breaking news
Obulreddy
-
రాయలసీమ హక్కుల కోసం పోరాడుతాం
కడప కోటిరెడ్డి సర్కిల్ : రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం సాగిస్తామని రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఓబుల్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాలలో రాయలసీమ వెనుకబడి ఉందని, ఇందుకోసం రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు చేశామని, ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం జనార్దన్ మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర కమిటీ అధ్యక్షులుగా ఉరిమి జనార్దన్, కో కన్వీనర్‌గా దావుద్దీన్, చంద్రమోహన్‌రెడ్డి, సభ్యులుగా కుమార్, శివ నాయక్, శ్యాంసన్, ముక్తియార్బాష, రవి చక్రవర్తి, రమేష్, వెంకటరాజు, గంగన్న, ఈశ్వరయ్య, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, నాగార్జుననాయక్, సుబ్బరాయుడులను ఎన్నుకున్నారు. -
అటు ప్రేమ... ఇటు హర్రర్!
‘ఎల్ 7’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో, హర్రర్, కామెడీ ప్రధానాంశాలుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అరుణ్ అదిత్, పూజా ఝవేరీ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముకుంద్ పాండే దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘అందమైన ప్రేమకథకు హర్రర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం’ చిత్రాలకు పనిచేసిన ముకుల్ పాండే ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కిస్తున్నారు’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అరవింద్ శంకర్, కెమెరా: దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కిషోర్.