలి నదిపై నిర్మించనున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు. నేపాల్‌లోకి రానున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే భారీది. ప్రాజెక్టులో 27 శాతం ఉచిత వాటా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి జీఎంఆర్ ఇస్తుంది. కన్సెషన్ పీరియడ్ 25 ఏళ్లు. అంటే 25 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు యాజమాన్య హక్కులు నేపాల్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. తాజా ఒప్పందం ప్రభావంతో తమ దేశానికి మరిన్ని ఎఫ్‌డీఐలు కార్యరూపం దాలుస్తాయని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో 2 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని జీఎంఆర్ ప్రత్యేకంగా నెలకొల్పనుంది. భారత్ వెలుపల.. జీఎంఆర్ గ్రూప్‌నకు భారత్ వెలుపల అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 2016 సెప్టెంబర్ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రాజెక్టులో వాణిజ్య ఉత్పత్తి సెప్టెంబరు 2021 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఏటా 3,500 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 12 శాతం నేపాల్‌కు ఉచితంగా ఇవ్వనున్నారు. మిగిలినది భారత్‌కు సరఫరా చేస్తారు. విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ సందర్భంగా చెప్పారు.