breaking news
NH 44 highway road accident
-
బెంగళూరు హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్
-
రోడ్డు ప్రమాదంలో బెంగళూరువాసి మృతి
మానోపాడు(మహబూబ్నగర్): రోడ్డుప్రమాదంలో కారు బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా మనోపాడ్ మండలం ఎన్హెచ్ 44పై సోమవారం రాత్రి 9.45 గంటలకు జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన బెంగళూరు వాసులు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా కారు బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న లక్షి(55) అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


