breaking news
Nth Hour
-
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా.. పాన్ ఇండియా మూవీలో విశ్వ కార్తికేయ
విశ్వ కార్తికేయ....తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన బాలకృష్ణ, బాపు, రాజేంద్రప్రసాద్ గారి లాంటి ఎంతోమంది స్టార్స్‌తో వర్క్ చేశాడు. సుమారు 50కి పైగా చిత్రాలలో బాలనటుడిగా చేసి, నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, స్టేట్ అవార్డు ఫర్ మెరిటోరియస్ అచీవ్మెంట్.. ఇలా ఎన్నో పురస్కారాలు పొందాడు. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ హీరోగా మారి జైసేన, కళాపోషకులు, ఐపిఎల్, అల్లంతదూరన అనే సినిమాలు చేసి డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. కథకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకి సాగుతున్నాడు ఈ యువ హీరో. అయితే ఆ స్పీడ్ సరిపోలేదు అనుకున్నాడో ఏమోగాని గేర్ మార్చి ఇటీవల పాన్ ఇండియన్ సినిమా ఎన్త్ హవర్‌తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు. రాజు గుడిగుంట్ల దీని దర్శక నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్త్ హవర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారిన మరో విషయం ఏంటంటే విశ్వ కార్తికేయ ఇటీవల ఒక ఎక్స్పరిమెంటల్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను ఓకే చేశాడట! త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఆ మూవీ కోసం మరింత ఫిట్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడట. అయితే ఆ సినిమా విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. టాలెంట్ ఉన్న హీరోగా ఆల్రెడీ గుర్తింపు సంపాదించుకున్న విశ్వ.. కరెక్ట్ కంటెంట్ పడితే స్టార్ లిస్ట్‌లో చేరడం ఖాయం. -
‘ఎన్త్ హవర్’ విజయం సాధించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
యువ హీరో విశ్వకార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్త్ హవర్’. లేడి లయన్ క్రియేషన్స్ పతాకం పై వ్యాపార వేత్త రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని పూర్తి విభిన్న మైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా లో నటించిన నటి నటులకు టెక్నీషియన్స్ కు నా శుభాకాంక్షలు.సినిమా ఘన విజయం సాధించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరక్టర్, నిర్మాత రాజు గుడిగుంట్ల, హీరో విశ్వకార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంకదాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు , డి.ఓ.పి. శ్రీ వెంకట్.. పాల్గొన్నారు.