breaking news
nikita zareen
-
నిఖత్‌కు పతకం ఖాయం
టోక్యో: రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే ఆరుగురు భారత బాక్సర్లకు... క్వార్టర్ ఫైనల్లో విజయంతో మరో భారత బాక్సర్‌కు టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ టెస్ట్ ఈవెంట్లో పతకాలు ఖాయమయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 5–0తో యుకీ హిరకావ (జపాన్)పై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తక్కువ ఎంట్రీల కారణంగా మరో ఆరుగురు భారత బాక్సర్లకు నేరుగా సెమీఫైనల్లో చోటు లభించడంతో వారి ఖాతాలో పతకాలు చేరనున్నాయి. మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), వన్‌హిలిమ్‌పుయా (75 కేజీలు) నేరుగా సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
నిఖత్ జరీన్‌కు నజరానా
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ను ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో జరీన్ రజత పతకం గెలుచుకుంది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జరీన్‌కు రూ. 50 వేల నగదు ప్రోత్సాహకాన్ని నాగేందర్ అందజేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.