breaking news
not participate
-
ఐరాస సభకు మోదీ వెళ్లరు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభనుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దఫా ప్రసంగించడం లేదు. వార్షిక సమావేశాల్లో ప్రసంగించే వివిధ దేశాల నేతల పేర్ల జాబితాను శుక్రవారం ఐరాస విడుదల చేసింది. ఇందులోని వక్తల జాబితాలో ప్రధాని మోదీ పేరు లేదు. ఈ నెల 9వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ఉన్నత స్థాయి సాధారణ చర్చ ఈ నెల 23–29వ తేదీల మధ్య జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం మొదటగా బ్రెజిల్, తర్వాత అమెరికా దేశాల నేతలు ప్రసంగిస్తారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 23వ తేదీన మొదటిసారిగా ఐరాస జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడనున్నారు. జూలైలో విడుదల చేసిన జాబితాలో సెప్టెంబర్ 26వ తేదీన భారత్ నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ఐరాస విడుదల చేసిన జాబితా పేర్కొంది. తాజా లిస్ట్‌లో మాత్రం 27న భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ప్రసంగిస్తారని ఉంది. 26న ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నేతల ప్రసంగాలుంటాయి. అయితే, ఇది తుది జాబితా మాత్రం కాదు. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, వారు ప్రసంగించే తేదీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెబుతున్నారు. ఐరాస 80వ సెషన్ ఈసారి ‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్’ఇతివృత్తంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలు కొనసాగుతున్న వేళ జరిగే ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు. వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అయితే, రష్యా నుంచి భారీ చమురుకొంటూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల భారత్‌పై ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లను విధించడం తెల్సిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తన జోక్యమే కారణమని పదేపదే ప్రకటించుకోగా వాటిని భారత్ ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఐరాస సమావేశాల్లో పాల్గొనడం లేదని పరిశీలకులు అంటున్నారు. -
ఇక్కడ పురుషులు హోలీ ఆడరు...
హోలీ.. రంగుల పండుగ. దేశమంతా ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుకకు మార్కెట్లు రంగులతో కళకళలాడతాయి. వీధులన్నీ రంగులద్దుకుంటాయి. హోలీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉండగా.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పురుషులు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంటారు. స్త్రీలు స్వేచ్ఛగా హోలీ ఆడుకుంటారు. ఈ ఆసక్తికర ఆచారం 500 ఏళ్లుగా కొనసాగుతోంది. ధిక్కరిస్తే బహిష్కరణే... ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. 500 ఏళ్లుగా గ్రామస్తులు ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మహిళలు బయట తిరగకుండా ఉంచిన పర్దా వ్యవస్థ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబతారు. పురుషులు ఉండరు కాబట్టి మహిళలు స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ధిక్కరించి పురుషులు గ్రామంలో ఉండిపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక పురుషులకు హోలీ పండుగే ఉండదా అంటే.. ఉంటుంది. కాకపోతే తరువాతి రోజు పురుషులు, స్త్రీలు కలిసి ఈ వేడుకలు జరుపుకొంటారు. కేవలం రంగులు జల్లుకోవడం కాదు.. పురుషులను స్త్రీలు కొరడాలతో కొట్టడంతో పుండుగ ముగుస్తుంది. పురుషులు ఆలయానికి.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నాగర్ గ్రామంలో ఈ అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ రోజున ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్‌కు చెందిన ఐదేళ్లు దాటిన పురుషులంతా గ్రామాన్ని వదిలి శివార్లలో ఉన్న చాముండేశ్వరీ దేవీ ఆలయానికి వెళ్తారు. అక్కడ జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా భక్తిశ్రద్ధలతో గడుపుతారు. పురుషుల వేషధారణలో స్త్రీలు.. ఇంకేముంది ఊరంతా మహిళలదే. రోజంతా పండుగే. గ్రామాన్నంతా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో తేడా లేకుండా మహిళలంతా ఆనందోత్సహాల్లో మునిగిపోతారు. ప్రత్యేక ఆచారం కావడంతో అంతగా ఇష్టపడనివారు సైతం కచి్చతంగా హోలీ ఆడతారు. కొందరు స్త్రీలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగిన బార్టీ
బ్రిస్బేన్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులకు షాక్... ఈ ఏడాది జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి మహిళల ప్రపంచ నంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ వైదొలిగింది. గురువారం ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 మధ్య జరగనుంది. అయితే కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న తరుణంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్టీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌తో పాటు కరోనా విరామం అనంతరం జరుగుతున్న తొలి టెన్నిస్ టోర్నమెంట్ అయిన సిన్సినాటి మాస్టర్స్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేది లేనిది త్వరలో వెల్లడిస్తానని... 24 ఏళ్ల బార్టీ పేర్కొంది. ఆగస్టు 20 నుంచి మొదలయ్యే సిన్సినాటి టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను టోర్నీ నిర్వాహకులు గత బుధవారం ప్రకటించారు. ఇందులో జొకోవిచ్, రాఫెల్, మెద్వెదేవ్, థీమ్ ఉండగా... సెరెనా , కోకో గౌఫ్ పేర్లు ఉన్నాయి. -
టెలినార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన కూడదని ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ నిర్ణయించింది. త్వరలో జరగబోయే ఈ వేలంలో పాల్గొనడం లేదని ఒక ప్రకనటలో వెల్లడించింది. ప్రస్తుత ప్రతిపాదిత స్పెక్ట్రం ధరలు తమకు ఆమోదయోగ్య లేవని, వేలం కోసం ప్రతిపాదించిన కనీస ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని టెలినార్ గ్రూప్ సీఈవో సిగ్వే బ్రెక్కి తెలిపారు. సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం ఏడు సెక్టార్స్‌లో 1800 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ లో 4జీ ప్రసారాలు ఉన్నా, వాటిలో ఆరు రాష్ట్రాల్లో 2 జి సేవలను అందిస్తున్నామని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ , బీహార్, గుజరాత్, మహారాష్ట్రలో2 జీ సేవలు అందిస్తుండగా అస్సాంలో ఇంకా ప్రారంభించలేకపోయామని అందుకే ఈ స్పెక్ట్రం వేలం పాల్గొనబోమని టెలినార్ స్పష్టం చేసింది. దేశీయ వ్యాపారాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని టెలినార్ తెలిపింది. దేశీయంగా ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడుతూ, దీర్ఘకాలం కొనసాగాలంటే మరింత స్పెక్ట్రమ్ కావాలి. అయితే అయితే దేశీయ టెలికాం రంగం నుంచి ఇప్పుడే తప్పుకోవడం లేదని, తక్కువ నష్టంతో బయట పడేందుకు కొంతకాలం సేవలు కొనసాగిస్తామన్నారు. త్వరలో జరగబోయే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని సంస్థ ప్రకటించింది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలినార్ ఇండియా రూ.105 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.71.3 కోట్లు. ఆదాయం మాత్రం రూ.1,080 కోట్ల నుంచి రూ.1230 కోట్లకు పెరిగింది. మరోవైపు టెలినార్ తో విలీనం చర్చలను వోడా ఫోన్ మరింత వేగవంతం చేసింది.