breaking news
paying tax
-
‘కొత్త ఏడాదిలో భారత్‌ను వదిలి వెళ్తున్నా!’
భారతదేశంలో వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నిజాయితీగా పన్నులు చెల్లించేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరోసారి చర్చ మొదలైంది. దేశంలోని పన్ను నిబంధనలు పన్ను చెల్లింపుదారులపై అనుమానం పెంచేలా ఉన్నాయని, దీనివల్ల వ్యాపారం చేయడం భారంగా మారుతోందని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, అఫ్లాగ్ గ్రూప్ భాగస్వామి రోహిత్ ష్రాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 2026 నాటికి తాను భారతదేశాన్ని విడిచిపెట్టి, విదేశాల్లో తన వ్యాపారాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.రూ.4 కోట్ల పన్ను చెల్లించినా దక్కని గుర్తింపురోహిత్ ష్రాఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం.. దేశానికి అత్యధికంగా సహకరించే పన్ను చెల్లింపుదారులను వ్యవస్థ డిఫాల్ట్‌గా అనుమానంతో చూస్తోందని ఆయన మండిపడ్డారు. తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను రూపంలో సుమారు రూ.4 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ‘దేశంలో కేవలం 4-5% మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. నోటీసులు పంపాలన్నా, పరిశీలన (Scrutiny) చేయాలన్నా అధికారులు కొద్ది మందినే లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. జీఎస్టీ బృందాలు, ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని, పన్ను నిబంధనలు పాటించే వ్యాపారాలకు ఎటువంటి గుర్తింపు లేదా ప్రోత్సాహకాలు లభించడం లేదని ఆయన విమర్శించారు.భారతీయులు విదేశాలకు వెళ్లడంపై స్పందిస్తూ, ‘ఇండియన్స్‌కు సామర్థ్యం తక్కువ కాదు. యూఏఈ, యూఎస్ వంటి దేశాల్లో వారు పెద్ద వ్యాపారాలను నడుపుతున్నారు. వారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం లేదు, కానీ ఇక్కడి వ్యవస్థ వృద్ధికి ప్రతిఫలాన్ని ఇవ్వదు. పైగా జరిమానా విధిస్తుంది. ఒక దశలో నినాదాల కంటే స్వీయ సంరక్షణ ముఖ్యం. ఇది దేశభక్తికి సంబంధించిన విషయం కాదు, వాస్తవికత. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సులభతర నిర్వహణ) లోపించింది. అందుకే 2026లో ఇండియా వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని ష్రాఫ్ వ్యాఖ్యానించారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలురోహిత్ ష్రాఫ్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సిస్టమ్ మిమ్మల్ని ప్రోత్సహించడం కంటే ప్రాసిక్యూట్ చేయడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంది’ అని ఒక వినియోగదారుడు తెలిపారు. ‘నేను 9 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను, పక్కాగా నిబంధనలు పాటిస్తే ఒక్క నోటీసు కూడా రాదు. మీ వ్యక్తిగత నిర్ణయానికి దేశాన్ని నిందించకండి’ అని కొందరు ష్రాఫ్ వాదనను కొట్టిపారేశారు.ఇదీ చదవండి: 2025.. ఏఐ ఇయర్ -
నల్లధనం కుబేరులకు ఊరట
న్యూఢిల్లీ: అప్రకటిత ఆదాయాన్ని వెల్లడించడానికి, నాలుగు నెలల గడువునిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడో మరో భారీ వెసులుబాటును కల్పించింది. నల్లధనం వెల్లడికి గాను ప్రభుత్వం తీసుకొచ్చిన వన్-టైమ్ కాంప్లియన్స్ విండో పథకంలో భాగంగా నల్లధనం డిక్లరెంట్స్ కు గుర్తుతెలియని ఆస్తులపై సర్ చార్జ్ మరియు పెనాల్టీ చెల్లింపులలో మార్పులేదని ఆదాయ పన్ను శాఖ గురువారం స్పష్టం చేసింది. అలాగే మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాల్సిన పన్నులో విడతలవారీగా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. కొంత భాగాన్ని ఈ సెప్టెంబర్‌లో, మరికొంతభాగాన్ని వచ్చే ఆర్థిక సం.రం. 2017 సెప్టెంబర్ లోపుగా చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఆదాయాల ప్రకటన, పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోదని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొంతమంది వాటాదారుల ఆచరణీయ ఆటంకాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం కింద చెల్లింపుల కోసం సమయం షెడ్యూల్ పునరుద్దరించాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం 2016 నవంబరు 30 లోపుగా నిర్దేశిత సర్ చార్జ్, పెనాల్టీ లో కనీసం 25 శాతం చెల్లించాలని పేర్కొంది. మరో 25శాతం మార్చి 31, 2017 లోపు, మిగిలిన మొత్తాన్ని 2017 సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాలని పేర్కొంది. కాగా 2016-17 బడ్జెట్లో 4 నెలల కాంప్లియన్స్ విండోను ప్రకటించారు. ఐడిఎస్(ఆదాయం వెల్లడి పథకం)-2016ను జూన్ 1న ప్రారంభించగా, సెప్టెంబర్ 30తో దీని గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.


