breaking news
ongole dharna
-
పోలీసులూ... డేంజర్లో పడతారు
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం మాటలు విని కొందరు పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే ప్రమాదంలో పడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తమ ఆస్తిపాస్తుల కోసమో స్వప్రయోజనాల కోసమో ధర్నాలు చేయడం లేదని, ప్రజల ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు విమర్శించారు. టీడీపీ జన చైతన్య యాత్రలకు, మంత్రులు బయట తిరగడానికి పోలీసుల రక్షణ కావాలని, పోలీసులను వాళ్ల డ్యూటీలను చేయడనివ్వడంలేదని మండిపడ్డారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ చూడటం, దొంగలను పట్టుకోవడం, రౌడీయిజం చేసేవారి ఆట కట్టించడం వంటివి చేయాల్సి ఉంటే.. ప్రభుత్వం మాత్రం వారి చేత నీరు-మట్టి, జన చైతన్య యాత్రలు, పుష్కరాలు, మంత్రుల వెనకే తిప్పించుకోవడం వంటివి చేయిస్తోందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడు చేసిన 2500 రూపాయలు అప్పు తీర్చడం ఆలస్యమైందని పోలీసు స్టేషన్లో పెట్టి, ఎస్సై ఒకరు ఆయనకు వాతలు పడేలా కొట్టారని, ఈ కేసు గురించి తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు 20 సార్లు వెళ్లినా కలవలేకపోయానని, శ్రీకాకుళం ఎస్పీని కలిసేందుకు ఐదుసార్లు ప్రయత్నించినా కలవడం కుదరలేదని తెలిపారు. ఇది పోలీసుల తప్పు కాదని, టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానమనే కారణమని దుయ్యబట్టారు. -
ఒంగోలు ధర్నాలో వైఎస్ జగన్
-
బుద్ధి వచ్చేవరకు గడ్డి పెడుతూనే ఉంటాం
-
బుద్ధి వచ్చేవరకు గడ్డి పెడుతూనే ఉంటాం
పేదలు అప్పుల పాలు కాకుండా కాపాడే అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించి, దాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటామని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలు తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి పేదవాడు గళం విప్పుతున్నాడు ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం, పేదలకు ఇళ్లు కట్టించే పథకాలు.. ప్రతి సంక్షేమ పథకం మన రాష్ట్రంలో కనపడట్లేదు. ఒకసారి ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి పాలన చూద్దాం. పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రెండు కారణాల వల్లే వస్తుందని, వాటిలో ఒకటి అనారోగ్యం.. మరొకటి పిల్లల చదువని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు ఆయన కంటే ముందు పాలించిన కొంతమంది నాయకులు పేదల మీద, బీసీల మీద ప్రేమ చాలా ఉందని చెప్పుకొనేవారు. ఇస్త్రీపెట్టెలు ఇస్తే, క్షవరం చేసుకోడానికి కత్తెరలు ఇస్తే సరిపోతుందని వాళ్లు అనుకునేవారు పేదల జీవితం బాగుపడాలంటే, ఆ పేదల కుటుంబం నుంచి అప్పులపాలు కాకుండా ఇంజనీరింగ్, వైద్యవిద్య చదివిస్తేనే పేదరికం నుంచి బయటపడుతుందని ఆలోచించి, రాష్ట్రంలో సువర్ణయుగాన్ని తీసుకొచ్చారు రాజశేఖరరెడ్డి ఈవాళ ఆ నాయకుడు మన మధ్య లేరు. ఆయన ప్రవేశపెట్టిందే ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు కుతంత్రాలు పన్నుతున్నారు పేదలు చదువుకుంటున్నా, వైద్యం చేయించుకుంటున్నా కనిపించేది రాజశేఖరరెడ్డి ఫొటో కాబట్టి ఆ రెండు పథకాలకు తూట్లు పొడుస్తున్నారు నాన్నగారి పాలనలో ఏ పేదవాడికైనా బాగోకపోతే 108కు ఫోన్ చేస్తే చాలు.. కుయ్ కుయ్ కుయ్ అంటూ అంబులెన్సు వచ్చి వాళ్లను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించి, ఉచితంగా పేదలకు ఆపరేషన్ చేయించి, చార్జీలకు కూడా డబ్బులు.. మందులు ఇచ్చి పంపేవారు ఇప్పుడు 108కు ఫోన్ కొడితే.. అంబులెన్సు ఎప్పుడొస్తుందో కూడా తెలియడంలేదు నిన్న ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ ఐటీడీఏ పరిధిలో పది అంబులెన్సులున్నాయి. కానీ వాటిలో ఏడు పడుకున్నాయని, మూడే పనిచేస్తున్నాయని చెప్పారు ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పథకాన్ని నరికేస్తున్నారు