breaking news
optometry
-
అవకాశాల వేదిక.. ఆప్టోమెట్రీ
దేశంలో హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కెరీర్‌పై ఫోకస్.. ఆప్టోమెట్రీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘ఆప్టోస్’ అంటే కళ్లు లేదా చూపు, ‘మెటీరియా’ అంటే కొలత అని అర్థం. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించే వృత్తి నిపుణులను ఆప్టోమెట్రీస్ట్స్‌గా వ్యవహరిస్తారు. ఒక అంచనా మేరకు దేశంలో ప్రతి రెండులక్షల జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇది చాలా స్వల్పం. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా దేశంలో నేడు రెండు లక్షల మంది క్వాలిఫైడ్ ఆప్టోమెట్రీషియన్ల అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆప్టోమెట్రీ రంగం 20 శాతం మేర విస్తరిస్తోంది. దాంతో ఆమేరకు అవకాశాలు అధికమవుతున్నాయి. ప్రవేశం ఇలా: ఆప్టోమెట్రిక్ రంగానికి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అభ్యసించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. దేశంలో ఆప్టోమెట్రీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు.. బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్, డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, బ్యాచిలర్ ఇన్ క్లినికల్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ. వీటికి అర్హత 10వ తరగతి/ఇంటర్మీడియెట్ (సెన్సైస్). ఉన్నత విద్య విషయానికొస్తే..ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సు తర్వాత పీజీ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఎంఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్డీ కోర్సులను ఎంచుకోవచ్చు. అమెరికాలో ఓడీ (డాక్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ) కోర్సు చేయవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ: ఇగ్నో... ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్తాల్మిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును నిర్వహిస్తుంది. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). ప్రతి ఏడాది జూన్ నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కోర్సులో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ(10 శాతం వెయిటేజీ) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. థియరీ క్లాసులను ఇగ్నో నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ మాత్రం సంబంధిత ఐ హాస్పిటల్స్/ఐ రీసెర్చ్ సెంటర్స్/ ఐ ఇన్స్టిట్యూట్లలో ఉంటాయి. వివరాలకు: www.ignou.ac.in మన రాష్ట్రంలో: మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (డీఓఎం), డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ (డీఓఏ), బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 614 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 1,781 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సీట్లకు సరిపడ విద్యార్థులు లేనిపక్షంలో ఎంపీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తుంది. వివరాలకు: www.appmb.org బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ: మన రాష్ట్రంలో ఈ కోర్సును బిట్స్-పిలానీ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు చెందిన బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ అందిస్తోంది. వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ/ఎంపీసీ). అడ్మిషన్ ప్రక్రియ జూలైలో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సులు.. ఆప్టోమెట్రీ ఇంటర్న్‌షిప్: మూడేళ్ల ఆప్టోమెట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఆప్టోమెట్రీ ఫెలోషిప్: బీఎస్సీ-ఆప్టోమెట్రీ అర్హత ఉన్న విద్యార్థులకు ఏడాది ఫెలోషిప్, డిప్లొమా ఉన్న విద్యార్థులకు రెండేళ్ల ఫెలోషిప్ అందజేస్తున్నారు. విజన్ టెక్నిషియన్ కోర్సు: అర్హత: 10+2. ఏడాదికి