breaking news
Newborn Care
-
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. మరణించిన వారంతా ఒకటి నుంచి మూడు నెలలోపు పసిబిడ్డలే కావడం విషాదం. మృతి చెందిన పది మందిలో ముగ్గురు కాలిన గాయాలతోనూ, మిగిలిన ఏడుగురు పొగ కారణంగా ఊపిరాడక మృత్యువాత పడ్డట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ నాయకత్వంలో ఘటనపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. సెక్యూరిటీ ఉద్యోగి గౌరవ్ రహపాడే మీడియాతో మాట్లాడారు. ‘పై వార్డుకు ఉన్న కిటికీ వద్దకి చేరుకుని అద్దాలు పగుల కొట్టి లోపలికి చేరాం. అనంతరం వెనుక ద్వారం నుంచి పిల్లలను బయటికి తీసుకవచ్చాం. ఏడుగురికి రక్షించగలిగాం. ఒక విభాగంలోని ఏడుగురిని రక్షించినప్పటికీ 10 మంది ఉన్న మరో విభాగం నుంచి ఎవరినీ రక్షించలేకపోయాం’ అని రహపాడే తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రమాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులెవరినీ వదిలిపెట్టేది లేదనీ, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. మృతిచెందిన పసివారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే..? ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్లో తక్కువ బరువున్న చిన్నారులకు చికిత్సనందిస్తున్నారు.రాత్రి 1.30 గంటలపుడు యూనిట్లో మంటలు చెలరేగాయని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖాన్దేట్ చెప్పారు. విషయాన్ని ముందుగా ఒక నర్సు గుర్తించి, వైద్యులను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని వార్డులోని కిటికీ తలుపుల గుండా ఏడుగురు పసికందులను పక్క వార్డులోకి మార్చారు. యూనిట్లో అగ్ని మాపక పరికరాలున్నా పొగ తీవ్రత కారణంగా మిగతా వారిని రక్షించడం సాధ్యం కాలేదన్నారు. ఆ యూనిట్లో 24 గంటల ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లున్నాయి. భవనంలో మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఘోరం మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. -
సామాజిక సౌధం
మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఏటూరునాగారం ఆస్పత్రి 20 రోజుల్లో 34 సాధారణ ప్రసవాలు నవజాత శిశు సంరక్షణకు ఆధునిక వైద్యసేవలు యువ వైద్యుల కృషితో దవాఖాన పనితీరులో పురోగతి ఏటూరునాగారం : ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాల అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కేవలం ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల పరిధిలోని సుమారు 60 పంచాయతీల ప్రజలే ఇక్కడికి వైద్యం కోసం వచ్చేవారు. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి వెంకటాపురం, వాజేడు తదితర మండలాల నుంచి నిత్యం వేలాది మంది ఏటూరునాగారానికి వస్తుండటం గమనార్హం. దవాఖాన సేవల పరిధి పెరిగిందనేందుకు ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ ఆస్పత్రిని ప్రస్తుతమున్న 30 పడకల నుంచి 100 పడకలకు పెంచి, సేవలను అప్‌గ్రేడ్ చేయూల్సిన అవసరముంది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత రక్తనిధి కేంద్రం విస్తరణకు వైద్య,ఆరోగ్య శాఖ సహకారం అందించాలి. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న యువ వైద్యుల బృందం చొరవే ఈ ఆస్పత్రి సేవలు మెరుగుపడేందుకు ముఖ్య కారణం. ఆనవారుుతీ ప్రకారం ఆస్పత్రికి రావడం.. గడియూరం చూసుకొని ఇంటిబాట పట్టడం ఇదంతా నిన్నటి సంగతి. తాము మాత్రం 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించగలమని నిరూపించుకుంటున్నారు యువ వైద్యులు. వారి చొరవ ఫలితంగా ప్రజలకు ఆస్పత్రి పనితీరుపై ఉన్న ప్రతికూల దృక్పథం తుడిచిపెట్టుకుపోరుుంది. ట్రావెలింగ్ ఇంక్యుబేటర్ అత్యవసర పరిస్థితుల్లో శిశువులను వరంగల్‌కు తరలించే సమయంలో వాడేందుకు ట్రావెలింగ్ ఇంక్యుబేటర్ ఏటూరునాగారం ఆస్పత్రిలో ఉంది. దీనిద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు ఆక్సిజన్‌తోపాటు చికిత్స అందిస్తూ వరంగల్‌కు తరలించొచ్చు. ల్యాబ్‌లో అన్ని వైద్యపరీక్షలు హెమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, మలేరియా, వైడల్, బ్లడ్ షుగర్, సిరమ్ బైలీరూబిన్, హెపటైటిస్, హెచ్ఐవీ, యూరిన్, షుగర్, అల్బుమిన్, కఫం(తేమడ) పరీక్ష, గర్భనిర్ధారణ పరీక్షలు ఆస్పత్రిలోనే చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు భాస్కర్, వెంకన్న ఈ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. హెచ్ఐవీ బారినపడే వారికి కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పిస్తున్నారు. ల్యాబ్‌లో వైద్యపరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రరుువేటు ల్యాబ్‌లను ఆశ్రరుుంచి ప్రజలు జేబులు ఖాళీ చేసుకునే పరిస్థితి దూరమైంది. రూ.కోటితో శిశు సంరక్షణ కేంద్రం జిల్లాలోని సీకేఎం, ఎంజీఎం, హన్మకొండ జనరల్ మెటర్నిటీ హాస్పిటళ్లలో మాతా,శిశు సంరక్షణకు సంబంధించిన నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నారుు. ఈ తరుణంలో ఇటీవల మహబూబాబాద్, ఏటూరునాగారంలలో ఎస్ఎన్సీయూ ఆస్పత్రిని నెలకొల్పారు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా వైద్యం చేసేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పథకం ద్వారా రూ.కోటితో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో నెలకొల్పారు. బరువు తక్కువ, కామెర్లతో బాధపడే నవజాత శిశువులను ఇప్పటిదాకా వరంగల్ ఎంజీఎం, జిల్లా కేంద్రంలోని మెటర్నిటీ దవాఖానలకు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మాత్రం స్థానికంగా వైద్యం అందించగలిగేలా వసతులు అందుబాటులోకి వచ్చారుు. ఫొటోథెరపీ వైద్యం, ఇంక్యుబేటర్ వసతితో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఉమ్మనీరు తాగిన పిల్లలకు వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. గర్భిణులకు చక్కటి వైద్యసేవలు గర్భిణుల కోసం ప్రత్యేక ప్రసూతి గదిని ఏర్పాటు చేశాం. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీతో పాటు పెద్దాపరేషన్లు చేసేందుకు అధునాతన శస్త్రచికిత్స పరికరాలు ఉన్నారుు. మే 20 నాటికి 34 నార్మల్ డెలివరీలు చేశాం. నిత్యం అందుబాటులో ఉంటూ గర్భిణులకు చక్కటి వైద్యసేవలు అందిస్తున్నాం. - మానసారెడ్డి, స్త్రీల వైద్య నిపుణురాలు అందుబాటులో అన్ని రకాల మందులు ఎక్స్‌రే, ఈసీజీ సదుపాయం ఆస్పత్రిలో ఉంది. రోగుల సౌకర్యార్ధం వినియోగించేందుకు వీల్చైర్లు, సెక్షన్ మిషన్లు, పల్స్ ఆక్సీమీటర్, ఫీడర్ డాపాలర్లు ఉన్నారుు. రోగులతో వచ్చే సహాయకులకు భోజన వసతితో పాటు పాలు, బ్రెడ్ ఇస్తున్నాం. త్వరలోనే సెల్ కౌంట్ మిషన్ కూడా రాబోతోంది. పాము, తేలు, కుక్కకాటు మందులతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. - వాడె రవీప్రవీణ్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవ చేసేందుకు వైద్యులమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నాతోపాటు మరో ఆరుగురు వైద్యులు దవాఖానలో ఉన్నారు. అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాం. వారు అసౌకర్యానికి గురికాకుండా చూడటమే మా లక్ష్యం. - అల్లి నవీన్, వైద్యుడు, ఏటూరునాగారం