breaking news
Nuveksha
-
హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
-
హీరోయిన్‌తో షణ్ముఖ్ స్టెప్పులు.. వేరే లెవల్!
బిగ్‌బాస్ షో తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోయారు. దీంతో షణ్ముఖ్ ప్రస్తుతం కెరీర్పైన దృష్టి పెట్టాడు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్ ప్రకటించాడు. ప్రస్తుతం డైరెక్టర్ పండుతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో విజయ్ బీస్ట్ మూవీలోని ‘హళమితి హబిబో’ పాటకు హీరోయిన్ నువేక్షతో కలిసి స్టెప్పులేశాడు. అచ్చం విజయ్ మాదిరే స్టెప్పులేస్తూ అదరగొట్టేశాడు షన్నూ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన షన్నూ అభిమానులు.. వేరే లెవల్ అంటున్నారు. ‘మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చేసింది’ (శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో లవ్ ఫెయిల్ అయిన వ్యక్తిని ఓ పాట రూపంలో ఓదార్చుతూ.. చిరంజీవి ఈ డైలాగ్ చెప్తాడు) అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)