breaking news
NIIT Q3 Profit
-
ఎన్ఐఐటీ- ఎవరెడీ.. జోరు
ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్‌చేసి 38,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్, ఐటీ శిక్షణా సంస్థ ఎన్ఐఐటీ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్స్‌ను ఇండియా రేటింగ్స్.. అప్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఎవరెడీ ఇండస్ట్రీస్ కౌంటర్ జోరందుకుంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 140 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్ధంలో రుణ భారాన్ని తగ్గించుకోవడం, లాభదాయకతను నిలుపుకోవడం వంటి అంశాలు ఎవరెడీ ఇండస్ట్రీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు దోహదం చేసినట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో BB- రేటింగ్‌ను తాజాగా BB+కు పెంచినట్లు తెలియజేసింది. ఎన్ఐఐటీ లిమిటెడ్ ఇప్పటికే కంపెనీలో 1.87 శాతం వాటాను కలిగిన మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(ఎంఐఐటీ) తాజాగా 2.12 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఎన్ఐఐటీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 102కు చేరింది. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. షేరుకి 96.75 ధరలో 30 లక్షల నిట్ షేర్లను ఎంఐఐటీ కొనుగోలు చేసింది. -
ఎన్ఐఐటీ టెక్నాలజీస్
బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.390 టార్గెట్ ధర: రూ.454 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం అంచనాలకు తగ్గట్లుగా లేనప్పటికీ, ఆర్డర్లు బాగా ఉన్నాయి. ఎబిటా మార్జిన్లు మాత్రం అంచనాలను మించి 130 బేసిస్ పాయింట్లు పెరిగి 16 శాతం వృద్ధి సాధించాయి. ఇతర ఆదాయం తక్కువగా ఉండటంతో నికర లాభం అంచనాల కంటే 8 శాతం తక్కువగా రూ.53 కోట్లుగానే నమోదైంది. మొత్తం ఆదాయంలో 11 శాతం వరకూ ఉన్న భారత వ్యాపారంపై దృష్టిని తగ్గిస్తూ, అభివృద్ధి చెందిన మార్కెట్ల వ్యాపారంపై దృష్టిని మరింత పెంచుతోంది. కొత్త డీల్స్, హెడ్జింగ్ నష్టాలు తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల మార్జిన్లు క్రమక్రమంగా పుంజుకోగలవని భావిస్తున్నాం. 30 కోట్ల డాలర్ల భారీ ఆర్డర్ త్వరలోనే అందగలదని కంపెనీ భావిస్తోంది. ఈ డీల్‌తో మరిన్ని భారీ డీల్స్ సాధించగలమని కంపెనీ ఆశిస్తోంది.