రెండు సార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్‌లలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. వివరాలకు: http://education.lvpei.org భారత్ సేవక్ సమాజ్(బీఎస్ఎస్-కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంస్థ) ఒకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాధమిక కంటి ఆసుపత్రులు, ఆప్టికల్స్ షోరూంలను నిర్వహించడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. నెలకు కనీసం రూ.15వేలకు పైగా సంపాదించవచ్చు. ఏపీ పారా మెడికల్ బోర్డు నిర్వహించే ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులకు సాధారణంగా ప్రతి జూన్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీ పారా మెడికల్ బోర్డు ద్వారా కోర్సులు చేసిన వారికి మన రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో తప్పనిసరిగా ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు స్కూల్ ఐ హెల్త్ సర్వే, మొబైల్ ఐ క్యాంపులు, కేటరాక్ట్ స్క్రీనింగ్ చేయడంతోపాటు రిఫ్రాక్స్నిస్టుగా పనిచేయవచ్చు. - డాక్టర్ కోలా విజయ్‌శేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల. అవకాశాలు ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభస్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టికల్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఒకప్పటిలా కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లోను ఐ హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించడం.. సదరు అభ్యర్థులకు డిమాండ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు సహాయం చేసే ఆప్టోమెట్రీషియన్ల అవసరం కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఆప్టోమెట్రిక్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తోన్న క్రమంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నెలకొల్పుతుండడం, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తుండడం కూడా ఆప్టోమెట్రీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఈఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా వీరిని నియమించుకుంటాయి. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజిషియన్స్, ఇన్స్టిట్యూట్, క్లినిక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలి. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన హోదాకు చేరుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు. కావల్సిన లక్షణాలు సేవా దృక్ఫథం, ఓర్పు, సహనం, అంకిత భావం కళ్లు, లెన్సెస్‌తో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి కచ్చితత్వం, సున్నితత్వాన్ని కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి సమయంతో నిమిత్తం లేకుండా కష్టపడే తత్వం నిర్ణయాత్మక సామర్థ్యం జట్టుగా, సమన్వయంతో పని చేసే తత్వం శాస్త్రీయ వైఖరి, విశ్లేషణాత్మక సామర్థ్యం అనుకూలతలు: చక్కని హోదా-ఆకర్షణీయమైన వేతనం మాంద్యం సోకని ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు {పతి ఏటా విస్తరిస్తోన్న రంగం టాప్ మెడికల్ ప్రొఫెషన్లలో ఒకటి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ -న్యూఢిల్లీ ఆంధ్రా మెడికల్ కాలేజీ-విశాఖపట్నం భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణే ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్-హైదరాబాద్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్ -
కొలువుకు సులువైన మార్గం.. జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు...
