‘పాపనాశమ్’లో కమల్ హాసన్ | Kamal Haasan joins 'Papanasam' team in Kerala | Sakshi
Sakshi News home page

‘పాపనాశమ్’లో కమల్ హాసన్

Oct 10 2014 11:12 AM | Updated on Sep 29 2018 5:17 PM

‘పాపనాశమ్’లో కమల్ హాసన్ - Sakshi

‘పాపనాశమ్’లో కమల్ హాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ ‘పాపనాశమ్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తొండుపుజ్హా(కేరళ): విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ ‘పాపనాశమ్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కేరళలో జరుగుతున్న షూటింగ్ లో కమల్ హాసన్ శుక్రవారం నుంచి పాల్గొంటారని ఆయన మేనేజర్ ట్వీట్ చేశారు. కొద్దిగా విరామం తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. అనారోగ్యం కారణంగా కమల్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

మలయాళ 'దృశ్యం' తెరకెక్కించిన ఇంట్లోనే షూటింగ్ జరుపుతున్నారు. ఈ ఇల్లును తమిళ నేపథ్యానికి అనుగుణంగా మార్చారు. అయితే సీన్లు వేరేగా ఉంటాయంటున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం' ఈ చిత్రానికి మాతృక. పాపనాశమ్ లో కమల్ సరసన గౌతమి నటిస్తోంది. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement