breaking news
Open Category
-
102 జీవోతో చిక్కు రిజర్వేషన్లకు ముప్పు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2026–27 విద్యా సంవత్సరం తొలి దశ ప్రభుత్వ కోటా సీట్లను ఇటీవల ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. నీట్లో 23,550 ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థికి ఆంధ్రా మెడికల్ కాలేజీలో బీసీ–ఏ రిజర్వేషన్ కింద సీటు కేటాయించారు. ఈ విద్యార్థి కంటే ఎక్కువ ర్యాంక్ అంటే 23,789 ర్యాంక్ సాధించిన బీసీ–ఏ వర్గానికి చెందిన మరో విద్యార్థికి ఓపెన్ క్యాటగిరి(ఓసీ)లో మెరిటోరియస్ రిజర్వుడు క్యాండిటేడ్ (ఎంఆర్సీ) కింద సీటు వచ్చింది. 31,325 ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థికి గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బీసీ–బీ రిజర్వేషన్ సీటు ఇచ్చారు. అదే కాలేజీలో బీసీ–బీ వర్గానికి చెందిన విద్యార్థి 36,860 ర్యాంక్‌తో ఎంఆర్సీలో సీటు దక్కించుకున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 30,611 ర్యాంక్ సాధించిన విద్యార్థికి బీసీ–డీ కింద సీటు రాగా, అదే వర్గానికి చెందిన 30,767 ర్యాంక్ విద్యార్థికి ఎంఆర్సీలో సీటు వచ్చింది. జీవో–102తో గందరగోళంనీట్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను వారి రిజర్వేషన్లకు పరిమితం చేసి బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వైద్యవిద్య కలను చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన 102 జీవో ఛిద్రం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌పరం చేస్తూ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయేలా చంద్రబాబు చేశారు. ఇది చాలదన్నట్టుగా కొన్నేళ్లుగా సజావుగా సాగుతున్న ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియను జీవో–102 ద్వారా గందరగోళంగా మార్చేశారు. ఫలితంగా మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరిలో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్ కోటాకు పరిమితం చేసి, ఆయా వర్గాల్లోని ఇతర విద్యార్థుల అవకాశాలకు ప్రభుత్వమే గండి కొట్టేసింది. హెల్త్ యూనివర్సిటీ ఇటీవల సీట్లు కేటాయించిన జాబితాలను పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు జరిగిన అన్యాయం స్పష్టమవుతోంది.మెరుగైన ర్యాంక్ సాధించినా..ఒకే రిజర్వేషన్లో ఒకే కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంక్‌లను పరిశీలిస్తేనే విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రా, రంగరాయ, గుంటూరు, కర్నూలు సహా చాలా వైద్య కళాశాలల్లో ఒకే రిజర్వేషన్‌కు చెందిన టాప్ ర్యాంకర్లు రిజర్వేషన్‌కు పరిమితం కాగా.. అంతకంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఎంఆర్సీలో సీట్లు దక్కించుకున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఓపెన్‌లో కాకుండా వారి రిజర్వేషన్లలోనే సీట్లు కేటాయించడంతో ఆయా రిజర్వేషన్లోని ఇతర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన దుస్థితి నెలకొంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో 102 ప్రధాన కారణంగా మారింది. గత ప్రభుత్వంలో 151 జీవో ప్రకారం 2025–26 విద్యా సంవత్సరం వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. అప్పటివరకూ రాష్ట్రంలో టాప్ ర్యాంకర్లు రిజర్వేషన్‌కు పరిమితమై, మిగిలిన విద్యార్థులకు అన్యాయం జరిగిన ఘటనలు ఏనాడూ చోటుచేసుకోలేదు. జీవో 151 రద్దు చేసి సజావుగా సాగుతున్న కౌన్సెలింగ్‌ను 102 జీవో ఇవ్వడం ద్వారా బాబు సర్కారే గందరగోళం చేసేసిందని వైద్య విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రెండు జీవోల మధ్య వ్యత్యాసం ఇలావైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియపై హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ జగన్ హయాంలో నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశాల ప్రక్రియలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెడుతూ జీవో–151 తెచ్చారు. ఈ జీవో ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లుగా ఎంచుకునేవారు. ఈ ఆప్షన్ల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించేది. ఇదిలా ఉండగా జీవో–102 తెచ్చిన చంద్రబాబు సర్కార్ విద్యార్థులు అన్ని ఆప్షన్లు పెట్టుకోవాల్సిన పని లేకుండా చేసింది. దీంతో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు సైతం తమ రిజర్వేషన్లలోనే సీట్లు రావడంతో ఏకంగా 70 మంది రిజర్వేషన్ విద్యార్థులు సీట్లు కోల్పోయిన దౌర్భాగ్యం నెలకొంది. ఇదిలా ఉంటే జీవో 102 ద్వారా ఎవరికి అన్యాయం జరగలేదని హెల్త్ యూనివర్సిటీ బుకాయిస్తోంది. గతేడాది ఓపెన్‌లో 964 మంది రిజర్వేషన్ విద్యార్థులు సీట్లు దక్కించుకోగా.. ఈ దఫా 1,172 మంది సీట్లు దక్కించుకున్నారని కాబట్టి అంతా సక్రమంగానే నడిచిందని వాదిస్తోంది. వాస్తవాలను పరిశీలిస్తే గతేడాది రాష్ట్రస్థాయిలో నీట్ ర్యాంకర్లలోని తొలి 2 వేల మందిలో 1,069 మంది రిజర్వేషన్, మిగిలిన విద్యార్థులు ఓసీలుగా ఉన్నారు. ఈ ఏడాది తొలి 2వేల మందిలో రిజర్వేషన్ విద్యార్థుల సంఖ్య 1,153కు పెరగ్గా, ఓసీ విద్యార్థుల సంఖ్య 847కు పడిపోయింది. ఈ లెక్కన గతేడాదితో ఆటోమేటిక్‌గా ఓపెన్ కేటగిరిలో సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ.. 102 జీవోతో ఎవరూ నష్టపోలేదని ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం. -
సర్కారు తీరుతో రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్ కోటాకు కుదించి, సాధారణ మెరిట్ కలిగిన పేద వర్గాల విద్యార్థులు ప్రభుత్వ కోటా సీటు కోల్పోయే దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మొదటి విడత సీట్లను గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) రీజియన్‌లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంక్ 71,547.. ఎస్వీయూ రీజియన్‌లో 94,966 ర్యాంక్‌కు చివరి సీటు దక్కింది. ఈ రెండు రీజియన్లలో ఓసీ కటాఫ్ కంటే ఎంతో మెరుగైన విద్యార్థులకు హెల్త్ యూనివర్సిటీ రిజర్వేషన్ కోటాలో సీట్లు కేటాయించింది. ఇలా ఏయూలో 43, ఎస్వీయూలో 27 మంది చొప్పున 70 మంది మెరిటోరియస్ విద్యార్థులకు ఓసీ విభాగంలో కాకుండా రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఇచ్చారు. రెండు రీజియన్లలో సీట్ల కేటాయింపును పరిశీలిస్తే ఓసీ కటాఫ్ ర్యాంక్‌ల కంటే మెరుగ్గా 23,550, 30,307, 30,611, 31,325, 37,039 వంటి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను సైతం రిజర్వేషన్ విభాగాల్లో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ మెరిట్‌లోని రిజర్వేషన్ విద్యార్థుల్లో 70 మందికి నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీట్ల కేటాయింపు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు తెచ్చిన జీవో 102 ఫలితమే ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ప్రస్తుతం రిజర్వేషన్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో 102 కారణమని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాలు, నిపుణుల కమిటీ సూచనలతో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం జీవో 151 రూపొందించారు. గత విద్యా సంవత్సరం వరకు అదే జీవో ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఉన్నఫళంగా జీవో 151 రద్దు చేసి, జీవో 102ను బాబు సర్కారు ప్రవేశపెట్టింది. జీవో 151 ప్రకారం అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఆప్షన్లు లాక్ చేసేవారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులు ఎంచుకునేవారు. వీటి ఆధారంగా అన్ని రౌండ్లలో సీట్ల కేటాయింపు జరిగేది. ఈ నేపథ్యంలో ఓసీ కటాఫ్ కంటే ఉత్తమ ర్యాంక్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓపెన్లోనే సీట్లు ఇచ్చేవారు. ఫలితంగా రిజర్వేషన్ సీట్లు కింది ర్యాంకర్లకు దక్కేవి. పారదర్శకమైన ఈ విధానానికి పాతరేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 102ను తీసుకొచ్చింది. తద్వారా విద్యార్థులు ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు ఆప్షన్లు నమోదు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని కాలేజీలు ఆప్షన్ల కింద ఎంపిక చేసుకోవాల్సిన పని లేదని తేల్చేసింది. ఇలా బాబు సర్కార్ తెచ్చిన మార్పులతో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. జీవో 102 రద్దు చేయాలి రిజర్వేషన్ విద్యార్థులు ఉత్తమ మెరిట్ సాధిస్తే వారికి ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు. ఇప్పటి వరకు సజావుగా, పారదర్శకంగా సాగిన సీట్ల కేటాయింపును జీవో 102తో గందరగోళం చేశారు. అసలు జీవో 151తో ఎవరికీ నష్టం లేదు. అయినా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదు. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం చేస్తున్న జీవో 102 రద్దు చేసి, 151ని పునరుద్ధరించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ జరిగిన తప్పును సరిదిద్దాలి సీట్ల కేటాయింపులో జరిగిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి. నిబంధల ప్రకారం మెరిట్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి. రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. ఈ ప్రభుత్వ గందరగోళ నిర్ణయాలతో ఇప్పటికే 70 మంది రిజర్వేషన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. – డాక్టర్ అంబటి రాధాకృష్ణ, విజయవాడ -
పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..! -
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
తెలంగాణ వారికే విద్యుత్ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో పరిధిలో జరిగే నియామకాల్లో తెలంగాణ వారికే అవకాశం కల్పించనున్నారు. ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వారు కూడా తెలంగాణావాసులై ఉండాలి. ఈ మేరకు ఏపీ విద్యుత్ బోర్డు నియామక మార్గదర్శకాలను సవరిస్తూ జెన్కో సీఎం ప్రభాకర్‌రావు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్‌ల భర్తీలో 60:40 నిష్పత్తిలో, సబ్ ఇంజనీర్ల నియామకాల్లో 70:30 నిష్పత్తిలో లోకల్, ఓపెన్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల ఆధారంగా రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని 4 జిల్లాలతో జోన్-1ను, దక్షిణ తెలంగాణలోని 6 జిల్లాలతో జోన్-2ను ఏర్పాటు చేశారు. ఆయా జోన్లలోని కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్థానిక అభ్యర్థులకు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తారు. -
మేయర్ కిరీటం ఎవరికో..
పింప్రి, న్యూస్‌లైన్: నిబంధనల ప్రకారం పుణే నగర మేయర్ పదవి రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి) మారడంతో పైరవీలు, సిఫార్సులకు తెరలేచింది. అన్ని కులాల కార్పొరేటర్లు ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పుణే కార్పొరేషన్లో ప్రస్తుత కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్సీపీ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఈ పార్టీ కార్పొరేటర్లంతా మేయర్ పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపిక ఎన్సీపీ కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం కార్పొరేషన్లో అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి చేతిలో ఉంది. వచ్చే నెల 15వ తేదీలోపు మేయర్ పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇవి జరుగుతుండడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. దీనికితోడు ఏ కులం/వర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఎన్సీపీ కార్పొరేటర్లు దిలీప్ బరోటే, దత్తా ధనకవడే, బాబూరావు చాండేరే, బాలా సాహెబ్ బోడకే, వికాస్ దాంగట్, విశాల్ తాంబే, చేతన్ తూపే, ప్రశాంత్ జగతాప్తోపాటు మరికొందరు అటు మేయర్ ఇటు ఎమ్మెల్యే టికెట్లకు పోటీపడుతున్నారు. మేయర్ పదవి దక్కనివారంతా అసెంబ్లీ అభ్యర్థిత్యానికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్సీపీ నాయకులు వేరే పార్టీల్లో చేరారు. ఈసారి కూడా ఇలాగే జరిగితే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. ఎన్సీపీ మరాఠా రిజర్వేషన్లకు అనుకూలమనే ముద్ర పడింది. దీంతో పలు కులాలు ఈ పార్టీపై కన్నెరజేస్తున్నాయి. ధన్‌గార్, వడార్ కులస్తులు తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ రోడ్లెక్కారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధిపతి పవార్ తాము కూడా ధన్గార్ల రిజర్వేషన్లకు అనుకూలమేనని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంకటస్థితిలో నగర మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించారు. సభాపక్ష నాయకుడు సుభాష్ జగతాప్ను మేయర్‌గా ఎన్నుకున్నా ఆశ్శర్యపడవలసిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తాము ఏ ఒక్క కులానికీ కొమ్ముకాయటం లేదని చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఎన్సీపీ భావిస్తోంది. అంతేగాక దళిత ఓటర్లను దగ్గర చేసుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్లో పార్టీల వారీగా బలాబలాలు ఎన్సీపీకి 56 మంది, కాంగ్రెస్-29, ఎమ్మెన్నెస్-28, బీజేపీ-26, శివసేన-15 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్సీపీ నుంచి మేయర్లుగా పనిచేసిన వారు రాజలక్ష్మీ భోసులే, మోహన్ సింగ్ రాజ్‌పాల్, వైశాలీ బన్కర్ ఉండగా, ప్రస్తుతం చంచలా కోడ్రే కొనసాగుతున్నారు. -
స్థానికేతర ఉద్యోగులు 1300 పైనే!
- ఇప్పటికే 350 మంది సీమాంధ్రుల గుర్తింపు - సింగరేణి అధికారుల్లో 90శాతం మంది వారే.. - పోలీస్, విద్య, యూనివర్సిటీలో సింహభాగం - వివరాలు సేకరిస్తున్న టీఎన్జీవోలు - బోగస్ సర్టిఫికెట్లపైనా నజర్ తెలంగాణ ఆవిర్భావ దినం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘లోకల్’ లొల్లి మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే జిల్లాలో పనిచేసే దిశగా సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ మేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోనూ వివిధ ప్రభుత్వ శాఖల్లో 1300కు పైగా మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ మేరకు సంబంధిత ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యాయి. సాక్షి, కరీంనగర్ : ఈ నెల 24న కరీంనగర్ వచ్చిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్.. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్‌రూమ్, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగో తరగతి నుం చి పదో తరగతి వరకు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన సీమాంధ్రులకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. వారికి మాత్రమే స్థానికేతర సమస్య నుంచి మినహాయింపు ఉంది. వివరాల సేకరణలో నిమగ్నం జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడంలో టీఎన్జీవోలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. జిల్లాలో 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీటిలో ఉన్న త, ప్రాథమిక విద్య, పోలీసుశాఖలు మినహాయించి ఇప్పటివరకు 27 శాఖల నుంచి సమాచారం సేకరిం చారు. 350 మంది సీమాంధ్రులు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఇంకా 45 శాఖల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని వదలకుండా అందరి సమాచారం సేకరించాలని టీ ఎన్జీవో జిల్లాశాఖ అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సూచించింది. ఆ మూడు శాఖల్లో ఎక్కువ పోలీస్, విద్య, యూనివర్సిటీ లో సింహభాగం మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 14,400 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో నాలుగు వందలకు పైగా సీమాంధ్రులున్నారు. డీఎస్సీల్లో 80 శాతం రిజర్వేషన్, 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. 