breaking news
Papanasam movie
-
హలో కమల్ కూతురిక్కడ!
మీకు నటి శ్రుతిహాసన్‌తో మాట్లాడే అవకాశం కలిగందా? ఆమె ముంబయిలో పెరిగారు. విదేశాల్లో చదివారు. అనే ఉద్దేశంతో పొరపాటున శ్రుతితో ఆంగ్లంలో మాట్లాడుదాం అనుకునేరు సుమా, అనవసరంగా బుక్కయైపోతారు. ఇలాగే ఇటీవల ఒకరు శ్రుతిహాసన్‌తో ఆంగ్లంలో మాట్లాడబోతే హలో నాకు తమిళభాష రాదని ఆంగ్లంలో మాట్లాడుతున్నారా? కమలహాసన్ కూతురిక్కడ. తమిళంలో నాకంటే బాగా మాట్లాడగలరా? అంటే ఆ వ్యక్తిని రఫ్ ఆడించేశారట. చెన్నైలోనే అనుకునేరు. ఆంధ్రాలో అయితే అక్కడమ్మాయిలాగా ప్రవర్తిస్తారట. ఇక ముంబయిలో అయితే హిందీలో దుమ్మురేపుతారట. ఇలా తన కూతురి ఎదుగుదలతో పాటు భాషాభివృద్ధిని చూసి కమలహాసన్ చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమలహాసన్, శ్రుతిహాసన్ కలిసి కబుర్లు చెప్పుకోవడం అరుదనే విషయం తెలిసిందే. ఎప్పుడైనా తండ్రిని చూడాలనించినప్పుడు శ్రుతి చెన్నైకి వస్తారు. అప్పుడు కమల్ శ్రుతిని సైకిల్‌పై ఎక్కించుకుని నగరం అంతా తిప్పుతారట. ఎవరయినా గుర్తు పడతారేమోనని తనకు శిరస్త్రాణం ధరించుకుంటారట. ఇది తండ్రీకూతుళ్ల అనుబంధం కథ కాగా కమలహాసన్ నటించిన తాజా చిత్రం పాపనాశం చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రుతిహాసన్ ముంబయిలో తన స్నేహితులు సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారట. ఇది తండ్రీకూతుళ్ల ప్రేమాభిమానానికి చిహ్నం. తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ తన ఆధిక్యతను చాటుకుంటున్న శ్రుతి నటించిన తమిళ చిత్రం పులి త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తున్నారు. ఇక హిందీలో లేటెస్ట్గా కత్రినాకైఫ్ అవకాశాన్ని కొట్టేశారనే ప్రచారం జోరందుకుంది. -
‘పాపనాశమ్’లో కమల్ హాసన్
తొండుపుజ్హా(కేరళ): విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ ‘పాపనాశమ్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కేరళలో జరుగుతున్న షూటింగ్ లో కమల్ హాసన్ శుక్రవారం నుంచి పాల్గొంటారని ఆయన మేనేజర్ ట్వీట్ చేశారు. కొద్దిగా విరామం తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. అనారోగ్యం కారణంగా కమల్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. మలయాళ 'దృశ్యం' తెరకెక్కించిన ఇంట్లోనే షూటింగ్ జరుపుతున్నారు. ఈ ఇల్లును తమిళ నేపథ్యానికి అనుగుణంగా మార్చారు. అయితే సీన్లు వేరేగా ఉంటాయంటున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం' ఈ చిత్రానికి మాతృక. పాపనాశమ్ లో కమల్ సరసన గౌతమి నటిస్తోంది. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.