breaking news
new jersy railway station
-
అమెరికాపై మరో ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం
-
అమెరికాపై మరో ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం
అగ్రరాజ్యం అమెరికా కూడా ఉగ్రవాద దాడులతో ఉలిక్కిపడుతోంది. న్యూయార్క్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించి 29 మంది గాయపడిన ఒక్క రోజులోనే.. మళ్లీ న్యూజెర్సీలో ఒక రైల్వేస్టేషన్లో ఐదు పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొని.. వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు. ఎలిజబెత్ రైల్వేస్టేషన్ వద్ద ఒక ప్యాకెట్లో సోమవారం ఈ పేలుడు పదార్థాలు కనిపించాయి. నెవార్క్ నగరానికి దక్షిణంగా ఉండే ఎలిజబెత్ పట్పటణంలో రైల్వేస్టేషన్లో పారిశుధ్య పనివారు చెత్తను తుడుస్తుండగా.. వాళ్లకు ఓ ప్యాకెట్ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దాంట్లో బాంబు ఉండి ఉండొచ్చని భావించారు. ఆ ప్యాకెట్లో కొన్ని వైర్లు, ఒక పైపు కూడా ఉన్నాయని ఎలిబజెత్ నగర మేయర్ బాల్వేజ్ తెలిపారు. కౌంటీ బాంబుస్క్వాడ్ వచ్చి వెంటనే దాన్ని నిర్వీర్యం చేసింది. ఎఫ్‌బీఐకి చెందిన బాంబు స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకుంది. నిజానికి రైల్వేస్టేషన్లో బాంబు పేలినట్లు ఉదయాన్నే కథనాలు వచ్చాయి. పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించిందని కూడా అన్నారు. కానీ, ఆ తర్వాత బాంబును నిర్వీర్యం చేసినట్లు బాల్వేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎలిజబెత్‌లో పరిస్థితి గురించి తమకు పూర్తిగా తెలుసని ఎఫ్‌బీఐ ప్రతినిధి మైక్ వైటేకర్ నెవార్క్లో ప్రకటించారు. స్థానిక ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. అయితే బాంబు గురించిన వివరాలు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. Federal, state, & local officials are on the scene of a suspicious package @CityofElizabeth train station. pic.twitter.com/9Wwn21cbx0 — Chris Bollwage (@MayorBollwage) 19 September 2016 There is no threat to public safety as the package is being secured and investigated. — Chris Bollwage (@MayorBollwage) 19 September 2016 FBI Bomb Squad is on scene and continuing the investigation at the train station in Midtown Elizabeth. pic.twitter.com/qvmzsgisjC — Chris Bollwage (@MayorBollwage) 19 September 2016