breaking news
One dayseries
-
విజయం వేటలో...
పుణే: ఏకపక్షంగా సాగుతుందనుకున్న వన్డే సిరీస్‌ను విశాఖపట్నంలో అనూహ్య పోరాటంతో ఆసక్తికరంగా మార్చింది వెస్టిండీస్. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేసి... రెండో వన్డేలో ఛేదనలో ప్రత్యర్థి స్కోరును సమం చేసి తమను తక్కువగా చూడొద్దని చాటింది. బ్యాట్స్‌మెన్ పట్టుదలతో పోటీలో నిలిచింది. మరోవైపు భారత్ తప్పనిసరిగా శక్తులను కూడదీసుకునేలా చేసింది. బౌలర్లకు కఠిన పరిస్థితులు ఎదురవుతుండటంతో టీమిండియా సైతం అప్రమత్తమైంది. భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాలతో మరింత కట్టుదిట్టంగా బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఇక్కడ జరిగే మూడో వన్డేలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఇక్కడ ఈ ఇద్దరు... పెద్దగా పేరు లేకున్నా... మంచి హిట్టర్లున్న విండీస్‌ను కట్టడి చేయడం ఎంత కష్టమో రెండు వన్డేల్లోనూ భారత్‌కు తెలిసొచ్చింది. ప్రత్యర్థి 600పైగా పరుగులు చేయడంతో బౌలింగ్ కూర్పును మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిణామాలతో జట్టులోకి వచ్చిన భువీ, బుమ్రా పుణెలో బరిలో దిగనున్నారు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి, అంబటి రాయుడి గురించి ఆలోచన లేకున్నా భారత్ మిడిలార్డర్ సమస్య ఎంతకూ తెగని కథలాగే ఉంది. ఇక రాత్రి వేళ మంచు ప్రభావంతో స్పిన్నర్లకు ఇబ్బంది ఎదురవుతోంది. కాబట్టి టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడమే మేలు. పర్యాటక జట్టు ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ఆడబోతోం దంటే అది యువ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్, షై హోప్ చలవే. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలవలేకపోవడం జట్టు బలహీనతను చాటుతోంది. బౌలింగ్ కూడా అంతకుతగ్గట్లే ఉంది. రెండో వన్డే ఫలితంతో కరీబియన్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ బలమేంటో చాటారు. కాబట్టి... విండీస్ బలహీనతలపై దెబ్బకొడితేనే భారత్ గెలుపును ఆశించగలం. మధ్యాహ్నం గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా?
చెన్నై: ఆస్ట్రేలియన్లు గెలుపు కోసం ఏమైనా చేస్తారు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలోనే ఓటమిని మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. ఎక్కడైనా మాకు మేము సాటి అన్నచందంగా వ్యవరిస్తారు. తాజాగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కు ఎదురైన ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ తేలిగ్గా తీసుకోలేకపోయారు. అలాగని ఆసీస్ క్రికెటర్ల పేలవ ప్రదర్శనను ఏమీ అనకపోగా, భారత్ గెలుపుకు వర్షమే కారణమంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. 'నా వరకూ అయితే టీమిండియా గెలుపుకు వర్షం సహకరించింది. వారు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో. అయినా ఫర్వాలేదు. ఇక రెండో గేమ్ తో ఆసీస్ విజయాల బాట పట్టాలి' అంటూ టీమిండియా విజయాన్ని తక్కువ చేశారు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. నీకేమైనా బ్రెయినక్ ఫేడ్ అయ్యిందా?, గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆసీస్ క్రికెటర్లు తొండాటను ఆ దేశ మాజీలు సమర్దించారు. అప్పుడు ఆసీస్ క్రికెటర్లకి బ్రెయిన్ ఫేడ్ అయ్యింది. ఇప్పుడు మరో ఆస్ట్రేలియన్ ఆ జాబితాలో చేరిపోయాడు' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, వర్షం అనేది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. నువ్వు కొంత క్రికెట్ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోలేక పోతే చాలా కష్టం 'అని మరొక అభిమాని చమత్కరించారు. 'నువ్వు కనుక ఫుట్ బాల్ ఆడినట్లయితే చాలా గొప్ప డిఫెండర్ కావడం ఖాయం' అని మరొక వ్యక్తి విమర్శించారు.