breaking news
nuclear waste
-
KGF: బంగారు గనుల్లో అణు వ్యర్థాల డంపింగ్?
కేజీఎఫ్: కేజీఎఫ్ తెరపైన, తెర వెనుక వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్కేంద్రంలో వెలువడే అణు వ్యర్థాలను కేజీఎఫ్‌లోని బంగారు గనుల్లో డంప్ చేస్తారనే వార్తలు మరోసారి కలకలం రేపాయి. తమిళనాడులో కొందరు ప్రముఖులు తాజాగా దీనిపై ప్రకటనలు చేసినట్లు వార్తలు రాగా, కేజీఎఫ్ ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేజీఎఫ్‌లో బంగారు గనులు మూతబడి దాదాపు 14 ఏళ్లు పైబడింది. వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. బంగారు గనులను పునః ప్రారంభం చేయాలని స్థానికులు, నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడిలు చేస్తున్న సమయంలో యురేనియం వ్యర్థాలను ఈ గనుల సొరంగాల్లో పడేస్తారన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. సైనైడ్ దిబ్బలతో సమస్య బీజీఎంఎల్ గోల్డ్ మైన్స్ నడుస్తున్న సమయంలో గనుల నుంచి తవ్వితీసిన లక్షల టన్నుల మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. సైనైడ్ దిబ్బలుగా పేరుపొందిన వీటి నుంచి గాలి దుమారం రేగినప్పుడల్లా దుమ్ముధూళి వ్యాపించి స్థానికులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీల బారిన పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం మేల్కొని సైనైడ్ దిబ్బలపై మొక్కలు పెంచడంతో దుమ్ము కొంచెం తగ్గింది. ఇంతలోనే ప్రాణాంతక అణు వ్యర్థాలను ఇక్కడ నిల్వ చేస్తారనే వార్తలు పిడుగుపాటుగా పరిణమించాయి. పోరాటాలు చేస్తాం: ఎమ్మెల్యే అణు వ్యర్థాలను కేజీఎఫ్‌లో వేయడానికి ఎట్టి పరిస్థితిలోను అనుమతించేది లేదని, ఇందుకోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. నగర ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. వ్యర్థాలను అక్కడే వేసుకోండి అన్నారు. -
ఈ బ్యాటరీ చాలా హాట్ గురూ..
న్యూక్లియర్ వేస్ట్ తో ఒక వినూత్న బ్యాటరీ ని సైంటిస్టులు రూపొందించారు. 'డైమండ్ బ్యాటరీ' గా వ్యవహరిస్తున్న ఈ బ్యాటరీ ఒకటి సుమారు 5 వేల ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టాల్స్ ఇంటర్ ఫేస్ ఎనాలసిస్ సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ టామ్ స్కాట్ బృందం ఈ సరికొత్త బ్యాటరీని తయారు చేసింది. అత్యంత గట్టిదైన వజ్రంలోపల రేడియోధార్మిక మూలం సురక్షితంగా పొదిగిన వుంటుందనీ, రేడియోధార్మిక మూలం పక్కన ఉంచినప్పుడు డైమండ్ ఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఎలాంటి ఉద్గారాలను ఈ బ్యాటరీ రిలీజ్ చేయదని, మెయింటెన్స్ కూడా అవసరం లేదని కూడా పరిశోధకులు చెప్తున్నారు. తాము సాధించిన ఈ పురోగతి అణు వ్యర్థాల సమస్య పరిష్కారానికి, శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తికి , బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించటానికి సహాయ పడుతుందంటున్నారు అణుధార్మిక వ్యర్థ పదార్థాలను ఉపయోగించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసే సామర్థ్యం కలిగిన ‘డైమండ్ బ్యాటరీ’ని రూపొందించారు. అంటే ఉదా:ఈ బ్యాటరీని 2016లో తయారు చేస్తే అది నిరంతరాయంగా 7746 (సుమారు 5 వేల ఏళ్ల) వరకు పనిచేస్తుందని ప్రొ. టామ్ చెబుతున్నారు. ఈ బ్యాటరీలను డ్రోన్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల్లో ఉపయోగించవచ్చని తెలిపారు. అణుధార్మిక వ్యర్థాలు, బ్యాటరీ జీవిత కాలానికి సంబంధించిన వివిధ సమస్యలకు ఇది చెక్ చెబుతుందంటున్నారు. రేడియేషన్ కోసం రేడియో యాక్టివ్ ఐసోటోప్ నికెల్-63ను ఉపయోగించి ప్రోటో టైప్ డైమండ్ బ్యాటరీ నమూనా తయారు చేసినట్టు టామ్ తెలిపారు. అయితే దీన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ బ్యాటరీని తయారు చేసేందుకు కార్బన్-14ను పరిశోధకులు ఉపయోగిస్తున్నారని, ఇది కొంత మొత్తంలో రేడియేషన్ ను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇలా విడుదలయ్యే రేడియేషన్ ను ఇతర ఘనపదార్థాలు సులభంగా గ్రహిస్తాయని ఆయన చెప్పారు. అత్యంత దృఢ పదార్థం వజ్రమని ఆయన గుర్తు చేసిన ఆయన ఈ కృత్రిమ వజ్రాన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకు అతి సమీపంలో ఉంచినప్పుడు, ఆ రేడియో యాక్టివ్ పదార్థం ఆ వజ్రపు పొరల్లో నిక్షిప్తమవుతుందని ఆయన తెలిపారు. తద్వారా సురక్షితమయన, సుదీర్ఘకాలం పని చేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీలను తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ బ్యాటరీలో విద్యుత్తు 5,730 ఏళ్లకు 50 శాతం, 11 వేల ఏళ్లకు 25 శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు. మరోవైపు అత్యంత గట్టిపదార్థం డైమండ్ కాదని, డైమండ్ ను మించిన గట్టివ పదార్థాలు గ్రాఫేన్ , కార్బైన్ లన్నమరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కార్బన్-14 వినియోగం సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రెడిక్యులస్ అని కొట్టి పారేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. సుమారు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.