ఆప్టోమెట్రీ ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంటే అన్ని ఇంద్రియాల్లో కన్ను అతి ముఖ్యం. నేడు చిన్న కార్యాలయం నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు కంప్యూటర్ల వాడకం తప్పనిసరైంది. ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌పైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల రాకతో కంటి సమస్యలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కోర్సులు పూర్తిచేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. కళ్లకు సంబంధించిన ప్రాథమిక జాగ్రత్తలు, వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులను బోధించేందుకు రూపొందించిన కోర్సే.. ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభ స్థాయిలోనే నివారించవచ్చు. దేశంలో ప్రస్తుతం ప్రతి లక్ష మందికి ఒక్క నేత్రవైద్య నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కోర్సులు: డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఈ కోర్సును ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (వెబ్సైట్: www.appmb.org) ఆధ్వర్యంలో దాదాపు 382 కళాశాలలు అందిస్తున్నాయి. వీటిలో మొత్తం 554 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హైదరాబాద్‌లో ఉన్న సరోజినిదేవీ కంటి ఆస్పత్రి ఈ కోర్సును అందిస్తోంది. మన దేశంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ - వెల్లూరు, ఆర్మడ్ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణె (వెబ్సైట్: www.afmc.nic.in) మొదలైన సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. స్కిల్స్: ఓపిక , సహనం ఉండాలి. కళ్లకు సంబంధించిన సమస్యలను వెంటనే గుర్తించగల నైపుణ్యం ఉండాలి. కెరీర్: ఆప్టోమెట్రీ కోర్సులు చేసినవారికి వివిధ ఆస్పత్రుల్లో, ఆప్టికల్ షోరూమ్‌ల్లో, కళ్లజోళ్ల తయారీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కంటికి సంబంధించిన పరీక్షలే ఉంటున్నాయి. చిన్నారుల కంటి సమస్యలను గుర్తించి, సరైన కళ్ల జోడును సూచించాల్సి ఉంటుంది. రెండు, మూడేళ్ల అనుభవం ఉంటే సొంతంగా ఆప్టికల్ షాప్, ఐ క్లినిక్ నిర్వహించుకోవచ్చు. విదేశాల్లోనూ అవకాశాలున్నాయి. వేతనాలు: ఆప్టోమెట్రీ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రారంభంలో * 10,000 వేతనం అందుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఆదాయం పొందొచ్చు. సొంతంగా క్లినిక్ నిర్వహిస్తే ఎక్కువ ఆదాయాన్ని గడించొచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ మధ్యతరగతి ప్రజల నుంచి అత్యున్నత ఆదాయ వర్గాల ప్రజల వరకు తమ ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నారు. ఇక కార్పొరేట్ సంస్థలు, ఇతర కార్యాలయాలు తమ షోరూమ్‌లను, ఆఫీసులను, షాప్‌లను వినియోగదారులను ఆకట్టుకునేలా డిజైనింగ్ చేయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన కోర్సు.. ఇంటీరియర్ డిజైనింగ్. నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంటీరియర్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియుల్, కవుర్షియుల్ రంగాల్లో నిపుణులైన ఇంటీరియుర్ డిజైనర్లకు దేశీయుంగా ఎంతో డివూండ్ ఉంది. రెసిడెన్షియుల్ డిజైనింగ్‌లో భాగంగా కిచెన్ అండ్ బాత్రూమ్ డిజైన్, యూనివర్సల్ డిజైన్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కవుర్షియుల్ ఇంటీరియుర్ డిజైనింగ్‌లో భాగంగా.. ఫర్నీచర్ డిజైన్, హెల్త్‌కేర్ డిజైన్, హాస్పిటాలిటీ డిజైన్, రిటైల్ డిజైన్, వర్క్‌స్పేస్ డిజైన్ వంటి స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. కోర్సులు, అర్హత: ఇంటీరియుర్ డిజైనింగ్‌లో డిప్లొమా నుంచి పీజీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (వెబ్సైట్: www.nid.edu), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (www.mu.ac.in) మొదలైన సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. దానికితోడు వినియోగదారులను ఆకట్టుకునేలా ఆకర్షణీయుమైన రంగులు, అందమైన రూపాలను, డిజైన్లను ఎంపిక చేయుగల నైపుణ్యం ఉండాలి. కావాల్సిన స్కిల్స్: డిజైన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ కోఆర్డినేషన్ స్కిల్స్ , పరిశీలనా నైపుణ్యాలు అవకాశాలు: ఇంటీరియుర్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే అవకాశంతోపాటు