breaking news
NATA Telugu Mahasabhalu
-
నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వనం అందింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్, సభ్యులు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లి.. ఆయన్ని కలిసి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించిన వాళ్లలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, నాటా సభ్యులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. -
నాటా తెలుగు మహాసభలకు తారాగణం
హైదరాబాద్ : ఉత్తర అమెరికా డల్లాస్ నగరంలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న నాటా తెలుగు మహాసభలకు తెలుగు తారలు తరలివస్తున్నారని నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహా సభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సినీ ప్రముఖులు రకుల ప్రీత్‌సింగ్, నిత్యా మీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని, సుధీర్‌బాబు, వరుణ్‌తేజ్ తదితరులు సభలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీరెడ్డి, హరీష్ శంకర్, మధుర శ్రీధర్, మేర్లపాక గాంధీ తదితరులు తమ అనుభవాలు పంచుకోవడానికి నాటా మహాసభలకు హాజరుకానున్నారని సాంస్కతిక కార్యక్రమాల నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డిలు తెలిపారు.