ముందుగా ఆరోగ్యమిత్రలు రోగుల వద్దకు వచ్చి, వాళ్లను ఆస్పత్రిలో ఎలా చేరాలో అన్నీ దారి చూపించి మేలుచేసేవారు చంద్రబాబు సీఎం కాగానే ఆరోగ్యమిత్రలను పూర్తిగా ఉద్యోగాల నుంచి తీసేశారు. ఎన్నికలు రావడానికి ముందు జాబు రావాలంటే బాబు సీఎం కావాలనేవారు కానీ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులను ఊడబెరుకుతూ పోతున్నారు ఆరోగ్యమిత్రలను ఊస్టింగ్ చేసేశాడు.. ఆరోగ్యశ్రీ నడిపించే నెట్వర్క్ ఆస్పత్రులకు 6-8 నెలల పాటు బిల్లులు ఇవ్వకుండా పథకాన్ని ఖూనీ చేస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా రోగులకు ఎలా న్యాయం చేస్తారన్న కనీస ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయాయి ఆరోగ్యశ్రీ పథకం ఎంత దారుణంగా తయారైందంటే.. కాసేపటి క్రితమే పాపారావు బాధలు విన్నాం కిడ్నీలు బాగోని పేషెంటు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే వారానికి ఆరువేలు, నెలకు 24వేలు, ఏడాదికి 3.12 లక్షలు ఖర్చవుతుంది కేన్సర్ పేషెంట్ల పరిస్థితి ఇంకా దారుణం. దాన్ని నయం చేయాలంటే కీమోథెరపీ చేయాలి. ఒక్కోసారి ఒక్కో పేషెంటుకు 8-10 సార్లు కీమో ఇవ్వాలి. ఒక్కోసారికి కనీసం లక్ష రూపాయలు ఖర్చవుతుంది కానీ చంద్రబాబు మొత్తం రెండు లక్షలే ఇస్తామంటున్నారు దానివల్ల కేన్సర్ రోగులకు ఒకటో రెండో కీమో థెరపీ ఇచ్చి వదిలేయడంతో పేషెంట్లు చనిపోతున్నారు అయినా చంద్రబాబు పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీకి 910 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఖర్చవుతుందని ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇస్తే.. కేవలం 565 కోట్ల రూపాయలే కేటాయించారు అందులోనూ 395 కోట్లు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లతో ధర్నా చేస్తామని బెదిరిస్తే మరో 262 కోట్లు ఇచ్చారు. ఈ రెండూ కలిపినా డబ్బులు సరిపోవడం లేదు అవసరమైతే మరో రెండు మూడువేల కోట్లు ఇచ్చయినా పేదల ఆరోగ్యం కాపాడాల్సింది పోయి వాళ్లను గాలికి వదిలేస్తున్నారు చాలామంది డాక్టర్లు, పేషెంట్లతో మాట్లాడాను ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ హయాంలో ఫిక్స్ చేసిన రేట్లే ఇప్పుడు కూడా ఇస్తే వైద్యం ఎలా చేయాలని వైద్యులు అడుగుతున్నారు ఉద్యోగుల జీతాలు, కరెంటు చార్జీలు, మందుల ఖర్చులు అన్నీ పెరిగినా ఉన్నరేట్లు పెంచకపోగా ఇంకా తగ్గిస్తే ఎలాగని ఆస్పత్రుల వాళ్లు వాపోతున్నారు 133 రోగాలను తమ పరిధిలోంచి తీసేసి ప్రభుత్వాస్పత్రులకు పరిమితం చేశారని.. కానీ అక్కడ తగిన సదుపాయాలు, స్పెషాలిటీ డాక్టర్లు ఉండట్లేదని అంటున్నారు వాటిలో జనరల్ సర్జరీలో అపెండిసైటిస్, థైరాయిడ్, గైనిక్ ప్రొసీజర్లు, ఈఎన్టీ, ఆఫ్తల్మాలజీ లాంటివి కూడా ఉన్నాయి ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలుచేశాం ఆరోగ్యశ్రీ పథకం.. కొన్ని లక్షల మందికి మేలుచేసే కార్యక్రమం మొన్నటి దాకా చంద్రబాబు సీఎం కానంతవరకు రోజుకు 2వేల మంది ఆరోగ్యశ్రీ దరఖాస్తు చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1200 కూడా లేదు. చంద్రబాబును గట్టిగా మందలిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇళ్లు కట్టించే పథకాలలో ఏవి చేయకపోయినా చంద్రబాబు మెడలు వంచి చేయిస్తాం ఆరోగ్యశ్రీ పథకం కోసం గట్టిగా ఉద్యమిస్తాం, చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటాం మీ తరఫున అన్ని రకాలుగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది చంద్రబాబు మనసు మారకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం నేను స్వయంగా కలెక్టర్‌కు అర్జీ ఇవ్వాలని అనుకున్నా. మనం వస్తున్నామని చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారేమో, కలెక్టర్ వెళ్లిపోయారట. చంద్రబాబుకు బుద్ధి ఉండాలి, ఆ వెళ్లిపోయిన కలెక్టర్‌కు బుద్ధి ఉండాలి ఈ పోరాటం కొనసాగుతుంది, చంద్రబాబు వైఖరిలో మార్పు రాకపోతే మరింత తీవ్రంగా పోరాడుతామని అల్టిమేటం ఇస్తున్నాం.