ఇంటీరియుర్ డెకరేషన్ సంస్థలలో ఉపాధి అవకాశాలు పొందొచ్చు. బహుళజాతి సంస్థలు, వివిధ కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు, గృహనిర్మాణ సంస్థలు దేశవ్యాప్తంగా తమ శాఖలను ఏర్పాటు చేస్తున్న నే పథ్యంలో వీరికి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ల్యాండ్‌స్కేప్, రెసిడెన్షియుల్, కవుర్షియుల్ ఇంటీరియుర్ డిజైనర్‌గా ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. భారీ, చిన్నత రహా కంపెనీలు తరచూ ఇంటీరియుర్ డిజైనర్ల నియూవుకాలు జరుపుతుంటాయి. భారీ నిర్మాణ సంస్థలు ఇంటీరియుర్ డిజైనర్లను ఎక్కువగా నియుమించుకుంటున్నాయి. స్వయుం ఉపాధి రంగంలోనూ విభిన్న అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వేతనాలు: ఇంటీరియుర్ డిజైనర్ల వేతనాలు వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటారుు. ఈ విషయుంలో అనుభవం కూడా వుుఖ్య పాత్రను పోషిస్తుంది. ప్రారంభంలో నెలకు * 15,000 వేతనం ఉంటుంది. ఆ తర్వాత పనిలో అనుభవం పొంది, మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంటే నెలకు లక్షల్లోనే సంపాదించొచ్చు. యానిమేషన్, మల్టీమీడియా సూక్ష్మ పరిశీలన.. సృజనాత్మకత.. కొత్త అంశాలను నేర్చుకోవాలనే తపన.. సాంకేతిక పరిజ్ఞానం పట్ల అభిరుచి ఉన్న అభ్యర్థులకు చక్కగా సరిపోయే రంగం యూనిమేషన్. ఎంటర్టైన్మెంట్కు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోన్న ప్రస్తుత తరుణంలో యూనిమేషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. నిశ్చలంగా ఉన్న దృశ్యాలు, చిత్రాలకు చలనం కలిగించి.. ప్రాణం ఉన్నవిగా భ్రమింపజేయడం యూనిమేషన్ ద్వారా సాధ్యం. నేడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియూ, సినిమా రంగాల్లో.. మల్టీమీడియూ, యూనిమేషన్ తోడ్పాటు లేకుండా ఏ కార్యక్రమం రూపొందడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రంగాలను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి సృజనాత్మకత, పరిశీలనా దృక్పథం ఉండాలి. ఈ రంగంలో వచ్చే మార్పులను గమనిస్తూ.. ఆలోచనలకు పదునుపెడుతూ.. ప్రతిభను ప్రదర్శించాలి. యూనిమేషన్, మల్టీమీడియూలో వివిధ కోర్సులను అందించే సంస్థలు మన రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థలైన సెట్విన్, ఎన్ఐ- ఎమ్ఎస్ఎమ్ఈ వంటి సంస్థలతోపాటు పలు ప్రైవేటు సంస్థలు కోర్సులను నిర్వహిస్తున్నాయి. యూనిమేషన్, మల్టీమీడియూ కోర్సుల్లో చేరాలనుకునే వారు తమ ఆసక్తి, అభిరుచిని బట్టి ఆయూ కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఉద్యోగావకాశాలు: నైపుణ్యాలున్న యానిమేటర్లకు దేశ విదేశాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. అడ్వర్ైటైజింగ్,టీవీ బ్రాడ్‌కాస్టింగ్, ఫిల్మ్, టీవీ ప్రోగ్రామ్స్, గేమ్స్, ఆర్కిటెక్చర్, వెబ్, ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అప్లికేషన్స్, స్పేస్ ఎక్ప్ప్లోరేషన్స్, మెడికల్ ఇమేజింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో జాబ్స్ పుష్కలం. ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రోజురోజుకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. జీతభత్యాలు: ప్రారంభంలో ట్రైనీ, లేదా జూనియర్ యానిమేటర్‌గా రూ. 8,000-15,000 లతో కెరీర్ ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో రూ. 25,000-40,000 ల వరకూ సంపాదించొచ్చు. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నవారు విదేశాల్లో సైతం రాణిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. భారత చిన్న, మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ) అందజేసే మల్టీమీడియూ, యూనిమేషన్ కోర్సులకు మంచి పేరుంది. కోర్సులు: అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ 2డి యూనిమేషన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ 3డి యూనిమేషన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ 2డి, 3డి యూనిమేషన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఆడియో-వీడియో ఎడిటింగ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా వెబ్సైట్: www.nimsme.org టీచింగ్ చక్కని పనిగంటలతోపాటు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సువర్ణావకాశం ఉపాధ్యాయవృత్తి. ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా ఉండే అతికొద్ది రంగాల్లో టీచింగ్ ఒకటి. నేటి తల్లిదండ్రులు తమ చిన్నారుల సమగ్ర వికాసానికి ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఓ మాదిరి పట్టణాల్లో సైతం కార్పొరేట్ స్కూళ్లు, ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. బహుళజాతి సంస్థలు కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పాఠశాలలను నెలకొల్పనున్నాయి. ఈ నేపథ్యంలో టీచింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. డిప్ల్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ): అర్హత: ఇంటర్మీడియెట్. మన రాష్ట్రంలో నిర్వహించే డైట్‌సెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. దాదాపు 400 కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 40,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అవకాశాలు: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి చక్కని మార్గం డీఈడీ (డిప్ల్లొమా ఇన్ ఎడ్యుకేషన్). ఈ కోర్సు పూర్తిన చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో టీచర్‌గా స్థిరపడొచ్చు. అంతేకాకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ కొలువు గ్యారంటీ అని చెప్పొచ్చు. ప్రీ-ప్రైమరీ కోర్సులు:డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్ హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్ {పొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్ పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ అర్హత: పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. ఆంధ్ర మహిళ సభ-హైదరాబాద్, మాంటిస్సోరి ఇన్స్టిట్యూట్ (www.indianmontessoricentre.org), సెట్విన్, ఇగ్నో మొదలైన సంస్థలు వివిధ స్థాయిల్లో ఈ కోర్సులను అందిస్తున్నాయి. అవకాశాలు: కిండర్ గార్డెన్ స్కూల్స్, నర్సరీ స్కూల్స్‌లో అవకాశాలు ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్: కోర్సులు: విజువల్, హియరింగ్ ఇంపెయిర్మెంట్, స్పీచ్ థెరపీ, ఆటిజం అండ్ స్పెక్ట్రమ్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ విభాగంలో పలు డిప్లొమా కోర్సులు. అర్హత: ఇంటర్మీడియెట్. వెబ్సైట్ www.rehabcouncil.nic.in చూడొచ్చు. అవకాశాలు: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలు, సర్వశిక్షా అభియాన్ పాఠశాలలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్: కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ) అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం వీటిలో ప్రవేశానికి మన రాష్ర్టంలో పీఈసెట్ రాయాలి. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 13 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవకాశాలు: డీఎస్సీ రాసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలను పొందొచ్చు. ప్రైవేట్ స్కూల్స్‌లోనూ వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. క్లినికల్ రీసెర్చ్ వివిధ రకాల వ్యాధుల నివారణలో ఉపశమనం కలిగించే ఔషధాలను ఉత్పత్తి చేయడం వెనుక భారీ కసరత్తే జరుగుతుంది. ఈ ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను క్లినికల్ రీసెర్చ్ లేదా ట్రయల్స్ అని అంటారు. ఇందులో పాలుపంచుకునే వారే క్లినికల్ రీసెర్చ్ నిపుణులు. క్లినికల్ రీసెర్చ్ ప్రక్రియను ఫార్మాస్యూటికల్ సంస్థలు నిర్వహిస్తాయి. ఒక ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ముందు.. సంబంధిత ఔషధాన్ని వ్యక్తులపై ప్రయోగిస్తారు. వారిలో కనిపించే ప్రతిస్పందనలు, ఫలితాన్ని, లోటుపాట్లను బేరీజు వేసి.. దాని ఆధారంగా ఔషధ పనితీరును పరిశీలించడం క్లినికల్ రీసెర్చ్‌లో ప్రధాన ప్రక్రియ. దాని ఆధారంగా ఒక ఔషధంలో ఏ మోతాదులో ఏ మిశ్రమాన్ని వినియోగించాలనే నిర్ణయానికి వస్తారు. తర్వాత మార్కెట్లో ప్రవేశపెడతారు. ఈ మొత్తం ప్రక్రియను క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఆ ట్రయల్స్‌లో భాగంగా మనుషులపై ఔషధాన్ని ప్రయోగించే సమయంలో ప్రతి దశ లోనూ.. క్షుణ్నంగా పరిశీలించడం, పర్యవసానాలకు కారణాలను వెతకడం, నివేదికలు తయారు చేయడం... ఈ విభాగంలో పనిచేసే వారి విధులు. క్లినికల్ ట్రయల్స్ చేయందే ఏ ఔషధాన్ని కూడా మార్కెట్లో విడుదల చేయకూడదు. దాంతో ప్రతి ఫార్మాస్యూటికల్ కంపెనీ డ్రగ్ డెవలప్మెంట్ కోసం క్లినికల్ రీసెర్చ్ చేయడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో క్లినికల్ రీసెర్చ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. వివిధ నివేదికల ప్రకారం.. భారతదేశంలో లక్ష మంది క్లినికల్ రీసెర్చ్ అభ్యర్థుల అవసరం ఉంది. కోర్సులు.. కాలేజీలు: క్లినికల్ రీసెర్చ్‌లో పీజీ డిప్లొమా, స్వల్పకాలిక డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, బిల్కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ అకాడెమీ.. క్లినికల్ రీసెర్చ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి బీఎస్సీ లైఫ్‌సెన్సైస్, బీఫార్మసీ, బయోటెక్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు అర్హులు. కెరీర్: మనదేశంలో ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా మన రాష్ట్రం ఫార్మా హబ్‌గా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఫార్మాస్యూటికల్ కంపెనీలు డ్రగ్ డెవలప్మెంట్, తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇవే కాకుండా ప్రపంచ జనాభాలో భారత్ రెండో అతిపెద్ద దేశం కావడం వల్ల వివిధ దేశాల కంపెనీలు భారత్‌లో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో క్లినికల్ రీసెర్చ్ కోర్సుల పూర్తిచేసినవారికి అవకాశాలు పుష్కలం. వేతనాలు: కంపెనీని బట్టి ప్రారంభంలో నెలకు *15,000 నుంచి 20,000 వరకు వేతనాలు అందుకోవచ్చు. తమ నైపుణ్యాలతో ఒకటి, రెండేళ్లలోనే నెలకు లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారు. ఫారెన్ లాంగ్వేజెస్ ప్రపంచీకరణ తెచ్చిన అవకాశాలతో.. బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఏవైనా విదేశీ భాషలు నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడుతోంది. ఇక్కడి నిపుణులు అక్కడ పనిచేయాలన్నా.. అక్కడి వారు ఇక్కడ విధులు నిర్వర్తించాలన్నా సంబంధిత భాషలు వచ్చి ఉండాలి. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులను వివిధ స్థాయిల్లో అందిస్తున్నాయి. కోర్సులు: అరబిక్/ ఫ్రెంచ్/ రష్యన్/జర్మన్/పర్షియన్/జపనీస్/స్పానిష్‌లలో డిప్లొమా/అడ్వాన్సడ్ డిప్లొమా/పీజీ డిప్లొమా మొదలైనవి. ఈ కోర్సులను ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ -హైదరాబాద్(www.efluniversity.ac.in), ఉస్మా నియా యూనివర్సిటీ-హైదరాబాద్ (వెబ్సైట్:www.osmania.ac.in), రామకృష్ణ మఠం-హైదరాబాద్ (వెబ్సైట్: http://rkmath.org) ఆఫర్ చేస్తున్నాయి. అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. కెరీర్: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వారి భాష మనకు తెలిస్తే టూరిస్ట్ గైడ్‌గా వ్యవహరించొచ్చు. పెద్ద హోటళ్లలోనూ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో పేరొందిన పుస్తకాలను మరొక భాషలోకి అనువదిస్తున్నారు. కాబట్టి విదేశీ భాషపై పట్టు ఉంటే ట్రాన్స్‌లేటర్‌గా మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో విదేశీ భాషలు నేర్చుకున్నవారికి పెద్ద పీట వేస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ స్కూల్స్‌లో ఏదైనా విదేశీ భాష నేర్చుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సంబంధిత కోర్సులు నేర్చుకున్నవారికి అపార అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జపనీస్, చైనీస్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ భాషలకు మంచి డిమాండ్ ఉంది. పబ్లిషింగ్ హౌసెస్, ఆయా దేశాల ఎంబసీలు, ఎంఎన్‌సీలు, టూరిజం సంస్థలు, ఎయిర్‌లైన్ సంస్థలు, ఎక్స్పోర్ట్ ఏజెన్సీల్లో కూడా వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. వేతనాలు: ప్రారంభంలో కనీసం నెలకు * 20,000 వరకు అందుకోవచ్చు. రెండు, మూడేళ్ల అనుభవం ఆధారంగా నెలకు 40,000కు పైగా సంపాదించొచ్చు. జ్యూయలరీ డిజైనింగ్ కొత్తగా, మరింత నాజూగ్గా, మిరుమిట్లు గొలిపే ఆభరణాలను సృష్టించగల ఊహాశక్తి, అభిరుచి, ఆసక్తి కలిగిన వారికి అపార అవకాశాలను అందించే కోర్సు.. జ్యూయలరీ డిజైనింగ్. కార్పొరేట్ సంస్థలు సైతం ఈ రంగంలో అడుగుపెట్టడంతో జ్యూయెలరీ డిజైనింగ్‌లో మంచి అవకాశాలున్నాయి. ఏ సంస్థ అయినా ఎప్పటికప్పుడు ముచ్చటైన, తాజా డిజైన్లతో ఆభరణాలను వినియోగదారుల ముందుంచితేనే మనుగడ. అలా తీసుకువచ్చే సంస్థలకే మార్కెట్లో ఆదరణ. ఈ మొత్తం వ్యవహారంలో జ్యూయలరీ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని మగువల మనస్సు దోచే ఆభరణాలు రూపొందిస్తున్నారు నేటి డిజైనర్లు. అంతేకాకుండా బంగారంతో మాత్రమే కాకుండా వివిధ లోహ మిశ్రమాలను ఉపయోగించి కళ్లు చెదిరే నగలను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యూయలరీ డిజైనింగ్ కోర్సులు చేసినవారికి జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి. కావాల్సిన నైపుణ్యాలు: ఈ రంగం పట్ల మక్కువతో పాటు ఆభరణాల డిజైనింగ్‌కు సంబంధించి సృజనాత్మక ఆలోచనలు, ఇలస్ట్రేషన్ నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యం, లోహాలు, లోహ మిశ్రమాలకు సంబంధించిన రసాయన శాస్త్ర అవగాహన జ్యూయలరీ డిజైనర్‌కు ఉండాలి. అర్హత: జ్యూయలరీ డిజైనింగ్‌లో సర్టిఫికేట్ స్థాయి నుంచి డిప్లొమో వరకూ అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. +2 (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులైనవారు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులకు అర్హులు. వేతనం: జ్యూయలరీ రంగంలో ప్రైవేటు సంస్థలే అధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అందువల్ల డిజైనర్ల వేతనాలు సంస్థ ఆదాయం ప్రాతిపదికగా మారుతుంటాయి. డిజైనర్ నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా వేతనాలు ఉంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ.15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. తర్వాత పనితీరు, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా మరింత సంపాదించవచ్చు. కోర్సులను అందిస్తున్న సంస్థలు: నోయిడా (యూపీ)లోని జ్యూయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జేడీటీఐ), ముంబైలోని జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సూరత్‌లోని డైమండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు జ్యూయలరీ డిజైనింగ్‌లో కోర్సులను అందిస్తున్నాయి. ఇవి జ్యూయలరీ డిజైనింగ్‌తోపాటు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్ శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. వేలాది అవకాశాల తరంగంగా వూరుతోంది.. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థారుులో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. టూరిజం, హోటళ్లు, రిసార్టులు, ఫైవ్‌స్టార్ హోటళ్ల విస్తరణతో ఈ డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ప్రవేశం: హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్స్టిట్యూట్లు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. అవకాశాలు: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ పొందొచ్చు. స్కిల్స్: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజీరియల్ నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు స్కిల్స్ వేతనాలు: కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. స్టాక్ ఎనలిస్ట్ తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలంటే మార్గం.. స్టాక్ మార్కెట్. సంప్రదాయ పొదుపు పథకాలైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు ఒక స్థాయి వరకు మాత్రమే ఆదాయాన్ని అందిస్తాయి. కానీ స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహికులకు సరైన సలహాలు, సూచనలు అవసరం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. వ్యక్తులు లేదా సంస్థల సెక్యూరిటీల క్రయవిక్రయాల విషయంలో స్టాక్ బ్రోకర్ డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా వ్యవహరిస్తాడు. ఏ షేర్లు, ఫండ్ యూనిట్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయో వినియోగదారులకు తెలియజేస్తాడు. స్కిల్స్: {పపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు వివిధ కంపెనీల వ్యాపార వ్యవహారాలను, లావాదేవీలను పరిశీలిస్తూ ఉండాలి. రానున్న రోజుల్లో, సంవత్సరాల్లో ఏ రంగానికి సంబంధించిన షేర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందో విశ్లేషించగలగాలి. కోట్ల రూపాయల్లో జరిగే బిజినెస్ కాబట్టి నిరంతర అప్రమత్తత అవసరం. కోర్సులను అందిస్తున్న సంస్థలు: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా... సర్టిఫికెట్ ఇన్ సెక్యూరిటీస్ ‘లా’స్: ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. అర్హత: ఏదైనా డిగ్రీ. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్: ఏడాది వ్యవధి అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.nseindia.com ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ముంబై: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్, సర్టిఫికెట్ కోర్స ఇన్ కరెన్సీ మార్కెట్ కోర్సులతోపాటు సంబంధిత కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.bseindia.com కెరీర్- వేతనాలు: ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లోనూ, బ్యాంకుల్లోనూ అవకాశాలు ఉంటాయి. వేతనం నెలకు కనీసం రూ.15,000 నుంచి 20,000 వరకు ఉంటోంది. కంప్యూటర్/ఐటీ కోర్సులు సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) నిరుద్యోగులకు అనేక రకాల వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. వికలాంగులు, మహిళలు, విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్న వారికి సైతం ప్రయివేటు రంగంలోని పలు విభాగాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కంప్యూటర్ కోర్సుల గురించి నెల వ్యవధి ఉన్న ఏడాది వ్యవధి ఉన్న కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది. కోర్సులు: ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సీ, సీ++, ఒరాకిల్, యూనిక్స్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, ఆటో క్యాడ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డవేర్, సర్టిఫికెట్ కోర్స ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ (బేసిక్, అడ్వాన్సడ్), కంప్యూటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, జావా, డిప్లొమా ఇన్ అడ్వాన్స క్యాడ్/క్యామ్, కాల్ సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స వంటి కోర్సులను మన రాష్ర్టంలో సెట్విన్ అందిస్తోంది. అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. కెరీర్: ఈ కోర్సులు పూర్తిచేసివారికి సెట్విన్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. అంతేకాకుండా స్వయంఉపాధికి అవసరమైన గెడైన్సను కూడా అందిస్తోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలో ఉద్యోగావకాశాలుంటాయి. ఇప్పుడు దాదాపు ప్రతి కార్యాలయంలోనూ కంప్యూటర్లు వాడుతున్నారు. ఆయా సంస్థల్లో హార్టవేర్ ఇంజనీర్లుగా, డీటీపీ ఆపరేటర్లుగా, వెబ్ డిజైనర్లుగా, మల్టీమీడియా స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.8,000 నుంచి 10,000 వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు 20,000 వరకు అందుకోవచ్చు. వెబ్సైట్: www.setwinapgov.org