నేత్రదానం చేసిన టాప్ కమెడియన్!
దేశంలోనే నంబర్ వన్ కమెడియన్‌గా పేరొందిన కపిల్ శర్మ ఓ స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్‌ను ఇటీవల గెలుపొందిన భారత అంధుల క్రికెట్ జట్టు తాజాగా ద కపిల్ శర్మ షోలో పాల్గొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన నేత్రదానం ప్రకటన చేశారు.
'మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో స్ఫూర్తి పొందిన పలువురు ఆయన అభిమానులు కూడా నేత్రదానానికి ముందుకొస్తున్నారు.