breaking news
parawada police station
-
సంద్రమంత విషాదం
సాక్షి, పరవాడ : ఆ సంబరం చూసి చూసి సముద్రుడికి ఈర్శ్య కలిగిందేమో వారిని తనలో కలిపేసుకున్నాడు.. వారి వినోదంతో విధికి కన్నుకుట్టిందేమో కన్నెర్ర జేసింది. ఆ కుటుంబాలకు ఆధారం వద్దనుకున్నాడేమో తన దగ్గరికి తీసుకుపోయాడు. కన్నీటికే కన్నీరు వచ్చే విషాదం.. పగవాడికి కూడా రాకూడని కష్టం.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం.. ఆ గ్రామానికి పెను విషాదం. పరవాడ మండలం ముత్యలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో రాకాసి అలలకు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇంటికి చేదోడుగా ఉంటాడని ఆశ పడిన ఆ కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. వెన్నెలపాలెంలో నాలుగు నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న ఆశలు ఆరిపోయాయి. పరవాడ పోలీసుల కథనం మేరకు.. వెన్నెలపాలేనికి చెందిన ముగ్గురు యువకులు సముద్ర అలలకు బలికావడం.. మరొకరు గల్లంతు అవ్వడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన పైలా మహేష్(28), మాసవరపు నరేష్(27), సిరపరపు రామకృష్ణ(28) సముద్రంలో మునిగి మృత్యు ఒడికి చేరుకోగా.. లాలం నరసింగరావు(27) గల్లంతయ్యాడు. పరవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’పేరిట ఆదివారం ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిపాడి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలో వెన్నెలపాలేనికి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణ, నరసింగరావు సముద్ర స్నానానికి దిగతా.. ఓ రాకాసి అల వీరిని సముద్రంలోకి లాగేసింది. దీంతో మహేష్, నరేష్, రామకృష్ణలు తీవ్ర అస్వస్తతకు గురై మరణించగా నరసింగరావు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు అనకాపల్లిలోని మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను సీఐ స్వామినాయుడు, ఎస్ఐ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. దేవుడా మేం ఏ పాపం చేశాం... సముద్రంలో మునిగి మృతి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణతో పాటు గల్లంతైన నరసింగరావులు ఆయా కుటుంబాల్లో ఒక్కరే మగ సంతానం. మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరగ్గా భార్య గౌతమి, రెండేళ్ల పాప రిషిత ఉన్నారు. తండ్రి కలాసీగా పనిచేస్తున్నా మహేష్ సంపాదనే ఆధారం. నరేష్ అవివాహితుడు కాగా తండ్రి రాజు డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో కాలు విరిగిపోయి ఇంటి వద్ద ఉండే పరిస్థితి. కుటుంబ భారం మీద పడడంతో హిందుజా కంపెనీలో పనికి కుదిరిన నరేష్ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఇక రామకృష్ణ కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి ఉన్న ఎకరంలో సేద్యం చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత రామకృష్ణ జన్మించాడు. గల్లంతైన నరసింగరావు ఏకైక సంతానం. చిన్ననాటి స్నేహితులైన నలుగురిలో ముగ్గురు ఒకే ప్రమాదంలో మరణించడం.. ఒకరు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాలల్లో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు బంధవులు, గ్రామస్తులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
నిర్మాతపై దాడిని ఖండించిన మనోజ్
-
నిర్మాతపై దాడిని ఖండించిన మనోజ్
జూనియర్ ఆర్టిస్టుల ఏజెంటుపై ఆరోపణలు సయోధ్యకు హీరో మంచు మనోజ్ ప్రయత్నాలు.. విఫలం పరవాడ పోలీసులకు పరస్పర ఫిర్యాదులు పరవాడ: ఓ సినీ నిర్మాతపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన ఉదంతం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో చోటుచేసుకొంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యాలమ్మపాలెం గ్రామంలో ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్‌తో దర్శకుడు అజయ్ ఇరవై రోజులుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కె.ఎస్.ఎన్ రెడ్డి, అచ్చిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌కు అవసరమైన 250 మంది జూనియర్ ఆర్టిస్టులను విశాఖకు చెందిన రాము అనే ఏజెంటు సరఫరా చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులకు నిర్మాతలు సుమారు రూ.9 లక్షల బకాయి పడ్డారు. ఇందులో రూ.5 లక్షలు దఫా దఫాలుగా చెల్లించగా మరో రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిని చెల్లించాలని ఏజెంటు రాము ఒత్తిడి తెచ్చినప్పటికీ నిర్మాతలు స్పందించడం లేదు. దీంతో ఆగ్రహించిన ఏజెంటు రాము గత నెల 26న నిర్మాతల్లో ఒకరైన అచ్చిబాబుపై కొందరు వ్యక్తులతో దౌర్జన్యానికి పాల్పడి ఆయనతో ప్రాంసరీ నోట్లు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకొన్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులు గత మూడు రోజులుగా నిర్మాతను వేధిస్తున్నారు. నిర్మాతలు పరవాడలో విడిది చేసిన గెస్ట్‌హౌస్, సినిమా షూటింగ్ ప్రదేశాలకు వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బకాయిలను త్వరలో చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోకుండా తనపై దాడికి పాల్పడుతున్నారని నిర్మాత అచ్చిబాబు సోమవారం సినీ హీరో మంచు మనోజ్ వద్ద వాపోయాడు. మనోజ్ ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడానికి సోమవారం రాత్రి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడడంతో పరస్పరం పరవాడ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలవారు ఫిర్యాదు చేసినట్లు పరవాడ సీఐ బి.సిహెచ్. స్వామినాయుడు ధ్రువీకరించారు. నిర్మాతలపై దౌర్జన్యం దారుణం నిర్మాతలపై విశాఖకు చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడడం దురదుష్టకరమని సినీ హీరో మనోజ్, దర్శకుడు అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నైజం కొనసాగితే సినిమా యూనిట్లు చెన్నైకి తరలిపోవడం ఖాయమన్నారు. ప్రశాంతకు మారు పేరైన విశాఖలో నకిలీ యూనియన్ పేరుతో కొందరు వ్యక్తులు జూనియర్ ఆర్టిస్టులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో సినీ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళతామన్నారు.