breaking news
oil leakage
-
ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటెయినర్లు
కొల్లం: కేరళ తీరానికి సమీపంలో మునిగిన లైబీరియా ఓడ నుంచి చమురు లీకేజీ కొనసాగుతోంది. ఓడలోని కంటెయినర్లు ఒడ్డుకు కొడ్డుకు వస్తున్నాయి. కొల్లం, అలప్పుఝలోని తీరం సమీపానికి తొమ్మిది కంటెయినర్లు అలల తాకిడితో కొట్టుకు వచ్చాయని సోమవారం అధికారులు తెలిపారు. ఆయిల్ లీకవుతున్నందున తీర ప్రాంత జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. అధికారులతో సమావేశమైన సీఎం విజయన్ అక్కడి పరిస్థితులపై సమీక్ష జరిపారు. అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెచ్చరించింది. ఆదివారం వేకువజామున సముద్రంలో మునిగిన ఈ ఓడలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు భారత తీర రక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. కొన్ని కంటెయినర్లలో ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ ఉందన్న వార్తలు అధికారులను కలవర పెడుతున్నాయి. ఇది లీకై సముద్ర జలాలతో కలిస్తే మండే స్వభావమున్న ఎసిటలీన్ వాయువుగా మారుతుందని చెబుతున్నారు. ‘ఓడ నుంచి చమురు లీకవుతోంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ సముద్ర పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం మధ్యలో 9 కంటెయినర్లు ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు కంటెయినర్లు శక్తికులంగర హార్బర్ సమీపంలో, మూడు చావర సమీపంలో, ఒకటి చరియాజికల్ వద్ద, మరోటి త్రిక్కున్నపుఝ వద్ద కనిపించాయి. ఆయిల్ లీకేజీని అరికట్టేందుకు ఐసీజీ ప్రయత్నాలు చేపట్టింది. చమురు తెట్టు ఏర్పడకుండా డార్నియర్ విమానం సాయంతో రసాయనాలను వెదజల్లుతున్నారని సీఎంవో వివరించింది. ఈ ఘటన టయర్–2 కేటగిరీకి చెందినది కావడంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో వనరులు, సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఐసీజీ డైరెక్టర్ జనరల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎంవో పేర్కొంది. మునిగిన ఓడలోని మరికొన్ని కంటెయినర్లు అలప్పుజ, కొల్లం, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల దిశగా కొట్టుకు వచ్చే అవకాశముందని తెలిపింది. ఒడ్డుకు చేరిన, సముద్ర జలాల్లో కనిపించే కంటెయినర్లు, ఇతర అసాధారణ వస్తువులను తాకవద్దని, వాటి సమీపంలో గుమికూడవద్దని ప్రజలను, మత్స్యకారులను హెచ్చరించింది. -
ఆర్టీపీపీలో విద్యుత్‌కు అంతరాయం
వైఎస్సార్ జిల్లా: ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. ఆర్టీపీపీలోని మూడవ యూనిట్లో ఆయిల్ లీకేజీ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 215 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. -
డీజిల్ కోసం బిందెలు, బకెట్లతో పరుగులు..
జి.కొండూరు: ఆదివారం మద్యాహ్నం.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం.. బిందెలు, బకెట్లు, కుండలు.. ఇలా ఏదిదొరికితే దాన్ని తీసుకుని జనం పరుగులు పెట్టారు. ఎండాకాలం కదా అగ్నిప్రమాదమేదైనా సంభవించిదా.. మంటలు ఆర్పేందుకే వీళ్లు వెళుతున్నారా? అని చూసేవాళ్లు సందేహపడ్డారు. అసలు విషయమేమంటే.. కట్టుబడిపాలెం గ్రామంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన పైపులైన్లు లీకై వాటినుంచి డీజిల్ అంతెత్తున ఎగిసిపడింది. అసలే డీజిల్ రేట్లు మండిపోతున్న తరుణంలో దానిని తెచ్చుకునేందుకు జనం ఇలా పరుగులు పెట్టారు. హెపీసీఎల్ కంపెనీ స్టోరేజీ ట్యాంకర్ల సమీపంలో పైపులైన్ నుంచి భూమిపైకి డీజిల్ చొచ్చుకొచ్చి సమీప డ్రైనీజీలో కలిసినట్టు గుర్తించిన కొందరు తమవారికి సమాచారం ఇవ్వడంతో ఈ పరుగుల ప్రహాసనం మొదలైంది. చివరికి అధికారులు చేరుకుని మరమ్మతులు చేసి ఆయిల్ లీకేజీని నియంత్రించారు. పైపులైన్ అడుగు భాగంలో దెబ్బతినడం వల్లే లీకేజీ చోటు చేసుకుందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గతంలో రెండు సార్లు లీకేజీలు చోటు చేసుకున్నాయి. -
మరో జర్మన్వింగ్స్ విమానానికి తప్పిన ముప్పు
కోపైలట్ దుశ్చర్యతో ఆల్ఫ్స్ పర్వతాల్లో విమానం కుప్పకూలి 150 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మన్వింగ్స్ సంస్థకు చెందిన మరో విమానానికి భారీ ముప్పు తప్పింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొలోన్ నుంచి వెనిస్కు టేకాఫ్ అయిన ఎయిర్‌బస్ ఏ 319 విమానంలో ఆయిల్ లీక్ అవుతోందని పైలట్ భావించాడు. దీంతో విమానాన్ని దారి మళ్లించి నైరుతి జర్మనీలోని స్టట్గర్ట్ ఎయిర్ పోర్టులో దింపేశారు. ఆ సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టెక్నికల్ ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆయిల్ లీక్ కావడంలేదని తేల్చిచెప్పినప్పటికీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారిని వేరొక విమానంలో వెనిస్కు తరలించినట్లు జర్మన్వింగ్స్ ప్రతినిధులు ప్రకటించారు. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో జర్మన్వింగ్స్ ఫ్లయిట్లో ఆయిల్ లీకేజీ వార్త అటు అధికారులతోపాటు ఇటు ప్రయాణికుల కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేసింది.