breaking news
Overseas Citizens of India
-
యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా. -
ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా.. తొలి వ్యక్తి మన హైదరాబాదీనే !
Overseas citizenship Of India concept and Its benefits : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడగరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. తాతలు, ముత్తాతల కాలంలో విదేశాల్లో స్థిరపబడినా ఇంకా తమలోని భారతీయను మరిచిపోలేని వారు ఎందరో ఉన్నారు. ఇందులో కొందరు మరోసారి తమ మాతృనేల మీద మమకారంతో ఇక్కడి పౌరసత్వాన్ని ఆశించారు. అయితే అందుకు రాజ్యాంగ చిక్కులు ఎదురయ్యాయి... ఏళ్లు గడిచాయి.. చివరకు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) తో ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. ద్వంద పౌరసత్వ డిమాండ్‌కి మధ్యేమార్గంగా కేంద్రం తెచ్చిన ఓసీఐని అందుకున్న మొదటి ప్రవాసుడు మన హైదరాబాదీ. ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మీ కోసం.. డ్యూయల్ సిటిజెన్ షిప్ (ద్వంద్వ పౌరసత్వం) కోసం.. ప్రవాస భారతీయులు (ఇండియన్ డయసపోరా) చాలా కాలంగా కోరుతున్నారు. మరోవైపు భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. దీంతో మధ్యేమార్గంగా భారత పౌరసత్వ (సవరణ) చట్టం, 2005 ద్వారా ఓసీఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని నిబంధనలకు లోబడి ఓసీఐ కలిగిన వారు భారత పౌరులతో సమానంగా అనేక హక్కులను పొందవచ్చు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేపథ్యం ఉన్న వారికి మాత్రం అర్హత లేక పోవడం గమనార్హం. అంతకు ముందు పదహారేళ్ల ఏళ్ల క్రితం 2006 జనవరిలో హైదరాబాద్ లో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ సదస్సులో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (విదేశీ పౌరసత్వం కలిగిన భారత ప్రవాసీ) అనే పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో అప్పటి వరకు జారీ చేస్తూ వచ్చిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఓ) కార్డులను ఓసీఐ కార్డులుగా విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్ 2014న భారత ప్రభుత్వం ప్రకటించింది. తొలి కార్డు హైదరాబాదీకే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా తొలి కార్డు ఓ హైదరాబాదీకి జారీ అయ్యింది. 2016 జనవరి 7న జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మొట్టమొదటి ఓసీఐ కార్డును హైదరాబాద్ కు చెందిన ఇండియన్-అమెరికన్ ఇఫ్తేఖార్ షరీఫ్ అందజేశారు. ఎవరీ ఇఫ్తేఖార్ షరీఫ్ అమెరికా పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తి అయిన ఇఫ్తేఖార్ షరీఫ్ ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు. అమెరికాలోని చికాగో నివాసిస్తున్నారు. ఆయన పూర్వీకులు హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉండేవారు. ఆయన బంధువులు ఇక్కడే జీవిస్తున్నారు. ఓసీఐతో ప్రయోజనాలు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ (భారతీయ విదేశీ పౌరుడు) అంటే.. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అని అర్థం. ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఉన్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాములకు భారతదేశంలో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఉంటుంది. 'ఓసీఐ' కార్డుదారులు భారతదేశాన్ని ఎన్నిసార్లు అయినా సందర్శించడానికి జీవితకాల వీసా పొందుతారు. ఆర్థిక, విద్యా రంగాలలో ఎన్నారైలతో సమాన అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ భూములు, తోటలు కొనడంపై మాత్రం నిషేధం. వర్తించనవి ఓసీఐ కార్డు కలిగి ఉండటం వలన భారత పౌరసత్వ హోదా రాదు. భారతీయ ఎన్నికలలో ఓటు వేసే హక్కు రాదు. కేవలం నివాసం, పని చేసుకునే హక్కులు ఉంటాయి. కాగా చివరి సారిగా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా పథకంలో కొన్ని మార్పులను 2021 ఏప్రిల్‌లో చేపట్టారు. ఇవీ అర్హతలు ఓసీఐ కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు గాని, వారి తల్లిదండ్రులు గాని, తాతలు గాని, ముత్తాతలు గాని భారతీయులు అనే రుజువులను సమర్పించాలి. అనగా... తాము భారతీయ పూర్వీకుల పిల్లలు, మనుమలు, ముని మనుమలు / మనవరాళ్లు అని నిరూపించుకోవాలి. విదేశీ మిలిటరీలో పనిచేసిన వారు అనర్హులు. ఈ విషయంలో ఇజ్రాయిల్ వారికి మినహాయింపు ఇచ్చారు. 19వ శతాబ్దంలో భారతదేశం నుండి సురినామ్కి వెళ్లి డచ్ జాతీయత పొందినవారికి సంబంధించి ఆరు తరాల వరకు అర్హులుగా పేర్కొన్నారు. ఓసీఐ పొందడం ఇలా ఓసీఐ కార్డు కోసం ociservices.gov.in లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఓసీఐ పొందేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమాలతో పాటు మరిన్ని వివరాలు https://www.mea.gov.in/overseas-citizenship-of-india-scheme.htm పోర్టల్‌లో లభిస్తాయి. చదవండి:ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు -
ఓసీఐ కార్డుదారులకు శుభవార్త
వాషింగ్టన్: ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డ్ ఉన్న విదేశాల్లోని భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 20 ఏళ్ల లోపు, లేదా 50 ఏళ్ల పైబడిన వయసు ఉండి, ఇటీవలే తమ పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకుని, భారత్‌కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ శుభవార్త. వారు తమ ఓసీఐ కార్డ్‌తో పాటు కొత్త పాస్‌పోర్ట్, రద్దైన పాత పాస్‌పోర్ట్.. రెండూ తమ వద్ద పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్‌కు రావచ్చని భారత హోంశాఖ లోని విదేశాంగ విభాగం మంగళవారం ప్రకటించింది. 2020, జూన్ 30 వరకు ఈ వెసులుబాటు కల్పించామని పేర్కొంది. -
వీసా సమస్యలపై ఓపెన్ హౌస్
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి.. వాషింగ్టన్: వీసా, పాస్‌పోర్ట్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే జనవరి నుంచి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ‘భారత రాయబార కార్యాలయంలో, ఐదు కాన్సులేట్లలో వచ్చే జనవరి మొదటి వారంలో ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నాం’అని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్ణ వెల్లడించారు. ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స ఆదివారం వాషింగ్టన్లో నవతేజ్ సర్ణను సత్కరించారుు. ఇప్పటివరకూ అమెరికాలో భారత ఉప రాయబారిగా వ్యవహరించిన తరణ్‌జిత్ సింగ్ సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా వెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో సర్ణ మాట్లాడారు. వీసా, పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డులపై సమస్యలుంటే ఓపెన్‌హౌస్‌లో వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఓపెన్ హౌస్ నిర్వహిస్తామని.. హౌస్ నిర్వహించే తేదీ, సమయాన్ని వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. ఇలాంటి ఏర్పాట్లే అమెరికాలో ఉన్న తమ అన్ని కాన్సులేట్లలో చేస్తామన్నారు. ప్రస్తుత వ్యవస్థలన్నీ బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయని.. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కొన్నేళ్లలో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంధు మాట్లాడుతూ భారత్, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు.