breaking news
Olympics badminton
-
ఫైనల్లో లక్ష్య సేన్
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య సేన్ 14–21, 21–15, 24–22తో కొడాయ్ నరయోకా (జపాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో లీ షిఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్ ఆడతాడు. హెచ్ఎస్ ప్రణయ్ (2010లో) తర్వాత యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. మరోవైపు ఫైవ్–ఎ–సైడ్ హాకీ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పురుషుల జట్టు 5–2తో కెనడాను... మహిళల జట్టు 5–2తో దక్షిణాఫ్రికాను ఓడించాయి. మహిళల టీటీ సింగిల్స్ కాంస్య పతక పోరులో అర్చన 1–4తో ఆండ్రియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
సింధు మరో నెల తర్వాత...
హైదరాబాద్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పీవీ సింధు మరో నెల రోజుల తర్వాత తొలి టోర్నీ ఆడనుంది. అక్టోబరు 18 నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్‌లో ఆడుతుంది. ఈ లోగా జరిగే రెండు పెద్ద టోర్నీలు జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్‌లో ఆడటం లేదు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. సూపర్ సిరీస్ టోర్నీలలో తనకు ఇదే ఉత్తమ ప్రదర్శన.