గోపికృష్ణ తల్లిదండ్రుల ఆనందం
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): కిడ్నాప్ నకు గురైన ప్రొఫెసర్ గోపికృష్ణను ఉగ్రవాదులు బుధవారం విడుదల చేసినట్లు తెలియడంతో ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొ. గోపికృష్ణ లిబియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, టెక్కలిలో నివాసముంటున్న గోపికృష్ణ తల్లిదండ్రులు వల్వభనారాయణరావు, సరస్వతిలు మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.