breaking news
nirmal dist
-
తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్ కూలర్
పెంబి: ఓ ఐరన్ కూలర్.. తండ్రీ కొడుకును బలి తీసుకుంది. కూలర్లో నీళ్లు పోసేందుకు వెళ్లిన భార్యకు షాక్ రావడంతో కేకలు వేసింది. వెంటనే భర్త వెళ్లి కాపాడే క్రమంలో ఆయనకూ షాక్ తగిలింది. ఇద్దరి అరుపులు విన్న వారి కొడుకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయగా, ఆయనకూ షాక్కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం కోరకంటి తండాలో జరిగింది.ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. కోరకంటి తండాకు చెందిన రాథోడ్ సోనాబాయి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఐరన్ కూలర్లో నీళ్లు పోస్తూ విద్యుత్ షాక్‌కు గురై కేకలు వేసింది. అది విన్న భర్త రాథోడ్ అర్జున్ (56) ఆమెను కాపాడే ప్రయత్నంలో షాక్‌కు గురయ్యాడు. ఇద్దరి కేకలు విన్న పెద్ద కొడుకు రాథోడ్ శ్రీనివాస్ (28) తల్లీతండ్రిని రక్షించాలని వెళ్లాడు. అతడు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. చిన్నకొడుకు రాథోడ్ సుభాశ్ వచ్చి కూలర్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్థానికులు వచ్చి ముగ్గురిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అర్జున్, శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సోనాబాయికి తీవ్ర గాయాలయ్యాయి. రాథోడ్ సోనాబాయి–అర్జున్ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య, నాలుగేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిమిషాల వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది. సోమవారం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెత్తురోడిన రహదారులు..రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, కంటోన్మెంట్: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్ నగరానికి చెందిన తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు బోయిన్పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్‌లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మల్లాపూర్ అశోక్‌నగర్ కాలనీ మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్‌లోని న్యూ నర్సింహనగర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి) -
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం
-
ఇండ్ల స్థలాల కోసం ఆదివాసీల ఆందోళన
నిర్మల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుపేద ఆదివాసీ గిరిజనులు ఇండ్ల స్థలాలకోసం నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు. గత యాభై రోజులుగా ఆదివాసీ గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భీంరావు, భారతి అనే గిరిజన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనున్న వారు గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం జిల్లా కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


