breaking news
pay rent
-
హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారా?
యూపీఐ చెల్లింపులు ఆన్లైన్ లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటే.. డబ్బు స్వీకరించేవారికి మాత్రం ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే వాదనలున్నాయి. ఇటీవల బెంగళూరులోని వీధివ్యాపారులకు వారి యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు అందడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహం రెంట్ నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ లావాదేవీలపై 12% జీఎస్టీ ఉంటుందని పోస్టర్లు వెలిశాయి. ఇదికాస్తా వైరల్‌గా మారింది.రెడ్డిట్‌లో వెలసిన ఈ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘అద్దె నగదు రూపంలోనే చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్‌పై 12 శాతం జీఎస్టీ ఉంది’ అని పీజీ ముందు పోస్టర్ వేసినట్లు ఫోటో తీసి పోస్ట్‌లో అప్లోడ్ చేశారు. ఎస్కేడీజీక్ అనే హ్యాండిల్ నుంచి షేర్ చేసిన ఈ పోస్ట్‌కు 31,000 వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?చాలా మంది నెటిజన్లు ఈ పద్ధతి చట్టవిరుద్ధమని, దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలను అమలు చేయాలని అధికారులను కోరారు. రెసిడెన్షియల్ రెంట్ పై జీఎస్టీ లేదని, ప్రాపర్టీని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే తప్ప జీఎస్టీ విధించరని కొందరు తెలిపారు. ‘మీరు జీఎస్టీ బిల్లు అడగండి’ అని ఒకరు కామెంట్ చేశారు. రెసిడెన్షియల్ పీజీలకు సాధారణంగా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని కొందరు చెప్పారు. రిజిస్ట్రేషన్, సరైన ఇన్వాయిసింగ్ లేకుండా ఏకపక్షంగా జీఎస్టీని విధించలేరని కొన్ని కామెంట్లు వచ్చాయి. -
‘ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్’
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. కస్టమర్లకు ఎస్బీఐ పంపిన మెసేజ్ ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రెంటు పే చేస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ నెలనుంచి అమల్లోకి రానున్నట్లు అందులో పేర్కొంది. ఉదాహరణకు.. సురేష్ తన ఇంటిరెంట్ రూ.12వేలను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించేవారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్బీఐ తెచ్చిన నిబంధన మేరకు..సురేష్ తన ఇంటి రెంటును రూ.12వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును పెంచింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు రూ.199 (అంతకు ముందు రూ.99 ఉంది), 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంది. -
అద్దె చెల్లించండి..!
న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాల్లోనే ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కిరణ్ వాలియా, అరవింద్ సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్‌లకు కూడా తాఖీదులు పంపింది. అనధికారికంగా ఉంటున్నందున మార్కెట్ ధర ప్రకారం షీలా దీక్షిత్ రూ. 3.25 లక్షలు, కిరణ్ వాలియా రూ. 5.8 లక్షలు, అర్విందర్‌సింగ్ లవ్లీ రూ. 6.5 లక్షలు, హరూన్ యూసుఫ్ రూ. 2.9 లక్షల అద్దె చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. వీరిలో షీలాదీక్షిత్, కిరణ్ వాలియాలు ఈ నెలారంభంలోనే తమ అధికారిక నివాసాలను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నన్ని రోజులకుగాను అద్దె నిర్ణయించి, నోటీసులు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా లవ్లీ, యూసుఫ్‌లు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై తూర్పు ఢిల్లీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, లవ్లీ, యూసుఫ్‌లు నివసిస్తున్న అధికారిక నివాసాలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు. ఈ విషయమై ఎస్టేట్ అధికారి నుంచి వివరణ కోరామని, అప్పటి వరకు వేచిచూస్తామన్నారు. వారి వివరణ ఆధారంగానే లవ్లీ, యూసుఫ్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి నివాసాలను ఆక్రమించుకునేందుకు నెల రోజులు పడుతుందన్నారు. నిబంధనల ప్రకారం పదవులకు రాజీనామా చేసిన తర్వాత 15 రోజులకు మించి అధికారిక నివాసాల్లో ఉండరాదని, ఆరు నెలల వరకు ఉండే అవకాశమున్నా మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుందని, అందుకే ఐదుగురు కాంగ్రెస్ నేతలకు అద్దె చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. అందిన సమాచారం ప్రకారం ఇంతకుముందే షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నుంచి నోటీసులు అందాయని, అందుకే ఆమె ఖాళీ చేశారు. దీంతో కిరణ్ వాలియా కూడా షీలా సూచనల మేరకు ఖాళీ చేశారు. దీంతో ప్రజాపనుల విభాగం అధికారుల దృష్టి ఇప్పుడు లవ్లీ, యూసుఫ్‌లపై పడింది. మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించి ఆరు నెలలు ఉంటారా? ఖాళీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.