ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ | NIIT Ltd Q3 net profit up over two-fold at Rs 1.2 cr, Rajendra S Pawar sees 'revival' | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్

Jan 20 2014 1:53 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం అంచనాలకు తగ్గట్లుగా లేనప్పటికీ, ఆర్డర్లు బాగా ఉన్నాయి. ఎబిటా మార్జిన్లు మాత్రం అంచనాలను మించి 130 బేసిస్ పాయింట్లు పెరిగి 16 శాతం వృద్ధి సాధించాయి.

బ్రోకరేజ్ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
 ప్రస్తుత మార్కెట్ ధర: రూ.390
 టార్గెట్ ధర: రూ.454
 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం అంచనాలకు తగ్గట్లుగా లేనప్పటికీ, ఆర్డర్లు బాగా ఉన్నాయి. ఎబిటా మార్జిన్లు మాత్రం అంచనాలను మించి 130 బేసిస్ పాయింట్లు పెరిగి 16 శాతం వృద్ధి సాధించాయి. ఇతర ఆదాయం తక్కువగా ఉండటంతో నికర లాభం అంచనాల కంటే 8 శాతం తక్కువగా రూ.53 కోట్లుగానే నమోదైంది.  

మొత్తం ఆదాయంలో 11 శాతం వరకూ ఉన్న భారత వ్యాపారంపై దృష్టిని తగ్గిస్తూ, అభివృద్ధి చెందిన మార్కెట్ల వ్యాపారంపై దృష్టిని మరింత పెంచుతోంది. కొత్త డీల్స్,  హెడ్జింగ్ నష్టాలు తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల మార్జిన్లు క్రమక్రమంగా పుంజుకోగలవని భావిస్తున్నాం.  30 కోట్ల డాలర్ల భారీ ఆర్డర్ త్వరలోనే అందగలదని కంపెనీ భావిస్తోంది. ఈ డీల్‌తో మరిన్ని భారీ డీల్స్ సాధించగలమని కంపెనీ ఆశిస్తోంది.

Advertisement

పోల్

Advertisement