breaking news
Naresh Malhotra
-
సైబర్ నేరగాళ్లపై ‘హంటర్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు కీలక ఆధారం అవుతున్న మ్యూల్ ఖాతాలకు, లావాదేవీలకు చెక్ చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) రూపొందించిన ఏఐ టూల్ మ్యూల్‌హంటర్.ఏఐ వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని ఇప్పటికే దాదాపు 15 బ్యాంకులు వినియోగిస్తుండగా మిగిలిన వాటికీ విస్తరించనున్నారు. ఈ టూల్ ద్వారా అనుమానిత బ్యాంకు ఖాతాలతో పాటు లావాదేవీలను గుర్తించడం, బ్లాక్ చేయ డం తేలికవుతుంది. ఫలితంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఖాతాల ఆధారంగానే స్కామ్స్.. » కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి మరీ వివిధ రకాలైన సైబర్ నేరాలు చేయిస్తున్న సూత్రధారులు ఇటీవలి కాలంలో విదేశాల్లోనే ఉండి కథ నడుపుతున్నారు. వీళ్లు బా«ధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తమ ఖాతాలు వినియోగించరు. వివిధ మార్గాల్లో దళారుల్ని గుర్తించి వారి ద్వారా చిరుద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులకు ఎరవేస్తారు. వీరి కేవైసీ వివరాలతో, బోగస్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.వీటికి సంబంధించిన డెబిట్ కార్డులు, చెక్‌బుక్స్ తదితరాలు తీసుకునే దళారులు వాటిని సూత్రధారులకు పంపిస్తూ ఉంటారు. ఈ ఖాతాల (మ్యూల్) ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్లు తీసుకునే వారిని మనీ మ్యూల్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ మనీ మ్యూల్స్‌కు, వారి ఖాతాలకు చెక్ పెట్టడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.95% కచ్చితత్వం.. ఆర్బీఐహెచ్ గత ఏడాది డిసెంబర్లో ఈ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఆయా బ్యాంకుల్లో ప్రభావవంతంగా పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను ఈ టూల్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన ఖాతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ అంశంలో దీని కచ్చితత్వం 95 శాతం ఉన్నట్లు తేల్చారు. కొత్తగా తెరిచిన ఖాతాల్లో లేదా వినియోగంలో ఉన్న వాటిలో అకస్మాత్తుగా భారీ మొత్తాలతో లావాదేవీలు జరిగినా అప్రమత్తం చేస్తుంది. నగదు డిపాజిట్ అయినా, విత్‌డ్రా అయినా అలెర్ట్ చేయడంతో పాటు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంది. ఒకే చిరునామాతో అనేక బ్యాంకు ఖాతాలు తెరిచినా పసిగట్టడంతో పాటు ఈ–కేవైసీనీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏఐ టూల్ ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ అథెంటిసిటీలను తనిఖీ చేయగలదు. నరేష్ మల్హోత్రా కేసు కలకలం ఇటీవలి కాలంలో తరచూ డిజిటల్ అరెస్టు మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందంటూ, పోలీసు, ఇతర ఏజెన్సీల అధికారులుగా ఫోన్లు, వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు తమ కష్టార్జితం రూ.లక్షల నుంచి రూ.కోట్లు కూడా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చోటు చేసుకున్న నరేష్ మల్హోత్రా ఉదంతం అన్ని దర్యాప్తు ఏజెన్సీలను కదిలించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన మల్హోత్రా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య ‘డిజిటల్ అరెస్టు’లో రూ.23 కోట్లు కోల్పోయారు. అన్ని బ్యాంకులు మ్యూల్ హంటర్‌ను వినియోగిస్తే ఈ నేరం జరిగేది కాదని, జరిగినా అత్యధిక మొత్తం ఫ్రీజ్ అయ్యేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు ఈ టూల్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. -
అమలా.. ఆవో
సౌత్‌లో సక్సెస్ సాధించిన కథానాయిక అమలాపాల్.. ఇప్పుడు నార్త్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు బీ టౌన్ నుంచి పిలుపు వచ్చింది. అర్జున్ రామ్‌పాల్ హీరోగా రూపొంద్నున్న ఓ హిందీ థ్రిల్లర్ మూవీలో అమలాపాల్ నటించనున్నారు. నరేశ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుందట. ‘‘బాలీవుడ్లో తొలి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నరేశ్ చెప్పిన స్టోరీ నచ్చింది. ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో కూడా జరగనుంది. నేను ఎగై్జట్ అయ్యే విషయాల్లో ఇదొకటి. ఈ సినిమా డిస్కషన్స్‌లో భాగంగా అర్జున్‌తో మాట్లాడుతున్నప్పుడు హిందీ భాషపై నాకు ఎంత గ్రిప్ ఉందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒక టైమ్‌లో నేను ఢిల్లీలో స్టే చేయడం వల్ల హిందీ భాషపై మంచి అవగాహన ఉంది. కానీ, ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ నాకు ప్లస్ అవుతాయనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అమల. ట్రావెలింగ్‌ను అమల లైక్ చేస్తారు. అందుకేనేమో.. హిమాలయాల్లో షూటింగ్ అనగానే ఎగై్జట్ అయ్యుం టారని ఊహించవచ్చు. -
పూనమ్‌పాండే ‘ఫేస్బుక్’ గల్లంతు
సోషల్ నెట్వర్క్ వెబ్సైట్లలో నిత్యం సందడి చేసే బాలీవుడ్ భామ పూనమ్ పాండే ‘ఫేస్బుక్’ ఖాతా గల్లంతైంది. డీయాక్టివేట్ అయిన ‘ఫేస్బుక్’ ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఆమె తెగ బాధపడుతోంది. ‘నా ఫేస్బుక్ ఖాతాకు 21 లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇది డీయాక్టివేట్ కావడం చాలా బాధగా ఉంది. తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎవరైనా చెప్పరూ..’ అంటూ ‘ట్విట్టర్’లో తన అభిమానులను అభ్యర్థిస్తోంది. ముగ్ధాగాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు బాలీవుడ్ భామ ముగ్ధా గాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటోంది. నరేశ్ మల్హోత్రా దర్శకత్వంలోని ‘ఇష్క్నే క్రేజీ కియా’ చిత్రంలోని కార్పొరేట్ మహిళ పాత్ర పోషించనున్న ముగ్ధా, కొద్ది రోజులుగా మేనేజ్మెంట్ పాఠాలతో కుస్తీలు పడుతోంది. తన పాత్ర మరింత సహజంగా ఉండాలనే తపనతో బడా బడా కార్పొరేట్ మహిళా అధికారుల వద్ద చిట్కాలు తెలుసుకుంటూ, వారిని దగ్గరగా పరిశీలిస్తోంది.


