breaking news
Oil refining center
-
ఎనర్జీపై 170 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంధనాలకు డిమాండ్ పెరుగుతుండటం, స్వచ్ఛ ఇంధనాలవైపు భారత్ వేగంగా మళ్లుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎనర్జీ రంగంపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. సౌర విద్యుత్, ఆయిల్ రిఫైనింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుడటంతో పెట్టుబడులు 2026లో 170 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఎనర్జీ రంగంపై పెట్టుబడులు గత ఐదేళ్లుగా ఏటా 11 శాతం వృద్ధి చెందుతుండగా, వార్షికంగా సోలార్ ఫొటోవోల్టెయిక్ (పీవీ) ఏటా 25 శాతం, ఆయిల్ రిఫైనింగ్‌లో 23 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎనర్జీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లో ఈ రెండు రంగాల వాటా దాదాపు పావు శాతం ఉన్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడుల దన్నుతో 2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలు 15 శాతం మేర పెరగనున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. బొగ్గు సరఫరాకు సంబంధించి గత దశాబ్దకాలంలో భారత్ పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఇటు విద్యుదుత్పత్తికి, అటు పారిశ్రామిక అవసరాలకి బొగ్గుకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 1 బిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తిని 2030 నాటికి 1.5 బిలియన్ టన్నులకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో 2026లో బొగ్గు సరఫరాపై పెట్టుబడులు 13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. → పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రిడ్ ఆధునీకరణ, బ్యాటరీ స్టోరేజ్పైనా భారత్ మరింతగా ఇన్వెస్ట్ చేస్తోంది. దేశీయంగా స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన పెట్టుబడుల్లో ప్రస్తుతం సౌర, పవన విద్యుత్ వాటా సగానికి పైగా ఉంటోంది. దీనితో విద్యుత్ పంపిణీ, స్టోరేజ్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం పెరుగుతోంది. → 2020 నుంచి జల విద్యుత్, అణు విద్యుత్‌పై పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 9 గిగావాట్లుగా ఉన్న అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా 49 శాతం వరకు విదేశీ ఓనర్‌షిప్‌తో రియాక్టర్ల నిర్మాణానికి ప్రైవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ 2205లో సంస్కరణలను ప్రవేశపెట్టింది. → ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్‌పై 2026లో పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గత ఐళ్లుగా ఇవి వార్షికంగా 15 శాతం మేర పెరుగుతున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌ను, జాతీయ..రా్రïÙ్టయ గ్రిడ్లకు అనుసంధానించేందుకు ఉద్దేశించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రోగ్రాంతో 3,000 కి.మీ. పైగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటయ్యాయి. తదుపరి దశల పనులు కొనసాగుతున్నాయి. -
టెక్సాస్ లో మంటల వెనుక మిస్టరీ అమెరికాలో హై అలర్ట్
-
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
చమురు శుద్ధి కేంద్రంలో ఘోరం
మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని ఓ చమురు శుద్ధి కేంద్రంలో బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేస్తున్న ఐదుగురు కార్మికులు ఊపిరాడకపోవడంతో దుర్మరణం పాలయ్యారు. మండ్య తాలూకాలోని తూబినకెరె పారిశ్రామిక వాడలో గురువారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతులను బీహార్‌కు చెందిన గామ(37), బబ్లూ(26), శ్రీరామ(25), చేతు(24), రాజు(27)లుగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన సంపత్, అరుణ్ ఇక్కడ సంపత్ రిఫైనరీ పేరిట చమురు శుద్ధి కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో 15 మంది కార్మికులున్నారు. గురువారం ఉదయం 25 అడుగుల ఎత్తై బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేయడానికి బబ్లూ అందులోకి దిగాడు. కొద్ది సేపటికే అతను కింద పడి కొట్టుకోవడాన్ని గమనించిన మరో కార్మికుడు బబ్లూను రక్షించేందుకు అందులోకి దిగాడు. అలా ఒకరి వెనుక ఒకరు మొత్తం ఐదుగురు బాయిలర్‌లోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో వారు ఊపిరాడక మరణించారు.


