breaking news
nivedha hethuraj
-
విజయంతో పాటు గౌరవం
‘‘పెళ్ళి చూపులు’కు ఎంత పేరొచ్చిందో ‘మెంటల్ మదిలో’ చిత్రానికీ అంతే పేరొచ్చింది. సినిమా బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా పదిమంది టెక్నీషియన్స్ పరిచయమయ్యారు. వీళ్లు మరో ఇరవై సినిమాలు చేస్తారు. నా బ్యానర్ నుంచి వచ్చిన వారు ఇలా సినిమాలు చేస్తున్నారని గొప్పగా ఫీలవుతా. ఇటువంటివారిలో వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు ప్రశాంతి విహారి, కెమెరామెన్ వేద రామన్, ఎడిటర్ విప్లవ్ కూడా ఉంటారనడంలో సందేహం లేదు. నేను ఏడాదికి ఒక సినిమా చేయగలను. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే కొత్తవారిని నా సినిమాల ద్వారా పరిచయం చేస్తా’’ అన్నారు. ‘‘మంచి హిట్‌తో పాటు గౌరవం తెచ్చిన సినిమా ఇది. ఈ చిత్రం బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇళయరాజాగారి, ఎ.ఆర్. రెహమాన్‌గారి పాటలు విన్నప్పుడు అప్పుడే అయిపోయాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘మెంటల్ మదిలో’ జర్నీలో ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రచయితలు భాస్కరభట్ల, సిరా శ్రీ, నటి అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఉదయనిధి చిత్రానికి యు సర్టిఫికెట్
తమిళసినిమా: ఇటీవల వరుస విజయాలను అందుకుంటున్న యువ నటుల్లో ఉదయనిధి స్టాలిన్ ఒకరు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన సవరణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు. ఆయనకు జంటగా నివేదాపేతురాజ్ నటించారు. ఇందులో పార్థిబన్, సూరి, మయిల్‌స్వామి ముఖ్యపాత్రలు పోషించారు. దళపతి నవదర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. డి.ఇమాన్ సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందించారు. తేని, మదురై, కోవై, సత్యమంగళం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుని యూ సర్టిఫికెట్తో విడుదలకు సిద్ధం రెడీ అయ్యింది. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం పూర్తి కావడంతో ఉదయనిధిస్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించే చిత్రంపై దృష్టి పెట్టారు.