breaking news
NRI Junior College
-
Sakshi Premier League: ఫైనల్లో ఎన్ఆర్ఐ, సాయి గణపతి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ స్థాయి పురుషుల క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది.జూనియర్ విభాగంలో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం), ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజి (విజయవాడ) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఏపీ ఐఐఐటీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఏపీ ఐఐఐటీ నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఎ.రాంబాబు (37; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. సాయి గణపతి బౌలర్లలో బి.కుమార్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం సాయి గణపతి కాలేజి 8.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 69 పరుగులు చేసి గెలిచింది. జి.బౌరి (44 నాటౌట్; 4 ఫోర్లు), మధు (18 నాటౌట్; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఏపీ ఐఐఐటీ (ఇడుపులపాయ)తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎన్ఆర్ఐ కాలేజి 30 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఎన్ఆర్ఐ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఎస్కే జాఫర్ (46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇక్తాన్ సింగ్ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీ ఐఐఐటీ 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎన్ఆర్ఐ కాలేజి బౌలర్ బి.తరుణ్ నాలుగు వికెట్లు తీశాడు. ఏపీ ఐఐఐటీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సీనియర్ విభాగంలో ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (విజయనగరం)పై సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ (ఏలూరు) పరుగు తేడాతో గెలిచింది. తొలుత సర్ సీఆర్ రెడ్డి కాలేజి నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. వి.గగన్ కుమార్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎంవీజీఆర్ కాలేజి బౌలర్లు కల్యాణ్ మూడు వికెట్లు, సురేష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంవీజీఆర్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. నేడు సీనియర్ విభాగం ఫైనల్లో సీకామ్ డిగ్రీ కాలేజీతో సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ జట్టు; జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజితో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తలపడతాయి. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం బీరపల్లికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి నిజాంపేటలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గదిలోని ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కెమిస్ట్రీ లెక్టరర్ విపరీతంగా కొట్టడంతో మనస్థాపం చెందిన విద్యార్థి క్యాంపస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ కుటుంబీకులకు కనీస సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కళాశాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మృతుని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని వారు ఆరోపిస్తున్నారు.