breaking news
Parliamentary Committee Members
-
జేపీసీలో YSRCP ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు
-
ఎంపీల జీతాలు రెట్టింపు చేయండి
న్యూఢిల్లీ: ఎంపీల వేతనాలు రెట్టింపు చేసి వెంటనే అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీల వేతనాల పెంపుపై ఏర్పాటైన పార్లమెంటరీ సంయుక్త కమిటీ బుధవారమిక్కడ సమావేశమైంది. ఎంపీల జీతాలు కేబినెట్ కార్యదర్శితో సమానంగా ఉండాలని కోరింది. ఇదే అమల్లోకి వస్తే.. ప్రస్తుతం రూ. 50వేలున్న ఎంపీల వేతనం రెట్టింపు కానుంది. దీంతో పాటు సమావేశాలకు హాజరైతే రోజుకు రూ.2వేల అలవెన్సు ఇస్తోంది. నియోజకవర్గ అలవెన్సులు, ఇతర ఖర్చుల రూపంలో అదనంగా 90 వేలు అందుతుంది. వీటితోపాటు ప్రభుత్వ వసతి, విమాన, రైల్వే ఖర్చులు, మూడు ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు, రెండు సెల్ఫోన్లు ఇస్తోంది.