breaking news
Odissi dancer
-
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
ఒడిస్సీ నృత్యంతో అవగాహన
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలన్నీ ఈ కరోనా సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలన్నీ ఒడిస్సీ నృత్యముద్రల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది మహిన ఖనుమ్. ఫ్రెంచ్ మహిళ అయిన మహిన 13 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకుంది. భారతీయ నృత్యసంస్కృతిని ప్రోత్సహించే లిజ్ ఆర్ట్స్ మీడియాసంస్థకు మహిన డైరెక్టర్. స్టే హోమ్ పేరుతో మహిన చేస్తున్న శాస్త్రీయ నృత్య వీడియోలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కొన్నాళ్లుగా లాక్డౌన్ టైమ్‌ను కళాకారులు తమ కళను మెరుగు పరుచుకోవడానికి, కొత్త కొత్త ప్రక్రియలు కనిపెట్టడానికి వాడుకుంటున్నారు. తాము చేసిన సృజనాత్మక పనులను నలుగురికీ పంచడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా ఎంచుకుని అన్ని వయసుల వారు తమ అభిరుచులను వ్యక్తపరుస్తున్నారు. ఇదేకోవలో ఫ్రాన్స్‌లో నివసిస్తున్న ఒడిస్సీ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్ మహినా ఖనుమ్ కోవిడ్–19కి సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్యభంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. నృత్యం ఒక అందమైన భాష ‘నృత్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం, మహిళా సాధికారత వంటి తీవ్రమైన సమస్యలను కూడా సులభంగా వివరించవచ్చు. నృత్యం ఒక అందమైన భాష, దీనిలో ప్రదర్శించే భంగిమలే అందుకు ఉదాహరణ. కరోనా యుగంలో ఇ–కరెన్సీ గురించి ప్రజలకు తెలిసేలా చేసిన వీడియో నాకు బాగా నచ్చింది’ అని వివరించిన మహిన తన నృత్యశైలితో ప్రపంచ సమస్యలను చూపాలనే తపనను వెలిబుచ్చింది. కరెన్సీ నృత్యం మహిన భర్త అవిషాయ్ డిజిటల్ ఆర్టిస్ట్ కావడంతో ఈ ఆలోచన రావడానికి, ఓ కొత్తదనాన్ని కనుక్కోవడానికి కారణమైందని చెబుతుంది మహిన. ‘లాక్‌డౌన్‌కు ముందు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు డ్యాన్స్ ఒక మార్గంగా ఉంటుందని అనుకోలేదు. గత మార్చిలో లాక్డౌన్ ప్రకటించాక, ఇంట్లోనే ఉన్నప్పుడు నాట్యాన్ని ఎలా కొనసాగించాలా అని ఆలోచించాను. అదే సమయంలో, కోవిడ్ –19 గురించి ప్రజలకు తెలిసేలా కరెన్సీకి సంబంధించిన నృత్య ప్రక్రియను వీడియో చేశాను. ఈ డ్యాన్స్ వీడియో కోసం సరైన ప్లేస్, కెమెరా యాంగిల్ కోసం కూడా చూడలేదు. నృత్యం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని భావించి, సక్సెస్ అయ్యాను. ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజయ్ తంబే స్వరపరిచారు’ అని ఆనందంగా వివరించింది మహిన. జీవితానికి కొత్త దశ మహిన తల్లి ఫ్రెంచ్, తండ్రి స్పానిష్. చిన్నప్పటి నుంచీ నృత్యంపై అమిత ఇష్టంతో మూడేళ్ల వయసులో బ్యాలే నేర్చుకుంది మహిన. 13 ఏళ్ల వయస్సులో ఒడిస్సీ కళాకారిణి షకర్ బెహెరాను కలిసింది. షకర్ తన జీవితానికి ఓ కొత్త దిశను ఇచ్చిందని చెబుతుంది మహిన. ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకున్న తరువాత ఢిల్లీలోని మాధవి ముద్గల్ నుండి నృత్యం నేర్చుకునే అవకాశం పొందింది. భారతీయ నృత్యకళను ఔపోసన పట్టాక పారిస్‌కు వెళ్లి అక్కడ 12 ఏళ్లుగా నివసిస్తోంది. సులభమైన మార్గం భర్త అవిషాయ్తో కలిసి మహిన ఫ్రాన్స్‌లో కంప్యూటర్ యానిమేటెడ్, ఓల్డ్ పెయింటింగ్, ఒడిస్సీ డ్యాన్స్, వర్చువల్ రియాలిటీతో ఒడిస్సీ డ్యాన్స్, లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ’ వంటి ప్రాజెక్టులలో పనిచేసింది. ‘కరోనా ప్రభావాలను నివారించడానికి, ఇంట్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎన్నో సమస్యలు కనిపించాయి. అటువంటి పరిస్థితిలో ఒడిస్సీ నృత్యం కష్టాలన్నిటినీ అధిగమించడానికి ఓ సులభమైన మార్గంలా’ కనిపించింది. ఈ నృత్యం ద్వారానే ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా నా నృత్యానికి వేదిక అయ్యింది’ అని కరోనా మహమ్మారి సమయంలో ఒడిస్సీ నృత్యం ప్రాముఖ్యత గురించి మహిన ఎంతగానో చెబుతోంది. -
సుందరకాండ
అవర్ సేక్రెడ్ స్పేస్ నిర్వాహకురాలు, ఒడిస్సీ కళాకారిణి నయనతార వినూత్న నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వయంగా డిజైన్ చేసుకున్న నృత్యంతో ఆమె హనుమాన్ చాలీసాను ప్రదర్శించి ఆహుతులను అలరించారు. ప్రముఖ యోగా గురువు గజాననం ఆధ్వర్యంలో యోగా శిక్షణ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ జరిగింది. నాన్ వయోలెన్స్ కమ్యూనికేషన్లో షమ్మీ,నంద వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ఓ మధు -
పద్మశ్రీ ఇలియానాపై పోలీసు కేసు
ఒడిసాలో తాను నడుపుతున్న డాన్సు స్కూలులో ఓ విద్యార్థితో దురుసుగా ప్రవర్తించినందుకు ఇలియానాపై పోలీసు కేసు నమోదైంది. ఇటలీలో పుట్టి, ఒడిసీ నృత్యం నేర్చుకుని.. అదే అంశంలో పద్మశ్రీ అవార్డు కూడా స్వీకరించిన ఇలియానా సిటారిస్టి బిందుసాగర్ ప్రాంతంలో డాన్సు స్కూలు నడిపిస్తున్నారు. తన పదేళ్ల కుమార్తె దివ్యరూప అక్కడ డాన్సు నేర్చుకుంటోందని, ఆమెపై ఇలియానా దురుసుగా ప్రవర్తించారని బాధితురాలి తండ్రి కమల కాంత దాస్ ఆదివారం నాడు భువనేశ్వర్‌లోని లింగరాజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం మంగళవారం రాత్రే ఆ కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. బాధితురాలి తండ్రి మాత్రం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు ఇలియానా కూడా తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని అంటున్నారు. తాను ఆ పాపను కొట్టడం గానీ, తిట్టడం గానీ ఏమీ చేయలేదని చెబుతున్నారు. 'ఆర్ట్ విజన్ అకాడమీ' అనే తన డాన్సు స్కూల్లో 40 మందికి ఆమె డాన్సు నేర్పుతున్నారు. పోలీసులు మాత్రం ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, బాలల చట్టంలోని సెక్షన్ 23 కింద కేసులు నమోదుచేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించాము గానీ, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేనట్లు తెలిసిందని డీసీసీ నితిన్జీత్ సింగ్ తెలిపారు.