breaking news
obstruct
-
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బియ్యం బొక్కుడు తూకం.. తకరారు
నిరుపేదల బియ్యాన్ని కొందరు అడ్డదారిలో బొక్కుతున్నారు. కొన్ని మండల లెవల్ స్టాక్ పాయింట్లలో (ఎంఎల్ఎస్) సిబ్బంది చేతివాటం చూపుతూ క్వింటాకు రెండు నుంచి నాలుగు కిలోలు దోచేస్తున్నారు. ఫలితంగా డీలర్లకు తక్కువ బియ్యం అందుతున్నాయి. దీంతో డీలర్లు కూడా తూకంలో తకరారు చేస్తూ కార్డుదారులకు తక్కువ బియ్యం ఇస్తున్నారు. ఇలా ఒక్క నెలలోనే దాదాపు 50 టన్నుల బియ్యాన్ని నొక్కేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తమను ఇబ్బందులకు గురి చేస్తారోనని డీలర్లు నోరు మెదపడం లేదు. సాక్షి, అనంతపురం : జిల్లాలో 3,003 చౌక ధరల దుకాణాలుండగా.. వాటి పరిధిలో 12,21,772 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 24 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. కార్డుదారులకు ప్రతి నెలా 18,500 టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 770 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతోంది. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది బియ్యాన్ని నొక్కేస్తుండగా.. ఆ ప్రభావం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది. నోరు మెదపలేని స్థితిలో డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్లలో క్వింటా మీద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బియ్యం నొక్కేస్తున్నా.. డీలర్లు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇదేమని ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తారని కొందరు డీలర్లు వాపోతున్నారు. 200 క్వింటాళ్ల మేర బియ్యం ఇవ్వాల్సి ఉన్నా డీలర్‌కు 196 క్వింటాళ్లు మాత్రమే ఇస్తున్నారు. నాలుగు క్వింటాళ్లు(400 కేజీలు) తక్కువగా ఇస్తున్నారని, వాటి కోసం అధికారులతో గొడవ పడి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నామని పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని ఒక డీలర్ చెబుతున్నాడు. ఇలా ఎంఎల్ఎస్ పాయింట్లో కోత పెట్టిన బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో సర్దుబాటు చేసుకుంటున్నామని సదరు డీలర్ చెబుతున్నాడు. ఇలా తాను ఒక్కడినే కాదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. అధికారులది మరో వాదన ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో క్వింటా బియ్యాన్ని రెండు బస్తాల్లో నింపుతున్నారనీ, ఒక్కో బస్తా సంచి బరువు కిలో 100 గ్రాములు ఉంటుందన్నారు. సరఫరా అయ్యే బియ్యమే క్వింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక స్టేజ్–1 ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్‌కు వచ్చే బియ్యంలోనే క్వింటా మీద రెండు నుంచి మూడు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర ఉంటోందంటున్నారు. ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీలో లోడింగ్, అన్‌లోడింగ్‌కు తరుగు ఇస్తున్నారని, అదే ఎంఎల్ఎస్ పాయింట్లో అన్లోడింగ్, లోడింగ్‌కు తరుగును ఇవ్వడం లేదంటున్నారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. తరుగు అంశాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు బియ్యం తక్కువగా ఇవ్వడం లేదని చెప్పలేను. కానీ అన్నిచోట్ల కాదు. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఇది జరుగుతుండొచ్చు. ముఖ్యంగా బియ్యం అన్లోడింగ్, లోడింగ్ క్రమంలో కొంత తరుగు వస్తున్న మాట వాస్తవమే. అలా అని డీలర్లకు బియ్యం తక్కువగా ఇవ్వకూడదు. పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేస్తాం. స్టేజ్–1 నుంచి బియ్యం తీసుకొచ్చే లారీని తూకం వేయిస్తాం. అదే విధంగా స్టేజ్–2 ద్వారా డీలర్లకు బియ్యం రవాణా చేసే లారీలను తూకం వేయిస్తాం. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
విమానాశ్రయం నిర్మిస్తే అడ్డుకుంటాం
♦ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ♦ పునుకుడుచెలక గ్రామాన్ని ♦ సందర్శించిన సీపీఎం బృందం కొత్తగూడెం రూరల్: పునుకుడు చెలక గ్రామంలోని ఆదివాసీల భూముల్లో విమానాశ్రయం నిర్మిస్తే అడ్డుకుంటామని...ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. మంగళవారం కొత్తగూడెం మండల పరిధిలోని పునుకుడు చెలక గ్రామంలో విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో పాటు, సీపీఎం బృందం మంగళవారం సందర్శించారు. తొలుత ఆదివాసీలతో వారు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అడవిలోని భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల భూములలో విమానాశ్రయం నిర్మిస్తే ఉద్యమం చేపడుతామన్నారు. అన్నం పెట్టే ఆదివాసీల భూములలో విమానాశ్రయం నిర్మిస్తే సహించమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పొతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ ఆదివాసీలకు భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నా ఆదివాసీల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, జిల్లా నాయకులు గుగులోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, అన్నవరపు కనకయ్య, ఎం జ్యోతి, కున్సోత్ ధర్మా, భూక్య రమేష్, ఇట్టి వెంకటరావు, జాటోతు కృష్ణ, ఆదివాసీ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ జేఏసీ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షుడు పాయం పోతయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో కార్ల రేసింగ్‌ను అడ్డుకున్న విద్యార్థులు