1994 డీఎస్సీ నుంచి 2000 డీఎస్సీ వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 70 శాతం రిజర్వేషన్, 30 శాతం ఓపెన్ కేటగిరీల్లో ఉద్యోగాలి చ్చారు. దీంతో అదనపు కోటా కింద జిల్లాలో 130 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొందారు. వీరందరు గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే ఉన్నారు. 2000 మేలో టీడీపీ అధినేత చంద్రబాబు సచివాలయ బదిలీలకు తెరలేపారు. అక్రమ బదిలీలతో 40 మంది కి పైగా ఉపాధ్యాయులు జిల్లాలో వివిధ పాఠశాలల్లో తిష్టవేశారు. వీరితోపాటు ఓపెన్ కేటగిరీ లో ఉద్యోగాలు సాధించిన వారందరూ జిల్లా నుంచి వెళ్లిపోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 31 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోలీసు, యూనివర్సిటీలో వందలాది మంది సీమాంధ్రులున్నారు. వీరందరి వివరాలు సేకరిస్తే.. వందలాది పోస్టులు ఖాళీ అవుతాయని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సంస్థలో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోంది. క్లరికల్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత స్థానాల్లో 90 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారు. ఆదినుంచి తెలంగాణ వాసులు కింది స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. జిల్లాలో ఈ ఒక్క సంస్థలోనే సుమారు 320 మంది స్థానికేతరులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆర్టీసీలోనూ సీమాంధ్రు ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నాలుగో రోజుల్లో పూర్తి సమాచారం - ఎంఏ.హమీద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జిల్లాలోని సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాం. నాలుగు రోజుల్లో స్థానికేతర ఉద్యోగుల గుర్తిం పు పూర్తవుతుంది. ఇప్పటివరకు 350 మందిని గుర్తిం చాం. జిల్లాలో మొత్తం 1300 మందికి పైగా ఉంటార ని ప్రాథమిక సమాచారం. సింగరేణి, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలు కావడం, ప్రత్యేక పాలసీలు ఉండటంతో ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరముంది. -
చెరకు రైతులకు నిరాశే..
చోడవరం, న్యూస్‌లైన్: సీఎం పర్యటనపై కొండంత ఆశ పెట్టుకున్న చెరకు రైతుకు నిరాశే మిగిలింది. సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రాజు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు తమ ప్రసంగాల్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, రైతుల ప్రోత్సాహకం గురించే ఎక్కువగా మాట్లాడారు. చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ కో-జనరేషన్ నుంచి వచ్చే విద్యుత్ అమ్మకంలో తక్కువ ఆదాయం వస్తోందని ప్రైవేటు సంస్థకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. గతేడాది రోలుగుంట సమావేశంలో వారం రోజుల్లో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు ముందు ఇక్కడికి రావడంతో ఏదో ప్రకటిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. అయినా సీఎం మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా చెరకు రైతుల గురించి ప్రస్తావించలేదు. జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీల పరిధిలో 50వేల మంది సభ్యరైతులకు సంబంధించిన సమస్యను కనీసం పట్టించుకోకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాకు వరాల జల్లు చోడవరం రచ్చబండ కార్యక్రమంలో సీఎం13,500 లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. పాయకరావుపేటలో ఎస్సీ హాస్టల్ రూ.80లక్షలతో, అరుకులోయలో గిరిజన ఆశ్రమ పాఠశాల, ఉద్యోగుల క్వార్టర్లను రూ.4.25కోట్లు, వేచలం-ఖండివరం వంతెన రూ.5 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాల సముదాయాన్ని ఆవిష్కరించారు. జిల్లాకు రూ.262 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. విమ్స్ అభివృద్ధికి రూ.135 కోట్లు, శారద, వరహా, పెద్దేరు, తాండవ నదీ గట్లు పటిష్టానికి, శాశ్వత పరిష్కారానికి రూ.114కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. చోడవరంలో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి రూ.50లక్షలు, పట్టణంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.కోటి ఇస్తున్నామన్నారు. చోడవరం సీహెచ్‌సీ 30పడకల ఆస్పత్రిని 50పడకల స్థాయికి పెంచుతున్నామన్నారు. సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు , చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజులు,మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీలు పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ చెరకు రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, కన్నబాబురాజు, ముత్యాలపాప, చింతలపూడి వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


