‘ఎన్త్ హవర్’ విజయం సాధించాలి: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

Central Minister G Kishan Reddy Launched Nth Hour Movie Motion Poster - Sakshi

యువ హీరో విశ్వకార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్త్‌ హవర్‌’. లేడి లయన్ క్రియేషన్స్ పతాకం పై  వ్యాపార వేత్త రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని పూర్తి విభిన్న మైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.

తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌ని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా లో నటించిన నటి నటులకు టెక్నీషియన్స్ కు నా శుభాకాంక్షలు.సినిమా ఘన విజయం సాధించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరక్టర్, నిర్మాత రాజు గుడిగుంట్ల, హీరో విశ్వకార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంకదాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు , డి.ఓ.పి. శ్రీ వెంకట్.. పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top