breaking news
national swimmer
-
ఆటల కోటపై... గెలుపు జెండా!
‘నేను ఇలా ఉండకూడదేమో’ అని ఆత్మవిశ్లేషణ చేసుకుంది ప్రబ్లీన్ కౌర్ గిల్. తన లైఫ్స్టైల్లో క్రమశిక్షణ లోపించడాన్ని దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది, ఆ తరువాత ఆటలపై దృష్టి పెట్టింది. ఆటలు క్రమశిక్షణ నేర్పిస్తాయి కదా!... ఇప్పుడు ప్రబ్లీన్ కౌర్ ఆసియా నెంబర్ వన్ స్ట్రీట్లిఫ్టర్, కాలిస్థెనిక్స్ అథ్లెట్....‘స్ట్రీట్ లిఫ్టింగ్’ అనేది కాంపిటేటివ్ స్ట్రెంత్ స్పోర్ట్. దీనిలో కోర్ మూమెంట్స్...మజిల్–అప్, పుల్–అప్, డిప్, స్క్వాట్. 13.75 కిలోల బరువుతో ప్రబ్లీన్ చేసిన మజిల్–అప్ జాతీయ రికార్డ్. 37.5 కిలోల బరువుతో చిన్–అప్, 65 కిలోల బరువుతో డిప్స్, 115 కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తుంది.ఇన్నర్ ఇంజినీరింగ్పంజాబ్లోని జలంధర్‌లో పుట్టి పెరిగిన ప్రబ్లీన్ జాతీయ స్థాయి స్విమ్మర్ కూడా. ‘ఆటలు నాకు క్రమశిక్షణ నేర్పించాయి’ అని గర్వంగా చెబుతుంది. తనను తాను బాగా అర్థం చేసుకోవడానికి, సరైన గమ్యం ఏమిటో తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది. వాటిలో ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువ.సద్గురు ‘ఇన్నర్ ఇంజినీరింగ్’ చదవడం ఆమె ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చివేసింది. శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రబ్లీన్ రోజూ వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. ఒక స్నేహితురాలి ద్వారా ‘కాలిస్థెనిక్స్’ గురించి తెలుసుకుంది ప్రబ్లీన్. ఆ పరిచయం తన జీవితాన్ని మార్చేసింది. ‘కాలిస్థెనిక్స్’లో ప్రావీణ్యం సాధించిన ప్రబ్లీన్ సింగపూర్ ఒపెన్ను గెలవడం ద్వారా నంబర్‌వన్ ర్యాంకును సాధించింది.సవాళ్లతో...కలోస్ (అందం), స్థెనోస్(బలం) అనే గ్రీకు పదాల నుంచి ‘కాలిస్థెనిక్స్’ వచ్చింది. బాడీ కంట్రోల్ ద్వారా స్ట్రెంత్, గ్రేస్ సాధించే కళ. ‘కాలిస్థెనిక్స్ అనేది శారీరకంగా, మానసికంగా సవాలుతో కూడిన ప్రయాణం. ఎదురుదెబ్బలను నా ప్రయాణంలో భాగంగా చూస్తాను. 365 రోజులు అంతిమ లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణిస్తుంటాను’ అంటుంది ప్రబ్లీన్. తన ప్రయాణంలో శారీరకంగా గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.‘అలాంటి సందర్భాలే మానసిక దృఢత్వాన్ని పరీక్షిస్తాయి. మహిళలు తాము శారీరకంగా ఎలా కనిపిస్తున్నామనేదాని గురించి ఆలోచించడం మానేసి, మానసికంగా ఎంత దృఢంగా ఉన్నామనేదాని గురించి ఆలోచించాలి’ అంటుంది ప్రబ్లీన్.ఫిట్నెస్ క్రియేటర్ఫిట్నెస్ క్రియేటర్, ఇన్ఫ్లూయెన్సర్ కావాలని ప్రబ్లీన్ ఎప్పుడూ అనుకోలేదు. తనలో వచ్చిన మార్పును నమోదు చేసే డిజిటల్ డైరీగా మాత్రమే మొదట్లో తన ఇన్స్టాగ్రామ్ పేజీని చూసేది ప్రబ్లీన్. అయితే అది ఎంతోమందికి ఇష్టమైన పేజీగా మారింది. ప్రస్తుతం ప్రబ్లీన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 200,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ పెరిగేకొద్దీ ఆమె కంటెంట్ ప్రభావం కూడా పెరుగుతూ వచ్చింది.‘మీ వీడియోలు చూసిన తరువాతే మొదటి పుష్–అప్, పుల్–అప్‌కు ప్రయత్నించాను’ అని ప్రబ్లీన్‌కు మెసేజ్‌లు వస్తుంటాయి. ‘అవి నాకు చాలా గొప్పగా అనిపిస్తాయి. నేను ప్రజల కోసం ఏదైనా చేయగలనని గ్రహించాను’ అంటుంది ప్రబ్లీన్.‘వరల్డ్ ఛాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని తన భవిష్యత్ లక్ష్యం గురించి గట్టిగా చెబుతోంది ప్రబ్లీన్ కౌర్ గిల్. జీరో నుంచి...కాలిస్థెనిక్ చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. మీరు 360 లేదా ఫ్యాన్సీ మూవ్స్‌తో ప్రారంభించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సున్నా నుంచే మొదలుపెడతారు. కాలిస్థెనిక్ నాకు ధ్యానం లాంటిది. మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి, బలంగా ఉండేలా చేయడానికి కాలిస్థెనిక్ ఉపయోగపడుతుంది.–ప్రబ్లీన్ కౌర్ గిల్ -
నేషనల్ లెవెల్ స్విమ్మర్ ఉరేసుకుంది
ముంబయి: జాతీయ స్థాయి స్విమ్మర్ ఆత్మహత్యకు పాల్పడింది. వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఆమె ఉరేసుకుని ప్రాణాలువిడిచింది. ముంబయిలోని లోవర్ పారెల్‌లోని ఆమె నివాసంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తనిక ధార(23) అనే యువతి జాతీయస్థాయి స్విమ్మర్. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి అక్వాటిక్స్ లో పాల్గొని వెండిపతకాన్ని సాధించింది. అంతకుముందు 35వ తిరువనంతపురం నేషనల్ గేమ్స్(2015) క్రీడల్లో పాల్గొని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జూనియర్ క్లెర్క్గా పనిచేస్తోంది. తొలుత తన స్నేహితురాలు ఇంటికెళ్లి ఆమెను పలుమార్లు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులను తీసుకొని రాగా వారు తలుపు బద్ధలు కొట్టి చూశారు. ఆ సమయంలో కిటికీ ఉన్న చువ్వకు ఉరేసుకుని ఆమె కనిపించింది. అప్పటికప్పుడు ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు శోధిస్తున్నారు.


