breaking news
non-cooperation
-
‘రిజర్వేషన్లు కల్పించే వరకు పన్నులు చెల్లించం’
ముంబై : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న మరాఠా నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పన్నులు చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్ల కోసం మరాఠా నేతలు గతకొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం వివిధ మరాఠా సంఘాలకు చెందిన నేతలు లాథూర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కార్యలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్లపై ప్రకటన చేసే వరకు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని నేతలు భావిస్తున్నారు. మరాఠి నేత సంజీవ్ బోర్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న మరాఠా క్రాంతి జన్ ఆందోళన్ పేరిట రహదారులపై నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. మరాఠాలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని కోరారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గతవారం చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మరాఠా నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారని.. వాటిని తక్షణమే ఎత్తివేయాలని మరో నేత శాంతారామ్ కుంజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అంతా జేపీ వల్లే!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందించారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆమె సోమవారం మీడియాకు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ ఆగర్వాల్ సహకరించకపోవడం వల్లే దారుణ పరాజయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, నగరవాసులు చెత్త పాలనను కోరుకోరని, అయితే అది ఇప్పుడు ఎన్నికల్లో జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలకు మీరు బలయ్యారా అన్న విలేకరుల ప్రశ్నను ఆమె సమాధానమిస్తూ ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగమేనన్నారు. అయితే భవిష్యత్ రాజకీయం గురించి ఇంకా ఆలోచించలేదని ముక్తసరి సమాధానమిచ్చారు. అప్పుడే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశమేమి లేదన్నారు. అయితే తొలిసారిగా పోటీచేసిన ఆప్‌ని తాము తక్కువగా అంచనా వేశామని అంగీకరించారు. బీజేపీనే తాము ఈ ఎన్నికలలో ప్రత్యర్థిగా పరిగణించామన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదారిపట్టించాయని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చి చూపాలంటూ ఆమె ఆప్‌కి సవాలు విసిరారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పారు. జాతీయ సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఏ సలహా ఇస్తారని ప్రశ్నించగా, అతను తనకన్నా చాలా తెలివైనవారని అభిప్రాయపడ్డారు.