breaking news
one person died
-
షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. శరవేగంతో వచ్చిన బస్సు ఆగి ఉన్న పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. నగరంలోని రోహిణి సౌత్ ఏరియాలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మితిమీరిన వేగంగో వచ్చిన డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు మొదట కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పేవ్మెంట్ దగ్గర పార్క్ చేసిన ఈ-రిక్షా, ద్విచక్ర వాహనాలపైకి దూసు కెళ్లింది. దీంతో అక్కడున్న వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు ప్రమాదానికి దారి తీసిన విషయంపై డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతివేగంతోనే బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. #WATCH | One person died after being hit by a DTC bus in Delhi's Rohini area. Further investigation is underway: Delhi Police (CCTV visuals confirmed by police) pic.twitter.com/Bt1ipo9GYr — ANI (@ANI) November 4, 2023 -
నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలలో జరగుతున్న జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఎద్దు ఒకటి జనంలోకి వచ్చి కుమ్మడంతో కుప్పంలోని చందం ఎస్ సీ కాలనీకి చెందిన గుణశేఖర్(22) మృతిచెందారు. గుణశేఖర్ జల్లికట్టు వీక్షించడానికి చందం ఎస్సీకాలనీ నుంచి నన్యాల వచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పోలవరం : యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... ముమ్మిడివరం మండలం చిప్పలపాలేనికి చెందిన సరిపెల్ల సత్యనారాయణరాజు(65) యానాం నుంచి ముమ్మిడివరం వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పాత ఇంజరం వీఆర్ ఓ రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై పాండుదొర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించార