breaking news
outside
-
బయట తినేటప్పుడు జర భద్రం..!
వీధి వీధికి ఒక రెస్టారెంట్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్లెన్ ఫుడ్ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే..అందులో ఏకంగా చికెన్ పీస్‌లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్‌గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్ వంటకాలు ఆర్డర్ చేశారు. అయితే సర్వర్ తెచ్చిన పనీర్ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్రశ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్ ప్యాక్ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. ఇది అందరూ చేసే తప్పు..కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్లలో అన్నం, కూరగాయలు, సలాడ్లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే జరగడం బాధకరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్‌గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్‌లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్‌లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్ సర్వర్ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్‌కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. (చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Lok sabha elections 2024: మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని..
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్‌సభ స్థానానికి బీఎస్పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను. ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్వాడ స్థానానికి, నేను బాలాఘాట్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్‌లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు. -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
నడిబొడ్డున RBI వద్ద అక్రమ దందా!
-
'బహిర్భూమికి బయటకు వెళితే కేసులే'
షాద్‌నగర్: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుండా ఆరు బయటే మలవిసర్జన చేస్తే కేసులు పెడతామని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ డెవల ప్మెంట్ ఆఫీసర్ (సీడీవో) హేమలత హెచ్చరించారు. శనివారం ఆమె షాద్‌నగర్ మండలం ఫరూక్‌నగర్‌లో పర్యటించారు. స్థానిక హరిజనవాడలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అందరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కోరారు. నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. -
సెయింట్ డెనిస్‌లో ఆపరేషన్‌లో కీలక దృశ్యాలు